హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Jio Institute: కొత్త కోర్సులను లాంచ్ చేసిన జియో ఇన్‌స్టిట్యూట్.. పీజీ ప్రోగ్రామ్‌ల కోసం దరఖాస్తుల ఆహ్వానం

Jio Institute: కొత్త కోర్సులను లాంచ్ చేసిన జియో ఇన్‌స్టిట్యూట్.. పీజీ ప్రోగ్రామ్‌ల కోసం దరఖాస్తుల ఆహ్వానం

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

Jio Institute | ముంబై కేంద్రంగా పనిచేసే జియో ఇన్‌స్టిట్యూట్ కొత్త కోర్సులను ప్రారంభించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్, డిజిటల్ మీడియా.. మార్కెటింగ్ కమ్యూనికేషన్ రంగాల్లో ఏడాదికి ఫుల్ టైమ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌ల (PGP) కోసం దరఖాస్తులను ఆహ్వాస్తుంది.

ఇంకా చదవండి ...

ముంబై (Mumbai) కేంద్రంగా పనిచేసే జియో ఇన్‌స్టిట్యూట్ కొత్త కోర్సులను ప్రారంభించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ & డేటా సైన్స్, డిజిటల్ మీడియా & మార్కెటింగ్ కమ్యూనికేషన్ రంగాల్లో ఏడాదికి ఫుల్ టైమ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌ల (PGP) కోసం దరఖాస్తులను ఆహ్వాస్తుంది. ఈ రంగాల్లో సామర్థ్యాలను పెంపొందించడం.. సంస్థలు, సమాజానికి ప్రాక్టికల్‌గా పరిష్కారాలను ఎలా రూపొందించాలో తెలుసుకునే లక్ష్యంతో ఈ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లను నిర్వహిస్తున్నట్లు జియో ఇన్‌స్టిట్యూట్ తెలిపింది. డిజిటల్ మీడియా & మార్కెటింగ్ కమ్యూనికేషన్స్‌ (Digital Media and Marketing Communication) లో పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌ల ద్వారా విద్యార్థులు డిజిటల్ యుగంలో కస్టమర్ అనుభవాన్ని వినూత్నంగా ఎంగేజ్ చేయడం, సేవలు, కమ్యూనికేషన్ తదితర విషయాలను ఎలా నిర్వహించాలనే దానిపై అవగాహన కల్పిస్తామని జియో ఇన్‌స్టిట్యూట్ తెలిపింది.

అర్హత ప్రమాణాలు

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ & డేటా సైన్స్(AI & DS) కోసం అభ్యర్థులు తప్పనిసరిగా కంప్యూటర్ సైన్స్, IT, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ లేదా ఎకనామిక్స్‌లో అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలో కనీసం ఒక కోర్సును పూర్తి చేసి ఉండాలి. ఇక డిజిటల్ మీడియా & మార్కెటింగ్ కమ్యూనికేషన్ (DM & MC)లో పీజీ ప్రోగ్రామ్ కోసం అభ్యర్థులు ఏదైనా విభాగంలో కనీసం మూడు సంవత్సరాల అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అభ్యసించి ఉండాలి. రెండు ప్రోగ్రామ్‌ల కోసమైతే గ్రాడ్యుయేషన్‌లో కనీసం 50 శాతం లేదా సమానమైన CGPA చేసి ఉండాలి. 2022 జూలై 1 నాటికి కనీసం సంబంధిత అంశాల్లో 18 నెలల వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి.

Scholarships: ఉన్నత విద్య కోసం స్కాలర్‌షిప్‌, ఫెలోషిప్ ప్రోగ్రామ్స్.. ఏప్రిల్, మే నెలల్లో అప్లై చేసుకోవాల్సినవి ఇవే

దరఖాస్తు విధానం

స్టెప్1: జియో అధికారిక వెబ్‌సైట్ jio institute.edu.in ను సందర్శించండి

స్టెప్2: ‘అప్లై నౌ’ అనే దానిపై క్లిక్ చేయండి.

స్టెప్3: అప్లికేషన్ ఫారమ్‌ను పూరించి దరఖాస్తు రుసుము రూ.2500 చెల్లించండి

దరఖాస్తు చేసిన వారు ఆన్ లైన్‌లో జియో ఇన్‌స్టిట్యూట్ ప్రవేశ పరీక్ష (జెఇటి)కి హాజరు కావాల్సి ఉంటుంది. ఎంట్రెన్స్ టెస్ట్‌లో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, వెర్బల్ ఎబిలిటీ, రైటింగ్ స్కిల్స్‌పై ప్రశ్నలు ఉంటాయి. లేదంటే దరఖాస్తుదారులు చెల్లుబాటు అయ్యే GRE పరీక్ష స్కోర్‌ను కూడా సమర్పించవచ్చు.  షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులను ఆన్‌లైన్ పర్సనల్ ఇంటర్వ్యూలకు ఆహ్వానించనున్నారు. తుది ఎంపిక కోసం అభ్యర్థుల గత అకడమిక్ రికార్డులను పరిశీలిస్తారు. పని అనుభవం, అవార్డులు, ప్రశంసలు JETలో పనితీరు, వ్యక్తిగత ఇంటర్వ్యూపై ఆధారపడి ఉంటుందని జియో ఇన్‌స్టిట్యూట్ తెలిపింది.

జియో (JIO) ఇన్ స్టిట్యూట్ డిజిటల్ మీడియా & మార్కెటింగ్ కమ్యూనికేషన్స్‌కు ప్రోగ్రామ్ కోసం మెంటార్లను నియమించింది. వైస్‌ఛాన్సలర్, అమెరికాలోని కెల్లాగ్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ మాజీ డీన్, డాక్టర్ దీపక్ జైన్‌తోపాటు శాన్ ఫ్రాన్సి్స్కోలోని రీసెర్చ్ అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ అకాడెమిక్ ప్రోగ్రామ్స్ అసోసియేట్ డీన్ డాక్టర్ ఫ్రాంక్ ముల్హెర్న్ ను నియమించారు.

UGC: ఉన్నత విద్యపై యూజీసీ కీలక నిర్ణయం.. విద్యార్థుల‌కు మ‌రింత సౌల‌భ్యం

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ & డేటా సైన్స్ కోసం ప్రోగ్రామ్ మెంటర్లుగా అమెరికాలోని నార్త్ వెస్ట్రన్ యూనివర్సిటీ కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్ డాక్టర్ లారీ బిర్న్‌బామ్, చీఫ్ డేటా సైంటిస్ట్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ AI/ML, Reliance Jio డాక్టర్ శైలేష్ కుమార్ నియమితులయ్యారు. జియో ఇన్‌స్టిట్యూట్‌ ఫ్యాకల్టీ మెంబర్లుగా MIT, నార్త్‌వెస్టర్న్ యూనివర్సిటీ, NTU, సింగపూర్, జార్జియా స్టేట్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ హ్యూస్టన్, USA, అలెన్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ AI, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలోని ప్రముఖ విద్యావేత్తలు, మేధావులు నియమితులయ్యారు.

Published by:Sharath Chandra
First published:

Tags: EDUCATION, Jio, New course

ఉత్తమ కథలు