Home /News /jobs /

JEE MAINS 2022 HERE IS THE IMPORTANT PREPARATION TIPS TO STUDENTS NS VSP

JEE Preparation Tips: జేఈఈకి ప్రిపేర్ అవుతున్నారా? అయితే, ఈ విషయాలు తప్పక తెలుసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(NTA) జేఈఈ మెయిన్స్ షెడ్యూల్‌ను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీ, ఐఐఐటీ, ఎన్ఐటీల్లో ప్రవేశం కోసం నిర్వహించే జేఈఈ మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి.

    సేకరణ: ఆనంద్ మోహన్, న్యూస్18 కరస్పాండెంట్, విశాఖ‌ప‌ట్నం

    నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(NTA) జేఈఈ మెయిన్స్ షెడ్యూల్‌ను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీ, ఐఐఐటీ, ఎన్ఐటీల్లో ప్రవేశం కోసం నిర్వహించే జేఈఈ మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. జాతీయ స్ధాయిలో నిర్వహించే అతి పెద్ద ఇంజనీరింగ్ పరీక్ష అయిన జేఈఈ మెయిన్ ను ప్రతీ ఏడాది 2 సెషన్స్ లో నిర్వహిస్తారు. సాధారణంగా ప్రతీ ఏటా జేఈఈ మెయిన్ రెండు విడతలుగా జనవరి, ఏప్రిల్ నెలల్లో జరుగుతాయి. కానీ, కోవిడ్ కారణంగా ఈ ఏడాది నిర్వహించే జేఈఈ మెయిన్-2022 (JEE Main 2022) పరీక్షల‌ను జూన్, జూలై నెలల్లో నిర్వ‌హిస్తున్నారు. ఇప్పటికే జేఈఈ మెయిన్- 2022లో అర్హత సాధించడం కోసం అభ్య‌ర్థుల‌ు సిద్దమవుతున్నారు.

    దేశవ్యాప్తంగా 23 ఐఐటీలలలో ఉన్న 12 వేల సీట్లను, ఈ జేఈఈ అడ్వాన్సడ్ ఎగ్జామ్ లో వచ్చిన మార్కుల ద్వారా సాధించడానికి వీలుంటుంది. ఇక 31 ఎన్ఐటీ లు, 25 ట్రిపుల్ ఐటీ లలో కూడా ఈ జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలో క్వాలిఫ్ అయ్యి మంచి మార్కులు సాధించిన వారు సీట్లు సాధించవచ్చు. ప్రతీ ఏటా ఈ జేఈఈ మెయిన్ పరీక్షలకు సుమారు 12 లక్షల మంది విద్యార్ధులు హాజరవుతుంటారు. మొదట జేఈఈ మెయిన్ ఎగ్జామ్ రాసి క్వాలిఫ్ అయిన వాళ్లలో సుమారు రెండున్నర లక్షల మంది విద్యార్ధులు జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు ప్రిపేర్ అవుతుంటారు. ఇలా జేఈఈ అడ్వాన్స్ పరీక్ష క్వాలిఫై అయ్యి.. అత్యధిక మార్కులు సాధించిన వారికి ఐఐటీలలో సీట్లు లభిస్తాయి. కానీ ఐఐటీలలో సీట్లను సాధించాలంటే చాలా ప్రిపరేషన్, మెంటల్ గా స్ల్రాంగ్ గా వుండటం అవసరం.
    JEE Mains 2022: జేఈఈ మెయిన్ టిప్స్.. ఇలా చ‌దివితే బెస్ట్ స్కోర్ సాధించ‌వ‌చ్చు!

    జేఈఈ మెయిన్ ఎగ్జామ్ ఎలా వుంటుంది. ఎగ్జామ్ ప్యాట్రన్ ఏంటి? (EXAM PATTERN)
    జేఈఈ మెయిన్ -2022 ఆన్ లైన్ ఎగ్జామ్ గురించి పూర్తీ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతీ ఏడాదిలా కాకుండా ఈ ఏడాది ఎగ్జామ్ ప్రాట్రన్ కాస్త మారింది. గత ఏడాది వరకూ మొత్తం 75 ప్రశ్నలు ఇచ్చి, అన్ని సమాధానాలు రాయాల్సి ఉండేది. ప్రతీ ప్రశ్నకు జవాబు రాయాల్సి ఉండేది. కానీ ఈ ఏడాది 5 ఛాయిస్ ప్రశ్నలు కూడా ఇచ్చి 25 ప్రశ్నలకు సమాధానాలు మాత్రమే రాయాల్సి ఉంటుంది.
    1. జేఈఈ మెయిన్ ఎగ్జామ్ మూడు సెక్షన్లుగా వుంటుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమేటిక్స్ అనే సెక్షన్లు ఉంటాయి. 2.ఈ మూడు సెక్షన్లు ఒక్కొక్కటి 30 ప్రశ్నలు చొప్పున, 90 ప్రశ్నలు వస్తాయి. వీటిలో ఒక్కో సబ్జెక్ట్ లో 25 ప్రశ్నలు రాస్తే సరిపోతుంది. 5 ప్రశ్నలు ఛాయిస్ కింద వదిలేయవచ్చు. అంటే 75 ప్రశ్నలకు గానూ 4 మార్కుల చొప్పున 300 మార్కులకు పరీక్ష ఉంటుంది.
    JEE Mains 2022: జేఈఈ మెయిన్స్‌లో 150 నుంచి 200 మార్కులు సాధించడానికి 12 టిప్స్

    3. ఒక్కో సబ్జెక్ట్ లో ఇచ్చే 30 ప్రశ్నల్లో సెక్షన్-ఏ లో మొదటి 20 ప్రశ్నలు మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు, సెక్షన్-బీ లో తర్వాతి 10 ప్రశ్నలు న్యూమరికల్ ప్రశ్నలు వుంటాయి. ఈ న్యూమరికల్ ప్రశ్నలకు 0 నుండి 9 మధ్య జవాబులు ఉంటాయి. వాటిలో సరైన ఆన్సర్ ను ఎంచుకొని రాయాల్సి ఉంటుంది. 4.ఈ న్యూమరికల్ ప్రశ్నల్లో ఐదు ప్రశ్నలు ఛాయిస్ కింద వదిలేయవచ్చు. మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు మాత్రం అన్ని రాయాల్సి ఉంటుంది. 5. ఒక్కో సరైన సమాధానానికి 4 మార్కులు ఉంటాయి. నెగెటివ్ మార్కులు కూడా ఉంటాయి. ఒక్కో తప్పు ఆన్సర్ కు -1 చొప్పున కట్ చేస్తారు. అంటే 4 తప్పు ఆన్సర్లు రాస్తే.. 4 మార్కులు పోతాయి.

    జేఈఈ పరీక్షలో మంచి మార్కులు సాధించాలంటే( HOW TO BEST SCORE)
    ముఖ్యంగా జేఈఈ మెయిన్ క్రాక్ చేయాలంటే.. విద్యార్ధులలో ముందునుండి ఇంట్రస్ట్ , పాజిటివ్ ఆటిట్యూడ్, పరీక్షలో ఎలాగైనా పాసవ్వాలన్న గురి ఉండాలన్నది నిపుణులు చెబుతున్నారు. కనీసం రోజులో 11 నుండి 12 గంటల పాటు చదవాల్సి ఉంటుంది. వీటిలో ఒక 5నుండి 6 గంటల పాటు సబ్జెక్ట్ వినడం, మరో 5 నుండి 6 గంటల పాటు విన్న సబ్జెక్ట్ ను ప్రాక్టీస్ చేయడం, ప్రిపేర్ కావడం చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే జేఈఈ మెయిన్ లో క్వాలిఫ్ కావడం చాలా ఈజీ అవుతుంది. ఫిజిక్స్, మ్యాధమేటిక్స్ సబ్జెక్ట్ లలో వచ్చే ప్రాబ్లమ్స్ గురించి నిపుణుల సలహాలు తీసుకోవడం, కష్టమైన ప్రాబ్లమ్స్ ను కూడా సాల్వ్ చేయాలన్న తపన ఉండాలి.

    జేఈఈ మెయిన్‌లో 150-200 మార్కులు సాధిస్తే వాటిని చాలా మంచి మార్కులుగా ప‌రిగ‌ణిస్తారు. మునుపటి సంవత్సరాలలో JEE మెయిన్ కట్-ఆఫ్‌లు, ర్యాంక్ విశ్లేషణల ప్రకారం, 150-200 మధ్య స్కోర్ మీకు టాప్ NITలలో ప్రవేశం పొంద‌డానికి చాలా స‌హ‌య‌ప‌డుతుంది. దీంతోపాటు JEE అడ్వాన్స్‌డ్ మరియు IITలకు కూడా అర్హత పొందుతారు. అయితే మెయిన్స్ లో మంచి స్కోర్ చేయ‌డం ఎలాగో ఇప్పుడు చూధ్దాం.
    1. పరీక్షలలో మీ పనితీరును విశ్లేషించండి.మీకు మీరుగా నిర్వ‌హించుకునే టెస్ట్ లో ముందు తప్పులను నోట్ చేసుకోని వాటిని సరిదిద్దుకోండి. 2. ప్రశ్నలను పరిష్కరించడంలో వేగం ఎంత ముఖ్యమో మీ ఖచ్చితత్వాం కూడా అంతే ముఖ్యం అనే విష‌యాన్ని తెలుసుకోండి. ప్రశ్నకు సమాధానమివ్వడానికి తొందరపడకండి ఆలోచించి స‌రైన స‌మాదానాలు రాయ‌డం అల‌వాటు చేసుకోండి.

    3. JEE మెయిన్‌లోని చాలా ప్రశ్నలు పూర్తిగా ఫార్ములా ఆధారితమైనవి కాబట్టి అన్ని ఫార్ములాలను వారానికి 2-3 సార్లు రివైజ్ చేస్తూ ఉండండి.4. మీ అవసరం కంటే ఎక్కువ లక్ష్యం పెట్టుకోండి. మీరు 250 టార్గెట్ చేస్తే, 200 పొందడం సులభం అవుతుంది. 150 స్కోర్ చేయడానికి, కనీసం 200 లక్ష్యంగా పెట్టుకోండి. పేపర్‌లో కనీసం 70-80% ప్రయత్నించండి.5. పరీక్షల్లో మీ స్కోర్‌ను మెరుగుపరచుకోవడానికి JEE కోసం ఆన్‌లైన్ కోర్సులో చేరండి (పరీక్ష ఫార్మాట్‌లో మాక్ టెస్ట్‌లను ప్రాక్టీస్ చేయడానికి ఆన్‌లైన్ టెస్ట్ సిరీస్‌లు చాలా ఉపయోగ‌ప‌డ‌తాయి).6. మీకు ఇష్టమైన విభాగంతో పరీక్షను ప్రారంభించండి (చాలా మంది ఆశావహులు రసాయన శాస్త్రంతో ప్రారంభించడం సులభం అని భావిస్తారు) విభాగాల మధ్య సమయ నిర్వహణపై నిఘా ఉంచండి.

    7. ఇచ్చిన మూడు గంటల టైమ్ ను చక్కగా వినియోగించుకోవాలి కాబట్టి... మొదట ధియరీటికల్ ప్రశ్నలు ఎక్కువగా వచ్చే కెమిస్ట్రీ సెక్షన్ పూర్తి చేయాలి. ఇలా 40 నుండి 45 నిమిషాల్లో కెమిస్ట్రీలో వచ్చే 25 ప్రశ్నలు పూర్తి చేయాలి. 9. అనంతరం మ్యాధమేటిక్స్ సెక్షన్ ను ఎంచుకొని అందులో వచ్చే 25 ప్రశ్నలను 45 నిమిషాల్లో పూర్తి చేయాలి. అంటే కెమిస్ట్రీ, మ్యాథమేటిక్స్ సెక్షన్స్ లో వచ్చే 50 ప్రశ్నలను గంటన్నర అంటే 90 నిమిషాల్లో పూర్తి చేయాలి.10. మిగిలిన గంటన్నర సమయాన్ని ఎక్కువగా మ్యాధమేటికల్ క్వశ్చన్స్ వచ్చే ఫిజిక్స్ లోని 25 ప్రశ్నలు పూర్తి చేయాలి11. చివరి క్షణం కోసం దేన్నీ వదిలిపెట్టవద్దు. పరీక్షలో ప్రశాంతంగా ఉండండి. ఫ్రెష్ మైండ్ బాగా ఆలోచిస్తుంది. మీరు సమర్ధవంతంగా చదవ‌డంతోపాటు ఎక్కువ స్కోర్ చేస్తారు.12. ఒక్కో సెక్షన్ నుండి ఇచ్చే 25 ప్రశ్నల్లో కనీసం 22 ప్రశ్నలకు సమాధానాలు రాయగలిగేలా చూసుకోవాలి. ఇలా జేఈఈ మెయిన్ ఎగ్జామ్ ను కెమిస్ట్రీ సెక్షన్ తో మొదలుపెట్టి.. తొందరగా పూర్తిచేసి, అనంతరం మ్యాథమేటిక్స్, ఫిజిక్స్ లను పూర్తి చేస్తే.. జేఈఈలో మంచి మార్కులు సాధించవచ్చు.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Exam Tips, Exams, Jee, National Testing Agency

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు