Jobs: బీబీనగర్ ఎయిమ్స్‌లో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

AIIMS Bibinagar Recruitment 2020 | బీబీనగర్‌లోని ఎయిమ్స్‌లో గ్రూప్ బీ, గ్రూప్ సీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఖాళీల వివరాలు తెలుసుకోండి.

news18-telugu
Updated: August 1, 2020, 11:46 AM IST
Jobs: బీబీనగర్ ఎయిమ్స్‌లో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
Jobs: బీబీనగర్ ఎయిమ్స్‌లో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
తెలంగాణలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్-AIIMS లో ఉద్యోగాల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. ఇప్పటికే పలు నోటిఫికేషన్ల ద్వారా ఖాళీల భర్తీ జరిగింది. ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల్ని భర్తీచేసింది జవహర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్-JIPMER. ఇప్పుడు గ్రూప్ బీ, గ్రూప్ సీ పోస్టుల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 10 ఖాళీలు ఉన్నాయి. అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటీవ్ ఆఫీసర్, ఎగ్జిక్యూటీవ్ అసిస్టెంట్, పర్సనల్ అసిస్టెంట్, లోయర్ డివిజన్ క్లర్క్ లాంటి పోస్టులున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ 2020 జూలై 29న ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2020 ఆగస్ట్ 31 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాల కోసం జిప్‌మర్ అధికారిక వెబ్‌సైట్ https://main.jipmer.edu.in/ చూడొచ్చు.

AIIMS Bibinagar Recruitment 2020: ఖాళీల వివరాలు ఇవే...



మొత్తం ఖాళీలు- 10
అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటీవ్ ఆఫీసర్- 1
ఎగ్జిక్యూటీవ్ అసిస్టెంట్- 1
పర్సనల్ అసిస్టెంట్- 2
టెక్నీషియన్ (ల్యాబరేటరీ)- 1లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్- 1
వార్డెన్ (హాస్టల్ వార్డెన్)- 2
స్టెనోగ్రాఫర్- 1
లోయర్ డివిజన్ క్లర్క్- 1

AIIMS Bibinagar Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2020 జూలై 29
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 ఆగస్ట్ 31 సాయంత్రం 4.30 గంటలు
విద్యార్హత- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. వివరాలు నోటిఫికేషన్‌లో తెలుసుకోవచ్చు.
దరఖాస్తు ఫీజు- జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.1,500. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.1,200. దివ్యాంగులకు ఫీజు లేదు.
Published by: Santhosh Kumar S
First published: August 1, 2020, 11:46 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading