Home /News /jobs /

JJE ADVANCED REGISTRATIONS START IF YOU DO THIS YOU CAN APPLY EASILY UMG GH

JEE Advanced: జేఈఈ అడ్వాన్స్‌డ్ రిజిస్ట్రేషన్‌లు ప్రారంభం .. ఇలా చేస్తే సులభంగా దరఖాస్తు చేయొచ్చు !

  జేజేఈ అడ్వాన్స్‌డ్  రిజిస్ట్రేషన్‌లు ప్రారంభం .. ఇలా చేస్తే సులభంగా దరఖాస్తు చేయొచ్చు !

జేజేఈ అడ్వాన్స్‌డ్ రిజిస్ట్రేషన్‌లు ప్రారంభం .. ఇలా చేస్తే సులభంగా దరఖాస్తు చేయొచ్చు !

జేఈఈ(JEE) మెయిన్స్‌లో టాప్ 2.5 లక్షలలోపు ర్యాంకు సొంతం చేసుకున్నవారు జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధిస్తారు. ఇప్పటికే జేఈఈ అడ్వాన్స్‌డ్-2022 రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ jeeadv.ac.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India
జేఈఈ మెయిన్స్‌లో టాప్ 2.5 లక్షలలోపు ర్యాంకు(Rank) సొంతం చేసుకున్నవారు జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధిస్తారు. ఇప్పటికే జేఈఈ అడ్వాన్స్‌డ్-2022 రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ jeeadv.ac.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఆగస్టు 11గా నిర్ణయించారు. కాగా, జేఈఈ అడ్వాన్స్‌డ్-2022 పరీక్ష ఆగస్టు 28న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ- బొంబాయి (IIT Bombay) చేపట్టనుంది. జేఈఈ అడ్వాన్స్‌డ్ ద్వారా ఐఐటీల్లో ప్రవేశాలు కల్పించనున్న సంగతి తెలిసిందే.

జేఈఈ అడ్వాన్స్‌డ్-2022: అవసరమయ్యే డాక్యుమెంట్లు

జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తు చేసే సమయంలో ప్రధానంగా ఈ సర్టిఫికెట్లు అవసరమవుతాయి.

- 10వ తరగతి సర్టిఫికేట్(Certificate) లేదా బర్త్ సర్టిఫికెట్
- 12వ తరగతి లేదా అందుకు సమానమైన పరీక్ష సర్టిఫికెట్లు
- కేటగిరి, పీడబ్ల్యూడీ లేదా డీఎస్ సర్టిఫికేట్ (వర్తిస్తే)
- స్క్రైబ్ లెటర్ (వర్తిస్తే)
- పీఐఓ కార్డ్ లేదా ఓసీఐ సర్టిఫికేట్(అవసరమైతే).

జేఈఈ అడ్వాన్స్‌డ్-2022 దరఖాస్తు విధానం

స్టెప్-1: అధికారిక వెబ్‌సైట్ jeeadv.ac.inను సందర్శించాలి

స్టెప్-2: జేఈఈ మెయిన్ -2022 అప్లికేషన్ నెంబర్, పాస్‌వర్డ్ వంటి లాగిన్ వివరాలను నమోదు చేయాలి.

స్టెప్-3: ప్రాథమిక వివరాలతో రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తిచేయండి.

స్టెప్-4: స్పెసిఫికేషన్స్ ప్రకారం అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయండి

స్టెప్-5: అప్లికేషన్ ఫీజును చెల్లించండి

స్టెప్-6: వివరాలను ప్రివ్యూ చూసిన తరువాత అప్లికేషన్‌ను సబ్‌మిట్ చేయండి

జేఈఈ అడ్వాన్స్‌డ్-2022 కోసం మహిళా అభ్యర్థులు రూ.1400, ఎస్సీ, ఎస్టీ, పీడబ్లూడీ అభ్యర్థులతో పాటు ఇతరులు రూ.2,800 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. JEE అడ్వాన్స్‌డ్-2022 పరీక్ష ఆగస్టు 28న జరగనుంది. ఇందులో 2 పేపర్లు ఉంటాయి. జేఈఈ అడ్వాన్స్‌డ్-2022 పేపర్-1 ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, పేపర్ 2 మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు జరగనుంది. అభ్యర్థులు రెండు పేపర్లకు తప్పనిసరిగా హాజరు కావాలి.

ఇదీ చదవండి: Ramayana Quiz: రామాయణం పోటీల్లో విజేతలుగా ముస్లిం విద్యార్థులు.. వీరు చెప్పిన మాటలు చదివితే ఆశ్చర్య పోతారు !



జేఈఈ అడ్వాన్స్‌డ్-2022 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(CBT). రెండు లాంగ్వేజ్‌‌లైన హిందీ(Hindi), ఇంగ్లిష్‌లో మొత్తంగా ఆరు గంటల పాటు పరీక్ష జరుగుతుంది. ప్రతి ఏడాది మార్కింగ్ స్కీమ్ మారుతూ ఉంటుంది. తప్పు సమాధానాలకు నెగటివ్ మార్క్స్ ఉండే అవకాశం ఉంది. అయితే ఇది కొన్ని ప్రశ్నలకు మాత్రమే ఉండవచ్చు. మార్కింగ్ స్కీమ్ వివరాలు ‘ఇన్‌స్ట్రక్షన్ టూ క్యాండిడేట్స్’ సెక్షన్‌లో పరీక్ష సమయంలో అభ్యర్థులకు అందుబాటులో ఉంచనున్నారు. ప్రతి పేపర్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ అనే మూడు భాగాలు ఉంటాయి.



జేఈఈ అడ్వాన్స్‌డ్ జాతీయ స్థాయి ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష. జాయింట్ అడ్మిన్ బోర్డు (JAB) ఆధ్వర్యంలో ఐఐటీ ఖరగ్‌పూర్, ఐఐటీ కాన్పూర్, ఐఐటీ మద్రాస్, ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ బాంబే, ఐఐటీ గౌహతి, ఐఐటీ రూర్కీ వంటి ఏడు ఐఐటీలు లేదా ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc) బెంగళూరు జేఈఈ అడ్వాన్స్‌డ్‌ను నిర్వహిస్తాయి.
Published by:Mahesh
First published:

Tags: Career and Courses, IIT Bombay, Jee, JOBS

తదుపరి వార్తలు