హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

JK Cement Scholarship: ఆ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రూ.35 కోట్ల విలువైన స్కాలర్‌షిప్‌ ప్రకటన.. పూర్తి వివరాలు ఇవే..

JK Cement Scholarship: ఆ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రూ.35 కోట్ల విలువైన స్కాలర్‌షిప్‌ ప్రకటన.. పూర్తి వివరాలు ఇవే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

JK Cement Scholarship: జేకే సిమెంట్ గోల్డెన్ బ్యాచ్‌లోని ప్రతిభావంతులైన, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు రూ.35 కోట్ల విలువైన స్కాలర్‌షిప్‌లు అందించనున్నట్లు ప్రకటించింది. టెక్నాలజీ సర్టిఫికేషన్‌, శిక్షణ కోసం SPSU అకడమిక్ ఫీజులో 65% మాఫీ చేస్తుంది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

2007లో ఉదయపూర్‌లో సర్ పదంపట్ సింఘానియా యూనివర్సిటీ(SPSU-Sir Padampat Singhania University)ని జేకే సిమెంట్‌ గ్రూప్‌(JK Cement Group) ప్రారంభించింది. ప్రస్తుతం ప్రతిభావంతులకు, వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థులకు రూ.35 కోట్ల విలువైన స్కాలర్‌షిప్‌ల (Scholarships)ను అందించనున్నట్లు జేకే సిమెంట్‌ ప్రకటించింది. ఈ ప్రైవేటు విశ్వవిద్యాలయం అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, Ph.D కోర్సులను అందిస్తుంది. విశ్వవిద్యాలయం పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థులలో నైపుణ్యాలను పెంపొందించడానికి ప్రాధాన్యం ఇస్తుంది. ఇందుకోసం పలు ప్రముఖ సంస్థలతో కూడా ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇందులో భాగంగానే ప్రస్తుతం 2022 గోల్డెన్‌ బ్యాచ్‌ ప్రోగ్రాం లాంచ్‌ చేసింది.

* 2020 గోల్డెన్‌ బ్యాచ్‌ ప్రారంభం

ఇంజినీరింగ్‌, మేనేజ్‌మెంట్ విద్యార్థులు అకడమిక్ ఎక్సలెన్స్ సాధించడానికి, ఎక్స్‌పెరిమెంటల్‌ లెర్నింగ్‌పై దృష్టి పెట్టడానికి వర్సిటీ చర్యలు తీసుకుంటోంది. 2022 గోల్డెన్ బ్యాచ్‌కు పరిశ్రమ నిపుణుల ద్వారా శిక్షణ అందుతుంది. ఇంటర్న్‌షిప్‌లు, ధృవపత్రాలు, ప్లేస్‌మెంట్ అవకాశాలు ఉంటాయి. ఇందుకోసం 15+ ప్రముఖ కార్పొరేట్‌ సంస్థలతో SPSU పారిశ్రామిక భాగస్వామ్యంలోకి ప్రవేశించింది. విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్యను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. బోధన, పాఠ్యప్రణాళికల్లో మార్పులతో విద్యార్థులను భవిష్యత్తు నాయకులుగా తీర్చిదిద్దుతామని వివరించింది.

* రూ.35 కోట్ల విలువైన స్కాలర్‌షిప్‌లు

అదనంగా జేకే సిమెంట్ గోల్డెన్ బ్యాచ్‌లోని ప్రతిభావంతులైన, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు రూ.35 కోట్ల విలువైన స్కాలర్‌షిప్‌లు అందించనున్నట్లు ప్రకటించింది. టెక్నాలజీ సర్టిఫికేషన్‌, శిక్షణ కోసం SPSU అకడమిక్ ఫీజులో 65% మాఫీ చేస్తుంది.

* దరఖాస్తు గడువు సెప్టెంబరు 30

SPSUలోని డిజిటల్ లైబ్రరీలో ప్రముఖ జర్నల్‌లు, వేలాది ఆన్‌లైన్ లెర్నింగ్ సోర్సెస్‌ను వినియోగించుకునే సదుపాయం కల్పించింది. SPSU గురించి మరింత తెలుసుకోవడానికి, అడ్మిషన్ కోసం ఈ వెబ్‌సైట్‌ని https://apply.spsu.ac.in సంప్రదించవచ్చు. పరిశ్రమ సంబంధిత పాఠ్యాంశాల్లో అగ్రగామిగా ఉన్న SPSU, 2022 బ్యాచ్‌కి దరఖాస్తు చేయడానికి సెప్టెంబర్ 30ని చివరి తేదీగా ప్రకటించింది.

ఇది కూడా చదవండి : బార్క్ లో ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేదు.. రూ.70వేలకు పైగా జీతం..

* ప్రముఖ సంస్థలతో ఒప్పందం

SPSU కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్ రంగంలో శిక్షణ అందించడానికి ఇంటెల్‌, మైక్రోసాఫ్ట్‌, అమెజాన్‌, TCSiON, Xebia వంటి ప్రముఖ సంస్థలతో కలిసి పని చేస్తోంది. అభివృద్ధి చెందుతున్న లాజిస్టిక్స్ సిస్టమ్‌లలో శిక్షణను అందించడానికి బ్యూమర్ గ్రూప్‌తో కలిసి పనిచేస్తోంది. అదేవిధంగావిద్యార్థులకు అడ్వాన్స్ మైనింగ్, సిమెంట్ టెక్నాలజీలో జేకే సిమెంట్, హిందుస్థాన్ జింక్, GHH ఫహ్ర్జ్యూజ్, FL స్మిడ్త్, గెయిన్‌వెల్ శిక్షణ ఇస్తున్నాయి.

వినూత్న బోధనా విధానాన్ని హైలైట్ చేస్తూ SPSU వైస్ ఛాన్సలర్, ప్రెసిడెంట్ డాక్టర్ పద్మకాళి బెనర్జీ మాట్లాడుతూ.. స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, టెక్-ఎనేబుల్డ్ కరికులమ్ మా విద్యార్థులకు ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్ రంగంలో ఉత్తమ నైపుణ్యాలు అందిస్తుంది. SPSUలో విద్యార్థులకు టింకరింగ్ ల్యాబ్, రోబోటిక్స్ ల్యాబ్, అడ్వాన్స్‌డ్ ఆటోమేషన్ ల్యాబ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ & మెషిన్ లెర్నింగ్ ల్యాబ్‌తో పాటు బిజినెస్ అనలిటిక్స్ సిమ్యులేషన్ ల్యాబ్ ఉన్న అల్ట్రా-మోడర్న్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు యాక్సెస్ ఉందని చెప్పారు.

Published by:Sridhar Reddy
First published:

Tags: Career and Courses, EDUCATION, JOBS, Scholarship

ఉత్తమ కథలు