JIPMER Recruitment 2020: నిరుద్యోగులకు శుభవార్త.. రూ.67,700 వేతనంతో ఉద్యోగాలు

నిరుద్యోగులకు జవహర్లాల్ ఇనిస్ట్యూట్ ఆఫ్ పోస్టుగ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, పాండిచ్చేరి(JIPMER) శుభవార్త చెప్పింది. తాజాగా 33 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది.

news18-telugu
Updated: November 27, 2020, 11:38 AM IST
JIPMER Recruitment 2020: నిరుద్యోగులకు శుభవార్త.. రూ.67,700 వేతనంతో ఉద్యోగాలు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
నిరుద్యోగులకు జవహర్లాల్ ఇనిస్ట్యూట్ ఆఫ్ పోస్టుగ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, పాండిచ్చేరి(JIPMER) శుభవార్త చెప్పింది. తాజాగా 33 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. సీనియర్ రెసిడెంట్ విభాగంలో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం డిసెంబర్ 7, డిసెంబర్ 9న ఇంటర్వ్యూ నిర్వహించనున్నట్లు తెలిపింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ రోజు ఇంటర్వ్యూలకు హారు కావాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులకు రూ. 67, 700 వరకు వేతనం చెల్లించనున్నారు.

ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..

అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు డిసెంబర్ 7, 9న ఇంటర్వ్యూలకు హాజరు కావాలి. ఏ విభాగం అభ్యర్థి ఏ తేదీన ఇంటర్వ్యూకు హాజరు కావాలన్న విషయాన్ని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఇంటర్వ్యూకు హాజరైన అభ్యర్థులకు ఉదయం 8.30 గంటలకు రాత పరీక్ష నిర్వహిస్తారు. అభ్యర్థులు JIPMER ACADEMIC CENTRE, JIPMER, PUDUCHERRY ఈ అడ్రస్ కు ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది.
అభ్యర్థులు ఈ కింది పత్రాలను వెంట తీసుకురావరాల్సి ఉంటుంది..
1. నింపిన దరఖాస్తు ఫారం, బయో డేటా
2. ఒరిజినల్ సర్టిఫికేట్లు, ఒక సెల్ఫ్ అటెస్టెడ్ కాపీ
3.ఆన్లైన్లో ఫీజు చెల్లింపులకు సంబంధించిన ప్రింట్ అవుట్ కాపీ

విద్యార్హత:
MCI గుర్తించిన ఏదైనా పోస్టు గ్రాడ్యుయేట్ మెడికల్ డిగ్రీ(MD/MS/DNB)ని గుర్తింపు పొందిన యూనివర్సిటీల నుంచి పొందిన వారు దరఖాస్తుకు అర్హులు.
వయస్సు:
దరఖాస్తు చేసే అభ్యర్థుల వయస్సు డిసెంబర్ 7 నాటికి 45 ఏళ్లకు మించకూడదు.
Notification-Direct Link
Official Website-Direct Link
Published by: Nikhil Kumar S
First published: November 27, 2020, 11:34 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading