విద్యార్థులు ఎక్కడి నుంచైనా సరే ఆన్లైన్ (Online) పరీక్షలకు హాజరయ్యేందుకు వీలు కల్పించేలా జేఎన్టీయూ (అనంతపురం) సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. ఈ విధానాన్ని ముఖ్యంగా బీటెక్ (BTech) సెమిస్టర్ మెయిన్ పరీక్షల్లో అమలు చేసేందుకు జేఎన్టీయూ (ఏ) కసరత్తు చేస్తుంది.
జేఎన్టీయూ (అనంతరంపురం) విద్యార్థుల సౌకర్యం కోసం కొత్త పరీక్ష విధానం ప్రవేశపెట్టింది. విద్యార్థులకు ఆండ్రాయిడ్ మొబైల్ (Mobile) , ల్యాప్‌టాప్ (Laptop), ట్యాబ్ (Tab) వీటిలోఏదో ఒకటి ఉంటే చాలు. పరీక్ష హాలుకు వెళ్లాల్సిన పనిలేకుండా ఉన్నచోటి నుంచే ఆన్లైన్ (Online)లో పరీక్ష రాసేయొచ్చు. విద్యార్థులు ఎక్కడి నుంచైనా సరే ఆన్లైన్ పరీక్షలకు హాజరయ్యేందుకు వీలు కల్పించేలా జేఎన్టీయూ (అనంతపురం) ఈ సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. ఈ విధానాన్ని ముఖ్యంగా బీటెక్ సెమిస్టర్ మెయిన్ పరీక్షల్లో అమలు చేసేందుకు జేఎన్టీయూ (ఏ) కసరత్తు చేస్తుంది. అయితే ముందుగా ఈ విధానాన్ని బీటెక్ (BTech) మిడ్ పరీక్ష ల్లో అమలు చేస్తోంది. దీనికి సంబంధించి పైలట్ ప్రాజెక్టుగా జేఎన్టీయూ అనంతపురం క్యాంపస్ ఇంజనీరింగ్ కళాశాల (Engineering College) లో జరిగిన మిడ్ పరీక్షల్లో ఈ విధానాన్ని ప్రారంభించింది.
ఈ పరీక్ష విధానం.. ఫీడ్ బ్యాక్‌ను పరిశీలించిన తరువాత, అనుబంధ కళాశాలల్లో సెమిస్టర్ పరీక్షలను ఈ కొత్త విధానంలో నిర్వహించే ఏర్పాటు చేస్తున్నట్టు జేఎన్టీయూ (అనంతపురం) వీసీ జింకా రంగజనార్ధన్ వెల్లడించారు.
ఆన్లైన్ పరీక్ష నిర్వహించే విధానం..
Step 1: ఈ ఆన్లైన్ పరీక్ష నిర్వహణ కోసం జేఎన్టీయే (ఏ) ప్రత్యేక వెబ్‌పోర్టల్ (Web portal) ను ఏర్పాటు చేసింది.
Step 2: విద్యార్థి ముందుగా ఈ వెబ్‌పోర్టల్‌కు వెళ్లాలి.
Step 3: అనంతరం అందులో విద్యార్థికి ఇచ్చిన యూజర్ ఐడీ (User Id), పాస్‌వర్డ్‌ను నమోదు చేయాలి.
అదే బాటలో ఎన్ఐఓఎస్
అంతే కాకుండా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (NIOS) ఈ ఆన్లైన్ బోర్డు విధానాన్నితీసుకురానుంది. వర్చువల్ స్కూల్‌ను దేశంలో తొలిసారి అమలు చేయనుంది. కరోనా(Corona) కారణంగా వ్యక్తిగత తరగతులు నిర్వహించడం కష్టంగా మారడం, భవిష్యత్తులో పరీక్షలకు ఎలాంటి అడ్డంకులు రాకుండా ఉండేందుకు ఆన్లైన్ బోర్డు విధానాన్ని అనుసరించనుంది. మెటీరియల్స్, ఆన్లైన్ పరీక్షల(Online Exams) నిర్వహణ కోసం డిజిటల్ లైబ్రరీని(Digital Library) సైతం ఏర్పాటు చేయనున్నారు.సాంకేతిక పరిజ్ఞాన్ని పూర్తిస్థాయిలో వినియోగించి ఆన్లైన్ (Online) పరీక్షల నిర్వహణ ద్వారా విద్యార్థి పర్ఫార్మెన్స్ను ఎన్‌ఐఓస్ నిర్ణయించనుంది. ఫిజికల్ క్లాసులు నిర్వహించేందుకు పరిస్థితులు ఎప్పుడు అనుకూలిస్తాయో తెలియని పరిస్థితుల్లో ఈ విధానం చాలా ఉపయోగపడుతుందని ఉన్నతాధికారులు తెలపుతున్నారు.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.