Home /News /jobs /

JEE MAIN TOPPER IS A TELUGU STUDENT YOU WILL BE SHOCKED TO READ HOW HE PREPARED UMG GH

Success Story: జేఈఈ మెయిన్ టాపర్ తెలుగు విద్యార్థి.. అతను ఎలా ప్రిపేర్ అయ్యాడో చదివితే షాక్ అవుతారు !

  జేఈఈ మెయిన్ టాపర్ తెలుగు విద్యార్థి..  అతను ఎలా ప్రిపేర్ అయ్యాడో చదివితే  షాక్ అవుతారు !

జేఈఈ మెయిన్ టాపర్ తెలుగు విద్యార్థి.. అతను ఎలా ప్రిపేర్ అయ్యాడో చదివితే షాక్ అవుతారు !

జేఈఈ మెయిన్(JEE Main)- 2022 ఫలితాలు ఇటీవల విడుదలయ్యాయి. మొత్తం 24 మంది విద్యార్థులు 100 పర్సంటైల్ స్కోర్(Score) సాధించారు. వీరిలో తెలంగాణకు చెందిన ధీరజ్ కురుకుంద ఒకరు. ఈ స్థాయికి రావడానికి తానుపడ్డ కష్టం.. ప్రిపరేషన్ టిప్స్‌(Tips)తో పాటు తన సక్సెస్ స్టోరీ గురించి మరిన్ని వివరాలు తెలిపాడు..

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India
జేఈఈ మెయిన్(JEE Main)- 2022 ఫలితాలు ఇటీవల విడుదలయ్యాయి. మొత్తం 24 మంది విద్యార్థులు 100 పర్సంటైల్ స్కోర్(Score) సాధించారు. వీరిలో తెలంగాణ(Telangana)కు చెందిన ధీరజ్ కురుకుంద ఒకరు. ఈ స్థాయికి రావడానికి తానుపడ్డ కష్టం.. ప్రిపరేషన్ టిప్స్‌తో పాటు తన సక్సెస్ స్టోరీ గురించి మరిన్ని వివరాలు తెలిపాడు ధీరజ్. ఆ వివరాలు..

షెడ్యూల్ ప్లానింగ్‌, సెల్ప్ స్టడీ, అసెస్‌మెంట్.. ఇవే జేఈఈలో టాప్ ర్యాంక్(Rank)సాధించడానికి కారణాలని చెబుతున్నాడు ధీరజ్. ప్రతిరోజూ ఎనిమిది గంటలు డెడి‌కేషన్‌తో ప్రిపేర్ అయ్యాయని చెప్పుకొచ్చాడు. “టైమ్‌టేబుల్‌ను మూడు సబ్జెక్టుల ప్రకారం విభజించాను. ప్రతి సబ్జెక్టుకు రెండు గంటల సమయం కేటాయించాను. మిగిలిన రెండు గంటలు రివిజన్‌కు ప్రాధాన్యత ఇచ్చాను.’’ అని పేర్కొన్నాడు.

జేఈఈ అభ్యర్థులకు ధీరజ్ కొన్ని సూచనలు చేశాడు. ‘ఎటువంటి ఆందోళనకు గురికాకుండా పరీక్షకు ప్రిపేర్ అవ్వండి. ప్రిపరేషన్ టైమ్‌ మధ్యలో కాస్త విరామం తీసుకోండి. దీర్ఘకాలంలో ఇది మీకు సహాయం చేస్తుంది. ఆటల పట్ల ఆసక్తి ఉన్నవారు అప్పుడప్పుడు ఆడాలి. దీంతో మైండ్ రీఫ్రెష్ అవుతుంది.’ అని చెప్పాడు.

విద్యార్థులు టైమ్ మేనేజ్‌మెంట్ స్కిల్స్ పెంపొందించుకోవాలని సూచిస్తున్నాడు ఈ టాపర్. “పరీక్షకు సన్నద్ధమయ్యే సమయంలో సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం ఎంతో కీలకం. అయితే ఎక్కువ ఒత్తిడికి గురికావద్దు. 30 సెకన్లలో ప్రశ్నను పరిష్కరించడానికి ప్రయత్నించడం వంటి టార్గెట్‌తో ప్రిపరేషన్ కొనసాగిస్తే లేనిపోని ఇబ్బందులు పడవచ్చు. కాబట్టి టైమ్ మేనేజ్‌మెంట్‌పై దృష్టి పెడుతూ, ప్రతి ప్రశ్నకు సమయం వెచ్చించండి’’ అని సూచించాడు. పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న సమయంలో కుటుంబం తనకు ఎంతో మద్దతుగా నిలిచిందని ధీరజ్ తెలిపాడు.

కరోనా సమయంలో ఆన్‌లైన్ తరగతుల కారణంగా ప్రిపరేషన్ కోసం తనకు ఎక్కువ సమయం దొరికిందని, దీంతో మెరుగైన ఫలితాలను సాధించానని ధీరజ్ వెల్లడించారు. ప్రస్తుతం JEE అడ్వాన్స్‌డ్‌కు సిద్ధమవుతున్న ధీరజ్, ఐఐటీ బొంబాయిలో కంప్యూటర్ సైన్స్ చదవాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఇతను నారాయణ స్కూల్‌ విద్యార్థి. జేఈఈ మెయిన్స్ సెషన్ 2లో ఫిజిక్స్‌లో 99 శాతం, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌లో 100 శాతం స్కోర్ చేశాడు. ఇక సెషన్-1లో మూడు సబ్జెక్టుల్లో 100 పర్సంటైల్ సాధించాడు.

ఇదీ చదవండి: Airlines Fares: విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్.. తగ్గనున్న ఫ్లయిట్ చార్జీలు.. ఎప్పటినుంచంటే !


 ‘‘జేఈఈ ప్రిపరేషన్ చాలా వరకు మార్చి నాటికి పూర్తి చేశాను. ఆ తర్వాత బోర్డు పరీక్షలకు సిద్ధమయ్యాను. పరీక్షకు రెండు నెలల ముందు మాక్ టెస్ట్ పేపర్‌లతో పాటు ఎక్కువగా ఎన్‌సిఇఆర్‌టి సిలబస్ పై దృష్టిపెట్టాను.’’ అని ధీరజ్ తెలిపాడు.

కాగా, జేఈఈ అడ్వాన్స్‌డ్-2022 ఆగస్టు 28న జరగనుంది. పేపర్-1 ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, పేపర్ 2 మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు జరగనుంది. అభ్యర్థులు రెండు పేపర్లకు తప్పనిసరిగా హాజరు కావాలి.జేఈఈ అడ్వాన్స్‌డ్-2022 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(CBT). రెండు లాంగ్వేజ్‌‌లైన హిందీ, ఇంగ్లిష్‌లో మొత్తంగా ఆరు గంటల పాటు పరీక్ష జరుగుతుంది. ప్రతి ఏడాది మార్కింగ్ స్కీమ్ మారుతూ ఉంటుంది. తప్పు సమాధానాలకు నెగిటివ్ మార్క్స్ ఉండే అవకాశం ఉంది. అయితే ఇది కొన్ని ప్రశ్నలకు మాత్రమే ఉండవచ్చు. మార్కింగ్ స్కీమ్ వివరాలు ‘ఇన్‌స్ట్రక్షన్ టూ క్యాండిడేట్స్’ సెక్షన్‌లో పరీక్ష సమయంలో అభ్యర్థులకు అందుబాటులో ఉంచనున్నారు. ప్రతి పేపర్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ అనే మూడు భాగాలు ఉంటాయి.
Published by:Mahesh
First published:

Tags: IIT Bombay, Jee mains 2022, JOBS, Ranker

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు