Home /News /jobs /

JIO INSTITUTE WELCOMES STUDENTS TO ITS FOUNDING BATCH NS

Jio Institute: జియో ఇనిస్టిట్యూట్ మొదటి బ్యాచ్ ప్రారంభం.. ప్రత్యేకతలివే..

నీతా అంబానీ

నీతా అంబానీ

ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన జియో ఇనిస్టిట్యూట్ తన మొట్టమొదటి బ్యాచ్ ఇనాగరేషన్ ప్రొగ్రామ్ ను ఈ రోజు ఘనంగా నిర్వహించింది. ఈ ప్రోగ్రామ్ కు విద్యార్థులు, తల్లిదండ్రులు, జియో ఇనిస్ట్యిట్యూట్ నిర్వాహకులు, స్టాఫ్, రిలయన్స్ ఫ్యామిలీ సభ్యులు హాజరయ్యారు.

ఇంకా చదవండి ...
    ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన జియో ఇనిస్టిట్యూట్ తన మొట్టమొదటి బ్యాచ్ ఇనాగరేషన్ ప్రొగ్రామ్ ను ఈ రోజు ఘనంగా నిర్వహించింది. ఈ ప్రోగ్రామ్ కు విద్యార్థులు, తల్లిదండ్రులు, జియో ఇనిస్ట్యిట్యూట్ నిర్వాహకులు, స్టాఫ్, రిలయన్స్ ఫ్యామిలీ సభ్యులు హాజరయ్యారు. జియో ఇనిస్టిట్యూట్ తన మొదటి బ్యాచ్ ను రెండు ఇంటిగ్రల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రొగ్సామ్ తో ప్రారంభిస్తోంది. అవి ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ & డేటా సైన్స్ మరియు డిజిటల్ మీడియా & మార్కెటింగ్ కమ్యూనికేషన్స్. ఇందుకు సంబంధించిన తరగతులు రేపటి నుంచి అంటే జులై 21 నుంచి ప్రారంభం కానున్నాయి. మొదటి బ్యాచ్ లో 19 రాష్ట్రాల నుంచి ఇంకా ఇండియా, సౌత్ ఆఫ్రిక, భూటాన్, నేపాల్, ఘన నుంచి విద్యార్థులు హాజరయ్యారు. ఒక సంవత్సరం పోస్ట్-గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లు రెండూ ప్రసిద్ధ అధ్యాపకులచే బోధించబడుతున్నాయి. వీరు అగ్ర ప్రపంచ సంస్థలు మరియు పరిశ్రమల నుంచి వచ్చిన వారు కావడం విశేషం.

    రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మరియు రిలయన్స్ ఫౌండేషన్ చొరవతో జియో ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేశారు. అంతర్జాతీయ స్కాలర్లు మరియు ఆలోచనలను ఒకచోట చేర్చడం ద్వారా మంచి ఫలితాలను సాధించడమే లక్ష్యంగా దీనిని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రిలయన్స్ ఫౌండేషన్ ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ వ్యవస్థాపక చైర్‌పర్సన్ నీతా ఎం అంబానీ మాట్లాడుతూ.. భారతదేశంలో ఉన్నత విద్యను పునర్నిర్వచించడానికి మరియు మా వ్యవస్థాపకుడు, మా మామ ధీరూభాయ్ అంబానీ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఈ జియో ఇనిస్టిట్యూట్ ను ఏర్పాట్లు చేశామన్నారు.

    ముఖేష్ అంబానీ నిజమైన దేశభక్తుడని అభివర్ణించారు. మానవాళికి స్థిరమైన మరియు మెరుగైన భవిష్యత్తు కోసం పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువ భారతీయులకు సాధికారత కల్పించే సంస్థను నిర్మించడమే లక్ష్యంగా అతను పని చేస్తున్నాడన్నారు. ఈ ఇనిస్ట్యూట్ కు ప్రతీ బ్యాచ్ కూడా ప్రత్యేకమైనదేనని అన్నారు. అయితే.. మొదటి బ్యాచ్ మాత్రం ఇంకా స్పెషల్ అని అన్నారు.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Jio, Nita Ambani

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు