హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

JEE Main Result: త్వ‌ర‌లో జేఈఈ మెయిన్స్ ఫ‌లితాలు.. క‌ట్ ఆఫ్ అంచనా ఎంతో తెలుసా?

JEE Main Result: త్వ‌ర‌లో జేఈఈ మెయిన్స్ ఫ‌లితాలు.. క‌ట్ ఆఫ్ అంచనా ఎంతో తెలుసా?

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

దేశ‌వ్యాప్తంగా విద్యార్థులు ల‌క్ష‌ల సంఖ్యంలో జేఈఈ(JEE) ప‌రీక్ష రాశారు. ఇప్ప‌టికే జేఈఈ ఆన్స‌ర్ కీ ఆబ్జెక్ష‌న్ రైజింగ్ విండో మూసివేశారు. ఇక పైన‌ల్ ఆన్స‌ర్‌కీ(Answer Key) తోపాటు ఫ‌లితాలు వెలువ‌డే అవ‌కాశం ఉంది. ఈ ఫ‌లితాల‌ను నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ( National Testing Agency) ప్ర‌క‌టిస్తుంది. ఈ ఏడాది ఎంత కట్ ఆఫ్ ఉండబోతుందో అని విద్యార్థులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇంకా చదవండి ...

  దేశ‌వ్యాప్తంగా విద్యార్థులు ల‌క్ష‌ల సంఖ్యంలో జేఈఈ(JEE) ప‌రీక్ష రాశారు. ఇప్ప‌టికే జేఈఈ ఆన్స‌ర్ కీ ఆబ్జెక్ష‌న్ రైజింగ్ విండో మూసివేశారు. ఇక పైన‌ల్ ఆన్స‌ర్‌కీ(Answer Key) తోపాటు ఫ‌లితాలు వెలువ‌డే అవ‌కాశం ఉంది. ఈ ఫ‌లితాల‌ను నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ( National Testing Agency) ప్ర‌క‌టిస్తుంది. ఫ‌లితాలు(Result) ప్ర‌క‌టిస్తే వివ‌రాలు jeemain.nta.nic.in లో అందుబాటులో ఉంటాయి. ఈ ఫ‌లితాల్లో JEE మెయిన్ 2021 మెరిట్(Main) జాబితాను ప్ర‌క‌టిస్తుంది.

  సెప్టెంబర్ 10, 2021 లోపు జేఈఈ ఫలితాలు ప్ర‌క‌టించే అవ‌కాశం ఉన్న‌ట్టు స‌మాచారం. చాలా మంది 2019 క‌న్న ఈ సారి జేఈఈ మెయిన్‌ ప‌రీక్ష క‌ట్ఆఫ్ ఎక్కుగా ఉంటుంద‌ని చెబుతున్నారు. 2019లో జేఈఈ మెయిన్ జ‌న‌ర‌ల్ కేట‌గిరి కట్ ఆఫ్ 89.5శాతంగా ఉంది. ఈ ఏడాది విద్యా నిపుణుల అంచ‌నా ప్ర‌కారం 90లేదా అంత‌కంటే ఎక్కువ ఉండొచ్చ‌ని భావిస్తున్నారు. FIIT JEE లో నిపుణుడైన రమేష్ బట్లిష్ మాట్లాడుతూ.. “JEE మెయిన్ 2021 లో JEE అడ్వాన్స్‌డ్ 2021 కి అర్హత సాధించడానికి జనరల్ కేటగిరీకి దాదాపు 90 శాతం వరకు కట్ ఆఫ్(Cutoff) ఉంటుంద‌ని భావిస్తున్న‌మ‌ని తెలిపారు. ఈ క‌ట్ ఆఫ్ ఇంకా స్వ‌ల్పంగా పెర‌గ‌వ‌చ్చ‌నిపేర్కొన్నారు.

  JEE Advance: విదేశాల్లో జేఈఈ ప‌రీక్షా కేంద్రాలు లేవు.. ఇండియా కొచ్చి రాయాల్సిందే


  అంతే కాఉండా కట్-ఆఫ్ దాదాపు 90 నుంచి 92 పర్సంటైల్ స్కోరై ఉండొచ్చ‌ని విద్యామందిర్ క్లాసెస్ డైరెక్టర్ విద్యావేత్తలు సౌరభ్ కుమార్ అభిప్రాయ‌ప‌డ్డారు. మార్కింగ్ సాపేక్షంగా ఉన్నందున కట్-ఆఫ్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల సంఖ్యపై ఆధారపడి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

  ఈ సంవ‌త్స‌రం జేఈఈ మెయిన్‌ జ‌న‌ర‌ల్ కేట‌గిరీ క‌ట్ ఆఫ్ పెరిగే అవ‌కాశం ఉంద‌ని న్యూస్ 18తో నితిన్ విజయ్, మోషన్ ఎడ్యుకేషన్ వ్యవస్థాపకుడు, ఎండీ కోటా అభిప్రాయ‌ప‌డ్డారు. దీనికి కార‌ణం ఈ ఏడాది ప‌రీక్ష రాసిన అభ్య‌ర్థుల సంఖ్య త‌క్కువ‌గా ఉండ‌డ‌మే కార‌ణం అన్నారు. అర్హ‌త ప‌రీక్ష క‌ట్ ఆఫ్ అనేది చాలా వ‌రు ప‌రీక్ష రాసిన అభ్య‌ర్థుల సంఖ్య‌పైనే ఆధార‌ప‌డి ఉంటుందని రీర్ లాంచర్స్‌లో విద్యావేత్తల డైరెక్టర్ ఆర్ శివ కుమార్ అన్నారు.

  ఎంత మంది హాజ‌ర‌య్యారంటే..

  పరీక్షకు హాజరయ్యే వారి సంఖ్య 2019తో పోలిస్తే అటు ఇటుగా 5 నుంచి 8 శాతానికి దగ్గరగా ఉంటుందని, కాబట్టి అర్హత శాతం ఈ సంవత్సరం అన్ రిజ‌ర్వుడు విద్యార్థులకు 88.5 నుంచి 90 శాతం వరకు ఉండే అవకాశం ఉందని కుమార్ అభిప్రాయ‌ప‌డ్డారు.

  జేఈఈ స్కామ్ ప్ర‌భావం ఉండొచ్చు..

  కట్-ఆఫ్ మరియు మెరిట్ జాబితా కాకుండా.. విద్యార్థులు కూడా JEE స్కామ్ అంశం కూడా ఫ‌లితాను ప్ర‌భావితం చేస్తుంద‌ని అంటున్నారు. ఈ స్కామ్‌(Scam)కు సంబంధించి ఫ‌లితాల‌ను ర‌ద్దు చేయవ‌చ్చ‌ని లేదా కొద్ది మంది విద్యార్థుల ఫ‌లితాల‌ను నిలిపివేసే అవ‌కాశం కూడా ఉంద‌ని నిపుణులు చెబుతున్నారు.

  Published by:Sharath Chandra
  First published:

  Tags: IIT, JEE Main 2021

  ఉత్తమ కథలు