హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

JEE Preparation: జేఈఈలో బెస్ట్ స్కోర్‌తో ఉత్తీర్ణ‌త సాధించాలా.. అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి

JEE Preparation: జేఈఈలో బెస్ట్ స్కోర్‌తో ఉత్తీర్ణ‌త సాధించాలా.. అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

JEE Preparation | దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ  ఇంజనీరింగ్ (Engineering) కళాశాలలు మరియు ప్రతిష్టాత్మకమైన ఐఐటీ ల లో విద్యను అభ్యసించటం కోసం జరిగే ప్రవేశాల కోసం  JEE లో ఉతీర్ణత సాధించాలి .ఈ ఏడాదికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఇప్పటికే విడుదలైంది.

ఇంకా చదవండి ...

  Anna Raghu, Amaravati, News18

  దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ  ఇంజనీరింగ్ (Engineering) కళాశాలలు మరియు ప్రతిష్టాత్మకమైన ఐఐటీ ల లో విద్యను అభ్యసించటం కోసం జరిగే ప్రవేశాల కోసం  JEE లో ఉతీర్ణత సాధించాలి .ఈ ఏడాదికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఇప్పటికే విడుదలైంది. jee లో ఉత్తమ ర్యాంక్ సాధించటం కోసం ఎలా ప్రిపేర్ కావాలో తెలుసు కుందాము. మొదట JEE మెయిన్, అడ్వాన్స్‌డ్‌ల కోసం పూర్తి సిలబస్‌ను సిద్ధం చేసుకోవాలి. అందుకు తగిన విధంగా స్టడీ మెటీరియల్‌ స్టడీ చేసుకోవాలి. అందుబాటులో ఉన్న సమయానికి అనుగుణంగా పక్కాగా టైమ్‌ టేబుల్‌ సిద్ధం చేసుకోవాలి. చదువుతున్న టాపిక్‌కు సంబంధించి నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. JEE పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రాన్ని భౌతికశాస్త్రం, రసాయన శాస్త్రం, గణితం అనే మూడు విభాగాలుగా విభజించారు.

  TS Group-1: గ్రూప్-1 ప‌రీక్ష తేదీ ఖరారు.. ఒక్కో పోస్టుకు ఎంత మంది పోటీ.. ఎంపిక విధానంలో కీల‌క విష‌యాలు

  దీని ప్రకారం సబ్జెక్టుల వారీగా ప్రణాళిక రూపొందించుకోవాలిమూడు సబ్జెక్టులను కవర్ చేసే విధంగా రోజువారీ స్టడీ షెడ్యూల్‌ను సిద్ధం చేసుకుని.. పక్కాగా ఫాలో కావాలి. ఏ సబ్జెక్ట్‌ను, ఏ అంశాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. అన్నీ సబ్జెక్టులకు సమానంగా సమయాన్ని కేటాయించాలి. మొదట థియరీ భాగాన్ని కంప్లీట్‌ చేసి.. తర్వాత ప్రాబ్లమ్స్‌ను ప్రాక్టీస్ చేయడం లాభిస్తుంది. ఇలా చేయడం వల్ల కాన్సెప్ట్‌లను బాగా అర్థం చేసుకోవచ్చు. టైమ్‌ మేనేజ్‌మెంట్‌, ప్రశ్నలను పరిష్కరించే వ్యూహంపైనే JEE లో ఎంత స్కోర్‌ చేస్తామనే అంశం ఆధారపడి ఉంటుంది. ఇందుకోసం అంకితభావంతో ప్రిపేర్ కావడమే ఏకైక మార్గం.

  Agnipath Scheme: యువ‌త కోసం కేంద్రం అగ్నిపథ్ స్కీమ్.. ఏమిటి ప్ర‌త్యేక‌త‌లు.. వివ‌రాలు

  జేఈఈ మెయిన్‌లో ఉత్తీర్ణత సాధించాలంటే 11, 12వ తరగతికి చెందిన ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌లో గట్టి పట్టు ఉండాలి. 11వ తరగతి, 12వ తరగతిలోని ప్రతి సబ్జెక్టులోని టాపిక్‌ను వేరు చేసి ఆపై చదవడం ప్రారంభించండి. రెండోది JEE మెయిన్ సిలబస్‌లోని అంశాలను సులభమైనవి, కష్టమైనవిగా విభజించండి. తద్వారా దానికనుగుణంగా ప్రిపరేషన్‌ కొనసాగిస్తే విజయం తప్పక వరిస్తుంది.పక్కా ప్రణాళిక ప్రతి విద్యార్ధి తమ సొంత పతన విధానం కలిగియుండి అంకిత భావం తో పక్కా ప్రణాళిక తో ప్రిపేర్ అయితే jee లో మంచి రాంక్ ను సొంతం చేసుకోవచ్చు .

  Published by:Sharath Chandra
  First published:

  Tags: Career and Courses, EDUCATION, Jee mains, JOBS

  ఉత్తమ కథలు