హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

JEE Mains-2022: జేఈఈ స్టూడెంట్స్‌కి గోల్డెన్ ఆఫర్.. అప్లికేషన్ ఎడిట్‌కు మరో ఛాన్స్.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే..?

JEE Mains-2022: జేఈఈ స్టూడెంట్స్‌కి గోల్డెన్ ఆఫర్.. అప్లికేషన్ ఎడిట్‌కు మరో ఛాన్స్.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే..?

జేఈఈ అప్లికేషన్ ఎడిట్ చేసుకునేందుకు అవకాశం.

జేఈఈ అప్లికేషన్ ఎడిట్ చేసుకునేందుకు అవకాశం.

జాతీయ స్థాయిలో ఇంజినీరింగ్ ప్రవేశాల కోసం జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్(JEE)‌ను నిర్వహిస్తారు. తాజాగా JEE Main-2022 కోసం అప్లికేషన్ కరక్షన్ విండో‌‌ను ఎన్‌టీఏ ఓపెన్ చేసింది. జేఈఈ మెయిన్స్ సెషన్ 2 పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.nic.in ద్వారా తమ దరఖాస్తు ఫారమ్‌లను ఎడిట్ చేసుకోవచ్చు.

ఇంకా చదవండి ...

జాతీయ స్థాయిలో ఇంజినీరింగ్ ప్రవేశాల కోసం జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్(JEE)‌ను నిర్వహిస్తారు. తాజాగా జేఈఈ మెయిన్-2022 కోసం అప్లికేషన్ కరక్షన్ విండో‌‌ను ఎన్‌టీఏ (NTA) ఓపెన్ చేసింది. జేఈఈ మెయిన్స్ సెషన్ 2 పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.nic.in ద్వారా తమ దరఖాస్తు ఫారమ్‌లను ఎడిట్ చేసుకోవచ్చు. జులై 3, రాత్రి 11:50 గంటలకు వరకు మాత్రమే అప్లికేషన్‌ను ఎడిట్ చేసుకోవడానికి ఎన్‌టీఏ అవకాశం కల్పించింది.

అధికారిక నోటిఫికేషన్‌లో పేర్కొన్న పరిమిత సమాచారాన్ని మాత్రమే ఎడిట్ చేయడానికి ఎన్‌టీఏ అనుమతించింది.

జేఈఈ మెయిన్స్ సెషన్-1‌కు దరఖాస్తు చేసి, సెషన్-2 కోసం కూడా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు క్వశ్చన్ పేపర్ మీడియం, ఎగ్జామినేషన్ సిటీస్, అదనపు ఫీజు చెల్లింపు (వర్తిస్తే) అప్షన్లను మాత్రమే ఎడిట్ చేయడానికి అనుమతించింది. ఇక జేఈఈ మెయిన్స్ సెషన్ 2 కోసం మాత్రమే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు, ఆధార్ ధృవీకరణ ఆధారంగా అప్లికేషన్‌లో ఎడిట్ చేసుకోవడానికి అనుమతించింది. జేఈఈ మెయిన్స్ అప్లికేషన్ కరెక్షన్ నోటిఫికేషన్- 2022 ద్వారా అభ్యర్థలు పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

ఇదీ చదవండి: స్మార్ట్‌ఫోన్లు అన్నింటికీ ఇక టైప్ C ఛార్జరే.. మరి ఐ ఫోన్‌కు యూజర్ల పరిస్థితి ఏంటంటే..?



* జేఈఈ మెయిన్స్-2022 అప్లికేషన్ ఎడిట్ విధానం

స్టెప్-1: అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.nic.inను ఓపెన్‌ చేయాలి.

స్టెప్-2: హోమ్ పేజీకి వెళ్లి, జేఈఈ మెయిన్స్ అప్లికేషన్ కరెక్షన్ లింక్‌పై క్లిక్ చేయాలి.

స్టెప్-3: కొత్త లాగిన్ పేజీ ఓపెన్ అవుతుంది.

స్టెప్-4: అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్‌ను ఎంటర్‌ చేసి లాగిన్ అవ్వాలి.

స్టెప్-5: అప్లికేషన్‌లో అనుమతించిన అంశాలను ఎడిట్ చేయాలి.

స్టెప్-6: ఎడిట్ చేసిన తరువాత అప్లికేషన్‌ను సబ్‌మిట్ చేయాలి.

స్టెప్-7: భవిష్యత్ అవసరాల కోసం అప్లికేషన్‌ను ప్రింట్‌ఔట్ తీసుకోవాలి.

అదనపు రుసుమును (వర్తిస్తే) సంబంధిత అభ్యర్థులు క్రెడిట్/డెబిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/యూపీఐ, పేటీఎం ద్వారా చెల్లించవచ్చు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఎన్‌టీఏ వన్-టైమ్ ఎడిట్ అవకాశాన్ని కల్పించింది. ఇకపై ఎడిట్ చేసుకోవడానికి ఇంకో అవకాశం ఉండదు. కాబట్టి అభ్యర్థులు ఎంతో జాగ్రత్తగా అప్లికేషన్‌ను ఎడిట్ చేయాలని ఎన్‌టీఏ సూచించింది.

* టై బ్రేకింగ్ విధానం

జేఈఈ మెయిన్ -2022 కోసం టై-బ్రేకర్ విధానంలో మార్పులు చోటుచేసుకున్నాయి. టై అయిప్పుడు విద్యార్థుల స్కోర్‌ను బ్రేక్ చేయడానికి గతంలో ఉన్న విధానాన్ని ఎన్‌టీఏ తిరిగి తీసుకొచ్చింది. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది అభ్యర్థులు ఒకే మార్కులను స్కోర్ చేసినప్పుడు.. గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ లేదా నెగెటివ్ మార్కింగ్‌ మార్కులతో సహా ఇతర మార్గాల ద్వారా టై పరిష్కరించలేకపోతే, JEE మెయిన్‌కు ముందు దరఖాస్తు చేసిన అభ్యర్థికి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. వయసు నిబంధనలను ఈసారి అమలు చేయనున్నారు. జేఈఈ మెయిన్స్‌కు సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే 011-40759000ను సంప్రదించవచ్చు లేదా jeemain@nta.ac.inకు ఇమెయిల్ చేయవచ్చని ఎన్‌టీఏ సూచించింది.

First published:

Tags: Application, Career and Courses, Jee main 2022, JOBS

ఉత్తమ కథలు