JEE Result 2019: నేడు జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల విడుదల.. ఇలా చెక్ చేసుకోండి

JEE Result 2019: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు, ర్యాంకులను ఈ రోజు ఉదయం 10 గంటలకు విడుదల చేసేందుకు ఐఐటీ రూర్కీ రెడీ అయ్యింది.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: June 14, 2019, 6:20 AM IST
JEE Result 2019: నేడు జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల విడుదల.. ఇలా చెక్ చేసుకోండి
త్వరలోనే TS, AP EAMCET Results..
Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: June 14, 2019, 6:20 AM IST
దేశంలోని 23 ఐఐటీలు సహా ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్‌లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు, ర్యాంకులను ఈ రోజు ఉదయం 10 గంటలకు విడుదల చేసేందుకు ఐఐటీ రూర్కీ రెడీ అయ్యింది. ఆ వెంటనే ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ ఐటీ, జీఎఫ్‌టీలలో ఉమ్మడి ప్రవేశాల కౌన్సెలింగ్‌ నిర్వహించేందుకు జాయింట్‌ సీట్‌ అలకేషన్‌ అథారిటీ నోటిఫికేషన్‌ జారీ చేయనుంది. 16 నుంచి విద్యార్థులకు చాయిస్‌ ఫిల్లింగ్‌కు అవకాశం కల్పించనుంది. మే27న జరిగిన ఈ పరీక్షకు 1.74 లక్షల మంది హాజరయ్యారు.

ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి..
1. అధికారిక వెబ్‌సైట్ jeeadv.ac.in లేదా https://cportal.jeeadv.ac.in ఓపెన్ చేయాలి.

2. Download JEE Result 2019 కోసం సెర్చ్ చేయాలి.
3. ఫలితాలకు సంబంధించిన లింక్‌పై క్లిక్ చేసి కావాల్సిన వివరాలు ఎంటర్ చేయాలి.


4. JEE Advanced Result 2019 కనిపిస్తుంది.
5. దాన్ని డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్ అవుట్ తీసుకోండి.
First published: June 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...