దేశవ్యాప్తంగా ఉన్న కళాశాలల్లో అండర్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్, ఆర్కిటెక్చర్ ప్రోగ్రామ్స్‌లలో ప్రవేశాలు కల్పించేందుకు జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్(JEE MAINS) నిర్వహిస్తారు. ఏటా ఈ ఎగ్జామ్‌కు లక్షల మంది విద్యార్థులు హాజరవుతారు. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన వారు ఈ ఎగ్జామ్ రాయడానికి అర్హులు. సంవత్సరం పొడవునా JEE MAINS ప్రిపరేషన్‌లో నిమగ్నమై ఉన్న విద్యార్థులు ప్రస్తుతం ఎగ్జామ్ డేట్లు రిలీజ్ అవ్వడంతో దరఖాస్తు చేసుకోవడంలో బిజీగా ఉన్నారు. ఇప్పుడు విద్యార్థులకు కామన్ సర్వీస్ సెంటర్స్(CSC) ద్వారా అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించారు.
జనవరి 12 గడువు
ప్రతి సంవత్సరం JEE MAINS ఎగ్జామ్ రెండు సెషన్స్‌లో జరుగుతుంది. మొదటి సెషన్ జనవరి నెలలో నిర్వహిస్తారు. రెండో సెషన్ ఏప్రిల్ నెలలో జరుగుతుంది. ఇప్పుడు మొదటి సెషన్ ఎగ్జామ్ కోసం అప్లికేషన్లు ఆహ్వానిస్తున్నారు. వీటికి అప్లై చేసుకొనే విద్యార్థులు జనవరి 12లోపు ఆన్‌లైన్‌లో అధికారిక వెబ్‌సైట్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలి.
కామన్ సర్వీస్ సెంటర్స్(CSC)
దేశవ్యాప్తంగా జరిగే ఈ JEE MAINS ఎగ్జామ్‌లకు నగరాలు, పట్టణాలు, గ్రామాల నుంచి విద్యార్థులు అప్లై చేస్తుంటారు. నగరాల్లో ఉన్న విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సులువుగా అప్లికేషన్ ఫారమ్ రిజిస్టర్ చేసుకోవచ్చు. కానీ మారుమూల ప్రాంతాల్లో ఉండే విద్యార్థులకు అప్లికేషన్ ఫారమ్ రిజిస్టర్ చేయాలంటే కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మెరుగైన ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులో లేకపోవడం, అప్లికేషన్ ఫారంలో వివరాలు ఎంటర్ చేస్తున్న సమయంలో కొన్ని సాంకేతిక సమస్యలు రావడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. చాలామంది విద్యార్థులకు అప్లికేషన్ ఫారంలో వివరాలను నమోదు చేయడంపై అవగాహన లేక ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారు JEE MAINS ఎగ్జామ్‌కి రిజిస్టర్ చేసుకోవడానికి కామన్ సర్వీస్ సెంటర్‌ను ఉపయోగించుకోవచ్చని తెలిపారు.
దేశవ్యాప్తంగా 1.5 లక్షల సెంటర్లు
ప్రధానమంత్రి డిజిటల్ ఇండియా ఇనిషియేటివ్లో భాగంగా కేంద్ర ఎలక్ట్రానిక్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ సెంటర్‌లను నిర్వహిస్తున్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేషనల్ ఈ గవర్నెన్స్ ప్లాన్ (NeGP)లో భాగంగా ఈ కామన్ సర్వీస్ సెంటర్లు ప్రతి గ్రామపంచాయతీ పరిధిలో విలేజ్ లెవెల్ ఎంటర్‌ప్రెన్యూర్ (VLE) ద్వారా నిర్వహిస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) పేర్కొంది. దేశవ్యాప్తంగా 1.5 లక్షల కామన్ సర్వీస్ సెంటర్లు ఉన్నాయని ఇవి గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకే కాకుండా నగర, పట్టణ ప్రాంతాల్లో ఉండే విద్యార్థులకు కూడా అవసరమైన సేవలు అందిస్తాయని తెలిపింది. ఆన్‌లైన్‌లో అప్లికేషన్ ఫారం సబ్మిట్ చేయడం, ఈ- వ్యాలెట్ ద్వారా ఎగ్జామ్ ఫీజు పే చేయడం వంటి సేవలు అందిస్తాయని పేర్కొంది. దేశవ్యాప్తంగా ఉన్న కామన్ సర్వీస్ సెంటర్ల లిస్టు CSC అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. CSCల సహకారంతో విద్యార్థులు రిజిస్ట్రేషన్ ఫారం పూర్తి చేసి ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేయవచ్చు.
CSCల ద్వారా ఇలా అప్లై చేసుకోవాలి?
విద్యార్థులు ఉదయం 9:30 నుంచి సాయంత్రం 6 గంటలలోపు సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లవచ్చు. ఆ సెంటర్లో ఉన్న విలేజ్ లెవెల్ ఎంట్రప్రెన్యూర్(VLE)ను సంప్రదించి JEE MAINS 2023కి అప్లై చేసుకోవాలని తెలియజేయాలి. అప్లికేషన్ ఫారం ఫిల్ చేయడానికి అవసరమైన వివరాలను VLEకి అందజేయాలి. అనంతరం అప్లికేషన్ ఫీజు పే చేయాలి. చివరిగా JEE MAIN అప్లికేషన్ ఫారం సబ్మిట్ చేయాలి. CSC వద్ద పొందిన సేవల కోసం VLEకి తగిన మొత్తం చెల్లించాల్సి ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, Jee, JEE Main 2023, JOBS