Home /News /jobs /

JEE NEET EXAM FRESH DATE WILL BE ANNOUNCED ON MAY 5 BY HRD MINISTRY BA

JEE, NEET | జేఈఈ, నీట్‌ పరీక్షలపై కేంద్రం అప్ డేట్..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

JEE, NEET పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారనే అంశంపై అభ్యర్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

    JEE, NEET పరీక్షల నిర్వహణపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఆ రెండు పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారనే తేదీలను మే 5న ప్రకటించనుంది. అంటే, మరో రెండు రోజుల్లో ఈ రెండు పరీక్షలపై క్లారిటీ రానుంది. వాస్తవానికి జేఈఈ మెయిన్స్ పరీక్ష ఏప్రిల్ నెలలో నిర్వహించాల్సి ఉండగా, నీట్ పరీక్ష మే 3న నిర్వహించాల్సి ఉంది. అయితే, కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా రెండు పరీక్షలు వాయిదా పడ్డాయి. మరోవైపు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పరీక్షలకు దరఖాస్తుల్లో తప్పులను సరిదిద్దుకునేందుకు అవకాశాన్ని కూడా కల్పించింది. జూన్ ఆఖర్లో పరీక్షలు జరిగే అవకాశం ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. అయితే, దీనిపై కేంద్ర మానవ వనరుల శాఖ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Jee, NEET, NEET 2020

    తదుపరి వార్తలు