హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

JEE Main 2021 Results: జేఈఈ మెయిన్స్ రిజల్స్ విడుదల... ఇక్కడ చెక్ చేసుకోండి

JEE Main 2021 Results: జేఈఈ మెయిన్స్ రిజల్స్ విడుదల... ఇక్కడ చెక్ చేసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

JEE Main 2021 Results: జేఈఈ మెయిన్స్ 2021 ఫలితాలు విడుదలయ్యాయి.

  జేఈఈ మెయిన్స్ 2021 ఫలితాలు విడుదలయ్యాయి. జులై 20, 25, 27 తేదీల్లో ఈ పరీక్షలను నిర్వహించారు. ఫలితాలను jeemain.nta.nic.in‌లో చెక్ చేసుకోవచ్చు. పరీక్షకు సంబంధించి తుది సమాధానం 'కీ‌'ను రాత్రి విడుదల చేయనున్నారు. దాదాపు 7.09 లక్షల మంది విద్యార్థులు జులై 27న జరిగిన జేఈఈ మెయిన్ సెషన్ 3‌ను రాసేందుకు రిజిస్టర్ చేసుకున్నారు. జేఈఈ మెయిన్‌ను ఒక ఏడాది నాలుగుసార్లు నిర్వహించడం ఇదే తొలిసారి. ఫిబ్రవరిలో నిర్వహించిన సెషన్‌లో 9 మంది విద్యార్థులు 100 శాతం పర్సెంటైల్ స్కోర్ సాధించారు. మార్చిలో నిర్వహించిన సెషన్‌లో 13 మంది విద్యార్థులు 100 శాతం పర్సెంటైల్ సాధించారు. ఈసారి పరీక్ష సులభంగా ఉండటంతో ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక జేఈఈ మెయిన్ చివరి సెషన్‌ను ఆగస్టులో నిర్వహించనున్నారు.

  JEE Main Result 2021 చెక్ చేసుకోండిలా

  1. ముందుగా అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.nic.in‌ లోని వెళ్లాలి.

  2. అనంతరం అందులో 'JEE Main 2021 Result'లింక్‌ను క్లిక్ చేయాలి.

  3. అందులో మీ అప్లికేషన్ నంబర్‌తో పాటు ఇతర వివరాలు ఎంటర్ చేయాలి.

  4. మీ జేఈఈ మెయిన్ 2021 ఫలితాలు స్కీన్‌పై కనిపిస్తున్నాయి.

  5. ఫలితానికి సంబంధించిన వివరాలను ఫ్రింట్ తీసుకోవాలి.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: JEE Main 2021

  ఉత్తమ కథలు