నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష అర్హత విషయంలో పలు నిబంధనలను సడలించింది. ప్రతీ విద్యామండలి పర్సంటైల్ లో అగ్రస్థానంలో ఉన్న తొలి 20 మందికి ఐఐటీ, ఎన్ఐటీ ప్రవేశ పరీక్షల్లో సడలింపు ఉంటుందని తెలిపింది. అలాంటి విద్యార్థులు 75 శాతం మార్కులు సాధించలేకపోయినా.. ఈ ప్రవేశాల కోసం జేఈఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ కు హాజరుకావొచ్చని తెలిపింది. అనేక రాష్ట్రాల్లో పర్సంటైల్ లో అగ్రస్థానంలో ఉంటున్న అభ్యర్థులు 12వ తరగతిలో 75 శాతం పొందలేకపోతున్నారు. అలాంటి అభ్యర్థులందరికీ ఈ నిర్ణయం వరంలా మారనుంది. ఇదిలా ఉంటే జేఈఈ మెయిన్ ఫస్ట్ సెషన్ రిజిస్ట్రేషన్ గడువు ఈ నెల 12 అంటే రేపటితో ముగియనుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, Exams, JOBS