Reliance Jio Jobs: రిలయెన్స్ జియోలో ఉద్యోగాల కోసం ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Reliance Jio Careers App | జియోలో ఉద్యోగాలను 'జియో కెరీర్స్' యాప్‌లో సెర్చ్ చేయడమే కాదు... మీరు ఇదే యాప్‌లో అప్లై కూడా చేయొచ్చు. మీ అర్హతలకు తగ్గ ఖాళీలు ఏవైనా కనిపిస్తే మీరు వెంటనే దరఖాస్తు చేయొచ్చు.

news18-telugu
Updated: January 2, 2020, 3:37 PM IST
Reliance Jio Jobs: రిలయెన్స్ జియోలో ఉద్యోగాల కోసం ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Reliance Jio Jobs: రిలయెన్స్ జియోలో ఉద్యోగాల కోసం ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి (ప్రతీకాత్మక చిత్రం, image: Reliance Jio)
  • Share this:
భారతీయ టెలికాం రంగంలో సంచలనాలు, రికార్డులు సృష్టిస్తున్న రిలయెన్స్ జియోలో ఉద్యోగం కోరుకుంటున్నారా? రిలయెన్స్ జియోలో వేర్వేరు విభాగాల్లో పనిచేయడానికి మీకు తగిన అర్హతలు ఉన్నాయా? అయితే మీరు 'Jio Careers' యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. రిలయెన్స్ జియోలో నియామకాలకు సంబంధించిన అప్‌డేట్స్ అన్నీ 'జియో కెరీర్స్' యాప్‌లో ఉంటాయి. బిజినెస్, టెక్నాలజీ, ఫంక్షనల్ కేటగిరీల్లో ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ యాప్‌లో ఉంటాయి. మీరు ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకొని మీ వ్యక్తిగత, విద్యార్హతలు వివరాలతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మీ అర్హతలకు తగ్గ జాబ్ రికమండేషన్స్ యాప్‌లో కనిపిస్తాయి. ఇప్పటికే ఈ యాప్‌ను 1,00,000 సార్లకన్నా ఎక్కువ డౌన్‌లోడ్ చేయడం విశేషం.

జియోలో ఉద్యోగాలను 'జియో కెరీర్స్' యాప్‌లో సెర్చ్ చేయడమే కాదు... మీరు ఇదే యాప్‌లో అప్లై కూడా చేయొచ్చు. మీ అర్హతలకు తగ్గ ఖాళీలు ఏవైనా కనిపిస్తే మీరు వెంటనే దరఖాస్తు చేయొచ్చు. మీ రెజ్యూమ్ అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇలా 'జియో కెరీర్స్' యాప్‌లో ఉద్యోగాలను సెర్చ్ చేయడం, అప్లై చేయడం మాత్రమే కాదు... ఆన్‌లైన్ టెస్టులు కూడా అటెండ్ కావొచ్చు. వీడియో ఇంటర్వ్యూలు కూడా ఉంటాయి. జాబ్ సెర్చ్ దగ్గర్నుంచి ఇంటర్వ్యూ పూర్తై మీరు ఆఫర్ యాక్సెప్ట్ చేసేంతవరకు అన్నీ 'జియో కెరీర్స్' యాప్‌తో సాధ్యం. 'జియో కెరీర్స్' యాప్ డౌన్‌లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

VIDEO: రైలు ఫుట్ బోర్డ్‌పై విన్యాసం... చివరికి ఏం జరిగిందో చూడండి



ఇవి కూడా చదవండి:

OFB Recruitment 2020: ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 6060 పోస్టులు... తెలంగాణలో 438 ఖాళీలుIAF Jobs: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో జాబ్స్... నేటి నుంచి దరఖాస్తులు

RBI Recruitment 2020: డిగ్రీ పాసైనవారికి ఆర్‌బీఐలో 926 అసిస్టెంట్ జాబ్స్... హైదరాబాద్‌లో పోస్టులు
First published: January 2, 2020, 3:37 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading