హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

JEE Mains 2022: జేఈఈ మెయిన్స్‌లో 150 నుంచి 200 మార్కులు సాధించడానికి 12 టిప్స్

JEE Mains 2022: జేఈఈ మెయిన్స్‌లో 150 నుంచి 200 మార్కులు సాధించడానికి 12 టిప్స్

JEE Mains 2022: జేఈఈ మెయిన్స్‌లో 150 నుంచి 200 మార్కులు సాధించడానికి 12 టిప్స్
(ప్రతీకాత్మక చిత్రం)

JEE Mains 2022: జేఈఈ మెయిన్స్‌లో 150 నుంచి 200 మార్కులు సాధించడానికి 12 టిప్స్ (ప్రతీకాత్మక చిత్రం)

JEE Mains 2022 | జేఈఈ మెయిన్స్ 2022 పరీక్ష రాసే విద్యార్థులకు అలర్ట్. ఈ ప్రతిష్టాత్మక పరీక్ష (Jee Exam 2022) ఇంకొన్ని రోజుల్లో జరగనుంది. ఈ పరీక్షలో 150 నుంచి 200 వరకు మార్కులు ఎలా సాధించాలో తెలుసుకోండి.

  M.Balakrishna, Hyderabad, News18

  జేఈఈ మెయిన్‌లో 150-200 మార్కులు సాధిస్తే వాటిని చాలా మంచి మార్కులుగా ప‌రిగ‌ణిస్తారు. మునుపటి సంవత్సరాలలో జేఈఈ మెయిన్ (JEE Main 2022) కట్-ఆఫ్‌లు, ర్యాంక్ విశ్లేషణల ప్రకారం, 150-200 మధ్య స్కోర్ మీకు టాప్ ఎన్ఐటీలలో (NIT) ప్రవేశం పొంద‌డానికి చాలా స‌హాయ‌ప‌డుతుంది. దీంతోపాటు జేఈఈ అడ్వాన్స్‌డ్ (JEE Advanced), IITలకు కూడా అర్హత పొందుతారు. అయితే మెయిన్స్ లో మంచి స్కోర్ చేయ‌డం ఎలాగో ఇప్పుడు చూద్దాం.

  JEE మెయిన్ పరీక్షలో 150-200 కంటే ఎక్కువ మార్కులు సాధించడానికి చిట్కాలు:


  1. మిగిలిన అంశాలను కవర్ చేయడానికి ఒక మంచి స్ట‌డీ టైం టేబుల్‌ను రూపొందించండి. స‌రైన ప్రణాళిక లేక‌పోతే చిన్న సులభమైన అధ్యాయాలపై చాలా సమయం వృధా అవ‌డ‌మే కాకుండా ముఖ్యమైన అంశాలు మిస్ అవుతారు.

  2.  JEE ముఖ్య‌మైన అంశాల‌ను కవర్ చేయడానికి NCERT పాఠ్యపుస్తకాలను చదవండి, ముఖ్యంగా కెమిస్ట్రీ (స్కోరింగ్ విభాగం). మ్యాథ్, ఫిజిక్స్ కోసం కోచింగ్ మాడ్యూల్స్ లేదా రిఫరెన్స్ బుక్స్‌లో వ‌చ్చే ప్రశ్నలు అడుగుతారు గుర్తుపెట్టుకోండి.

  Agnipath Scheme: నెలకు రూ.40,000 జీతం... నాలుగేళ్ల తర్వాత రూ.12 లక్షల ప్యాకేజీ... అగ్నిపథ్ స్కీమ్ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం

  3. ఒకే అంశాలు అధ్యాయాలను తెలుసుకోవడానికి నాలుగైదు పుస్తకాలు లేదా మెటీరియల్‌లను ఫాలో అవ్వ‌ద్దు ఎదో ఒక పుస్త‌కం ఫాలో అయితే స‌రిపోతుంది.

  4. థియరీ పాయింట్లు, నోట్స్, ఫార్ములాల కోసం ప్రత్యేక నోట్స్ ను రాసుకోండి. ప్రాక్టీస్ ప్రశ్నలు పరిష్కరించడం సరైన సమాధానం వ‌చ్చేలా ప్రాక్టీస్ చేయండి. తక్కువ సమయంలో మీరు ప్ర‌శ్న‌ల‌ను ఆన్ష‌ర్ చేస్తోన్నారో లేదో తెలుసుకోండి.

  5. JEE మెయిన్ మునుపటి సంవత్సరాల పేపర్లు, ఆన్‌లైన్ మాక్ టెస్ట్‌లను త‌క్కువ స‌మ‌యంలో  పరిష్కరించ‌డం ప్రాక్టీస్ చేయండి.

  6. పరీక్షలలో మీ పనితీరును విశ్లేషించండి.మీకు మీరుగా నిర్వ‌హించుకునే టెస్ట్ లో ముందు తప్పులను నోట్ చేసుకోని వాటిని సరిదిద్దుకోండి.

  Jobs in TCS: ఆర్ట్స్, కామర్స్ డిగ్రీ చదివినవారికీ టీసీఎస్‌లో ఉద్యోగాలు... అప్లై చేయండి ఇలా

  7. ప్రశ్నలను పరిష్కరించడంలో వేగం ఎంత ముఖ్యమో మీ ఖచ్చితత్వాం కూడా అంతే ముఖ్యం అనే విష‌యాన్ని తెలుసుకోండి. ప్రశ్నకు సమాధానమివ్వడానికి తొందరపడకండి ఆలోచించి స‌రైన స‌మాదానాలు రాయ‌డం అల‌వాటు చేసుకోండి.

  8. JEE మెయిన్‌లోని చాలా ప్రశ్నలు పూర్తిగా ఫార్ములా ఆధారితమైనవి కాబట్టి అన్ని ఫార్ములాలను వారానికి 2-3 సార్లు రివైజ్ చేస్తూ ఉండండి.

  9. మీ అవసరం కంటే ఎక్కువ లక్ష్యం పెట్టుకోండి. మీరు 250 టార్గెట్ చేస్తే, 200 పొందడం సులభం అవుతుంది. 150 స్కోర్ చేయడానికి, కనీసం 200 లక్ష్యంగా పెట్టుకోండి. పేపర్‌లో కనీసం 70-80% ప్రయత్నించండి.

  10. పరీక్షల్లో మీ స్కోర్‌ను మెరుగుపరచుకోవడానికి JEE కోసం ఆన్‌లైన్ కోర్సులో చేరండి (పరీక్ష ఫార్మాట్‌లో మాక్ టెస్ట్‌లను ప్రాక్టీస్ చేయడానికి ఆన్‌లైన్ టెస్ట్ సిరీస్‌లు చాలా ఉపయోగ‌ప‌డ‌తాయి).

  11. మీకు ఇష్టమైన విభాగంతో పరీక్షను ప్రారంభించండి (చాలా మంది ఆశావహులు రసాయన శాస్త్రంతో ప్రారంభించడం సులభం అని భావిస్తారు) విభాగాల మధ్య సమయ నిర్వహణపై నిఘా ఉంచండి.

  12. చివరి క్షణం కోసం దేన్నీ వదిలిపెట్టవద్దు. పరీక్షలో ప్రశాంతంగా ఉండండి. ఫ్రెష్ మైండ్ బాగా ఆలోచిస్తుంది. మీరు సమర్ధవంతంగా చదవ‌డంతోపాటు ఎక్కువ స్కోర్ చేస్తారు.

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: Jee main 2022, Jee mains, JOBS

  ఉత్తమ కథలు