దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్ (JEE Main 2023) కి సంబంధించిన అడ్మిట్ కార్డులు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) తాజాగా విడుదల చేసింది. అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ jeemain.nta.nic.in నుంచి తమ అడ్మిట్ కార్డును డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన పరీక్షలను రేపటి నుంచి అంటే.. జనవరి 28 నుంచి నిర్వహించనున్నారు. ఈ పరీక్షలు 30వ తేదీ వరకు కొనసాగనున్నాయి.
ఇలా డౌన్ లోడ్ చేసుకోండి:
Step 1: అభ్యర్థులు ముందుగా https://jeemain.nta.nic.in/ లింక్ ఓపెన్ చేయాలి.
Step 2: తర్వాత JEE(Main) 2023 Session 1 – Download Admit Card ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
Step 3: తర్వాత కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ అప్లికేషన్ నంబర్, డేట్ ఆఫ్ Step 4: బర్త్, సెక్యూరిటీ పిన్ నమోదు చేసి సబ్మిట్ పై క్లిక్ చేయాలి.
Step 5: అడ్మిట్ కార్డు స్క్రీన్ పై డిస్ప్లే అవుతుంది. డౌన్ లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, JEE Main 2023, JOBS