ఇంజనీరింగ్ చదవడం ఒక డ్రీమ్‌గా(Dream) పెట్టుకున్న చాలామందికి ఐఐటీలో సీటు సంపాదించడం పెద్ద కల. జేఈఈ టాప్ ర్యాంక్ వస్తే, ఐఐటీలో సీటు కన్ఫర్మ్ అని అందరూ అనుకుంటారు. అలాగే మెడికల్ ఎంట్రన్స్ నీట్లో(Neet) బెస్ట్ ర్యాంక్ సాధించి ఎయిమ్స్‌లో సీటు దక్కించుకోవాలని మెడికల్ స్టూడెంట్స్ అనుకుంటారు. అయితే ఇప్పుడు టాపర్ల ఆలోచన మారుతోంది. కొందరు జేఈఈ (JEE) టాపర్లు ఐఐటీలను వదిలి వేరే ఇన్స్టిట్యూట్లలో చేరి అందరినీ ఆశ్చర్యపరిచారు. అలాగే నీట్, సీబీఎస్ఈ(CBSE) టాపర్లు కూడా ఆశ్చర్యకరమైన మార్గాలను ఎంచుకున్నారు. తమ లక్ష్యాల ఆధారంగా కాలేజీల్ని ఎంపిక చేసుకున్నారు. ఇంజనీరింగ్, మెడికల్ కోర్సులలో ప్రవేశానికి 12వ తరగతి విద్యార్థులు JEE, NEET రాయాల్సి ఉంటుంది, అదే యూనివర్సిటీల్లో బీఏ, బీకాం, బీఎస్సీ లాంటి ఇతర UG కోర్సులలో ప్రవేశం పొందాలంటే CUET ప్రవేశ పరీక్ష రాయాలి. ఈ పరీక్షల్లో టాపర్ల కాలేజీ ఎంపికల వివరాలే ఇవి.
జేఈఈ అడ్వాన్స్డ్ ర్యాంకర్ ఇలా..
ఆర్కే శిశిర్ అనే స్టూడెంట్ 2022 జేఈఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ టాపర్‌గా నిలిచాడు. అయితే అతడు బాంబే ఐఐటీ(IIT)ని వదిలి ఐఐఎస్సీ(IISc) బెంగళూరును ఎంచుకున్నాడు. JEE అడ్వాన్స్డ్ టాపర్లందరికీ ఐఐటీ బాంబే ఫస్ట్ ఆప్షన్‌గా ఉంటుంది. కానీ శిశిర్ మాత్రం బెంగళూరులో B.Techలో చేరాడు. శిశిర్ రీసెర్చ్‌ని తన కెరీర్‌గా ఎంచుకున్నాడు. అందుకే ఐఐటీని వదిలి ఐఐఎస్సీలో చేరాడు. శిశిర్ తర్వాత రెండో ర్యాంకు సంపాదించిన హైదరాబాద్ వాసి పోలు లక్ష్మీ సాయి లోహిత్ రెడ్డి ఐఐటీ బాంబేలో బీటెక్ కంప్యూటర్ సైన్స్‌లో చేరాడు.
సీబీఎస్ఈ టాపర్స్ ఆప్షన్స్
సీబీఎస్ఈ 12వ తరగతి టాపర్స్ కూడా పెద్ద విద్యాసంస్థలను కాకుండా, తమ కెరీర్‌కు తగ్గ డెస్టినేషన్స్ ఎంచుకున్నారు. ఈ పరీక్షలో 500 మార్కులకు 500 (100 శాతం) సాధించిన యువక్షికి ఢిల్లీ యూనివర్సిటీలోని గార్గి కాలేజీలో బీఏ ఆనర్స్ అప్లైడ్ సైకాలజీ కోర్సు అలాట్ అయింది. సచ్‌దేవా పబ్లిక్ స్కూల్ (సెక్టార్ 13)కి చెందిన ఇషాన్ CUETలో 800/800 సాధించాడు. అతను సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో BA (ఆనర్స్) ఇంగ్లీష్ ప్రోగ్రామ్‌లో చేరాడు. బోర్డు పరీక్షలో ఆర్ట్స్ స్ట్రీమ్‌లో ప్రీతమ్ సింగ్ 97.4% మార్కులు పొందాడు. గోరఖ్‌పూర్‌లోని సంస్కృతి పబ్లిక్ స్కూల్లో చదివిన ఈ అబ్బాయి CUETలో 800/800 సాధించాడు. అతను ఇప్పుడు అక్కడి హిందూ కళాశాలలో బి.ఎ. (ఆనర్స్) చరిత్ర విద్యార్థి. డీపీఎస్ జోధ్‌పూర్‌కు చెందిన తన్మయ్ సింగ్ భదావత్ కూడా CUETలో 800/800 స్కోర్ చేశాడు. అతడు ఇప్పుడు హిందూ కళాశాలలో బీఏ (ఆనర్స్) పొలిటికల్ సైన్ చదువుతున్నాడు.
ఎయిమ్స్ వద్దన్న నీట్ టాపర్
నీట్ టాప్-4లో ఒకరైన రుచా పవాషే అనే యువతి, ఢిల్లీలోని ఎయిమ్స్ సీటు వచ్చే అవకాశాన్ని వదిలి, కర్ణాటకలోని బెలగావిలోని బెల్గాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (BIMS)ని ఎంచుకుంది. తన నిర్ణయంతో అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈసారి నలుగురు విద్యార్థులు నీట్లో 720కి 715 స్కోరు సాధించారు. వారిలో రుచా పవాషే ఒకరు. టై-బ్రేకింగ్ ఫార్ములాతో ఆమెకు నీట్లో నాలుగో ర్యాంక్ ఇచ్చారు. రుచా మినహా, టాప్ టెన్ నీట్( NEET) విద్యార్థులు ఎయిమ్స్(AIIMS)ని ఎంచుకున్నారు. ఇంటి దగ్గర ఉంటూనే మెడిసిన్ చదవాలన్నది రుచా ఆలోచన. తన ఇరుగుపొరుగు పిల్లల చదువుకు కూడా తనవంతు సహకారం అందిస్తానంటోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, Jee, JOBS