• Home
  • »
  • News
  • »
  • jobs
  • »
  • JEE MAINS 2021 TO NEET UG 2021 NATIONAL TESTING AGENCY TO CONDUCT THESE EXAMS SOON CHECK HERE FOR DATES SS GH

Entrance Exams: విద్యార్థులకు అలర్ట్... త్వరలో జరగబోయే పరీక్షల షెడ్యూల్ ఇదే

Entrance Exams: విద్యార్థులకు అలర్ట్... త్వరలో జరగబోయే పరీక్షల షెడ్యూల్ ఇదే (ప్రతీకాత్మక చిత్రం)

Entrance Exams | నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పెండింగ్‌లో ఉన్న ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఏ పరీక్ష ఎప్పుడు ఉండొచ్చో తెలుసుకోండి.

  • Share this:
కరోనా కారణంగా చాలా రాష్ట్రాలు పదో తరగతి పరీక్షలను రద్దు చేసి, ఇంటర్‌కు నేరుగా అర్హత కల్పించాయి. అయితే ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలపై మాత్రం సస్పెన్స్ కొనసాగుతోంది. సీబీఎస్‌ఈ కూడా పన్నెండో తరగతి పరీక్షల నిర్వహణపై ఇప్పటికీ ఒక నిర్ణయానికి రాలేదు. ఆబ్జెక్టివ్ విధానంలో లేదా కొన్ని ప్రధాన సబ్జెక్టులకు మాత్రమే పరీక్షలు నిర్వహించే యోచనలో బోర్డు ఉన్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఎంట్రన్స్ ఎగ్జామ్స్‌పై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ- NTA కీలక నిర్ణయం తీసుకోనుంది. ఏప్రిల్, మే నెలలో జరగాల్సిన జేఈఈ మెయిన్స్‌ వాయిదా పడిన నేపథ్యంలో, ఈ పరీక్షలను జులై, ఆగస్టులో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ అండర్ గ్రాడ్యుయేట్ పరీక్షను సెప్టెంబరులో ఆఫ్‌లైన్ విధానంలో నిర్వహించాలని ఎన్‌టీఏ భావిస్తోంది. దీనికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూలై 1 నుంచి ప్రారంభమవుతుందని ఎన్‌టీఏ వర్గాలు తెలిపాయి. అయితే సెంట్రల్ యూనివర్సిటీస్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (CUCET) భవిష్యత్తు మాత్రం, పన్నెండో తరగతి బోర్డ్ ఎగ్జామ్స్‌పై ఆధారపడి ఉంటుందని బోర్డు వర్గాలు చెబుతున్నాయి.

పన్నెండో తరగతి పరీక్షలు, ఇతర ప్రవేశ పరీక్షల నిర్వహణపై సలహాలు, అభిప్రాయాలను వివిధ రాష్ట్రాలు మంగళవారం కేంద్ర విద్యా శాఖకు సమర్పించాయి. వీటి ఆధారంగా బోర్డు పరీక్షల భవితవ్యంపై సీబీఎస్‌ఈ జూన్ 1న నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. ఈ నిర్ణయం ఆధారంగానే వివిధ ప్రవేశ పరీక్షలు నిర్వహించాలని ఎన్‌టీఏ భావిస్తోంది. దీని ఆధారంగానే వివిధ రాష్ట్రాల ప్రవేశ పరీక్షలపై అధికారులు ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. పన్నెండో తరగతి బోర్డు పరీక్షలు నిర్వహించాలని బోర్డు భావిస్తే.. వాటిని ఎలాంటి ఫార్మాట్‌లో నిర్వహిస్తారనే అంశాన్ని సైతం ఎన్‌టీఏ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని ఒక అధికారి తెలిపారు.

DFCCIL Recruitment 2021: నిరుద్యోగులకు గుడ్ న్యూస్... ఈ 1074 ఉద్యోగాలకు దరఖాస్తు గడువు పెంపు

BEL Recruitment 2021: భారత్ ఎలక్ట్రానిక్స్‌లో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

బోర్డు పరీక్షలపై సీబీఎస్‌ఈ రెండు ప్రతిపాదనలు చేస్తోంది. ఒకటి.. ప్రధానమైన 19 సబ్జెక్టులకు పరీక్షలు నిర్వహించి, వాటిలో విద్యార్థుల ప్రతిభ ఆధారంగా గ్రేడ్లు ఇవ్వడం.. లేదా రెండు దశల్లో పరీక్షలు పూర్తి స్థాయిలో నిర్వహించడం. ఈ రెండో ఆప్షన్‌లో.. కరోనా ప్రభావం ఆధారంగా జులై 15 నుంచి ఆగస్టు 1 వరకు లేదా ఆగస్టు 5 నుంచి 26 వరకు పరీక్షలు నిర్వహించుకునే అవకాశం రాష్ట్రాలకు కల్పించాలని భావిస్తోంది. ఒకవేళ సీబీఎస్‌ఈ రెండో ఆప్షన్‌కు మొగ్గుచూపితే.. గతంలో వాయిదాపడిన ఏప్రిల్ రౌండ్ జెఈఈ మెయిన్స్ పరీక్ష జులై రెండవ వారంలో లేదా ఆగస్టు మొదటి వారంలో జరిగే అవకాశం ఉంది. ఇదే జరిగితే, మే రౌండ్ ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష కూడా సెప్టెంబర్ రెండో వారానికి వాయిదా పడే అవకాశం ఉంది.

DRDO Recruitment 2021: హైదరాబాద్‌లోని డీఆర్‌డీఓలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

Railway Jobs: రైల్వేలో 3591 జాబ్స్... నేటి నుంచి దరఖాస్తులు

ఆగస్టులో బోర్డు పరీక్షలు నిర్వహిస్తే, NEET-UG కూడా సెప్టెంబర్ మొదటి లేదా రెండవ వారానికి వాయిదా పడే అవకాశం ఉంది. అప్పుడు దీనికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ జులై 1 నుంచి ప్రారంభం కానుంది. అయితే ఇవన్నీ కోవిడ్ పరిస్థితులను బట్టి మారవచ్చు. దీంతో పాటు ఎన్‌ఐటీలు, ఇతర ప్రభుత్వ సంస్థల్లో ప్రవేశాలు కూడా ప్రభావితమవుతాయి. ఒకవేళ పన్నెండో తరగతి పరీక్షలను సీబీఎస్‌ఈ రద్దు చేసిన సందర్భంలో, సెంట్రల్ యూనివర్సిటీల్లో ప్రవేశాలకు CUCET ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. దీంతో అన్ని ప్రవేశ పరీక్షల భవితవ్యం సీబీఎస్‌ఈ పన్నెండో తరగతి పరీక్షల నిర్వహణపై ఆధారపడి ఉంటుందని విద్యారంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
Published by:Santhosh Kumar S
First published: