Home /News /jobs /

JEE MAIN TO STATE LEVEL TESTS KNOW ENGINEERING ENTRANCE EXAM SCHEDULE GH VB

Engineering Entrance Exam: ఇంజనీరింగ్ చేయాలనుకుంటున్నారా..? వాటికి ఇవే దారులు.. తెలుసుకోండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

జాతీయ స్థాయిలో ఇంజనీరింగ్ అడ్మిషన్ల కోసం నిర్వహించే జాయింట్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ (JEE) మెయిన్ నుంచి రాష్ట్ర స్థాయి కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే స్టేట్​ ఎంట్రన్స్ టెస్ట్​ల వరకు షెడ్యూల్​ వివరాలను పరిశీలిద్దాం.

దేశంలో వివిధ విద్యాసంస్థల్లో ఇంజనీరింగ్(Engineering) ప్రవేశాలకు సంబంధించిన పరీక్షల షెడ్యూల్స్ విడుదలయ్యాయి. జాతీయ స్థాయిలో ఇంజనీరింగ్ అడ్మిషన్ల(Admissions) కోసం నిర్వహించే జాయింట్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ (JEE) మెయిన్ నుంచి రాష్ట్ర స్థాయి కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే స్టేట్​ ఎంట్రన్స్ టెస్ట్​ల(Entrance Test) వరకు షెడ్యూల్​ వివరాలను పరిశీలిద్దాం. అందులో మొదటిది జేఈఈ మెయిన్ 2022. ఈ జేఈఈ మెయిన్ 2022 నోటిఫికేషన్ ఫిబ్రవరిలోనే విడుదల కానుంది. జేఈఈ మెయిన్​ ఎగ్జామ్​ ప్యాటర్న్​పై ఎన్​టీఏ త్వరలోనే స్పష్టతనివ్వనుంది. అయితే, గతేడాది మాదిరిగానే ఈ సారి కూడా నాలుగు సార్లు పరీక్షను నిర్వహించే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ, నోటిఫికేషన్​ విడుదలయ్యాకే దీనిపై స్పష్టత రానుంది.

GUJ సెట్​..
గుజరాత్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (GUJ CET) 2022 దరఖాస్తు ప్రక్రియ జనవరి 25న ప్రారంభమైంది. రేపటి (ఫిబ్రవరి 5)తో దరఖాస్తు ప్రక్రియ ముగియనుంది. అర్హత గల అభ్యర్థులు gujcet.gseb.orgలో దరఖాస్తు చేసుకోవాలి. పరీక్షను ఇంగ్లిష్​, హిందీ, గుజరాతీ అనే మూడు భాషల్లో నిర్వహిస్తారు.

Super Computer: మోస్ట్ పవర్​ఫుల్ సూపర్​ కంప్యూటర్​ను అభివృద్ధి చేసిన C-DAC​.. ఎక్కడ ఏర్పాటు చేశారంటే..


WBJEE..
పశ్చిమ బెంగాల్ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (WBJEE) దరఖాస్తు ప్రక్రియ ఇటీవలే ముగిసింది. ఈ పరీక్షను ఏప్రిల్ 23న నిర్వహించనున్నారు. ఏప్రిల్ 18 నుంచి అడ్మిట్ కార్డులను జారీ చేస్తారు.

VIT, వేలూరు..
వేలూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (VIT) తన ఆంధ్రప్రదేశ్​, భోపాల్‌ క్యాంపస్‌లలో ఇంజనీరింగ్​ అడ్మిషన్ల కోసం దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి గల అభ్యర్థులు www.viteee.vit.ac.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అయితే, దరఖాస్తుకు చివరి తేదీని ఇన్‌స్టిట్యూట్ ఇంకా ప్రకటించలేదు.

AEEE..
అమృత ఇంజనీరింగ్ ఎంట్రన్స్​ టెస్ట్ (AEEE) 2022 పరీక్షను మార్చి, మే నెలల్లో నిర్వహించనున్నారు. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అమృతపురి, అమరావతి, బెంగళూరు, కోయంబత్తూరు, చెన్నైలోని అమృత క్యాంపస్‌లలో ప్రవేశాలుంటాయి. కనీసం 60 శాతం మార్కులతో 12వ తరగతి పాసైన విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

టీఎస్​ ఎంసెట్..
తెలంగాణ స్టేట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీఎస్​ ఎంసెట్​) దరఖాస్తు ప్రక్రియ మే 2022లో ప్రారంభం కానుంది. ఈ పరీక్షను జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ హైదరాబాద్ నిర్వహిస్తుంది. తెలంగాణలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ ఇంజినీరింగ్​, మెడికల్​ కాలేజీల్లో ప్రవేశాల కొరకు టీఎస్​ ఎంసెట్​ నిర్వహిస్తారు.

SRM జేఈఈ..
SRM డీమ్డ్​ వర్సిటీలో ఇంజినీరింగ్​ ప్రవేశాల కొరకు ఎస్​ఆర్​ఎం జేఈఈ పరీక్ష నిర్వహిస్తారు. ఇప్పటికే మొదటి దశ దరఖాస్తుల ప్రక్రియ పూర్తి కాగా.. రెండో దశ ఏప్రిల్ 18 వరకు, మూడవ దశ జూన్ 20 వరకు కొనసాగుతుంది. రెండో దశ దరఖాస్తుదారులకు ఏప్రిల్ 23, 24 తేదీల్లో పరీక్ష నిర్వహిస్తారు. మూడో దశ దరఖాస్తుదారులకు జూన్ 25, 26 తేదీల్లో పరీక్ష ఉంటుంది.

Good News: వారికి గుడ్ న్యూస్ చెప్పిన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ .. ప్రతి నెలా రూ.10 వేల స్టైఫండ్.. ఎలా అంటే..


బిట్‌శాట్..
బిట్స్ పిలానీలో ఇంజినీరింగ్​ ప్రవేశాలకు దరఖాస్తు ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు. ఏప్రిల్​లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. బిట్​శాట్​2022 పరీక్ష వివరాలు త్వరలో వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి.

ఓజేఈఈ..
ఒడిశా జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (OJEE) 2022 దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి చివరి నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఒడిశా రాష్ట్రంలోని అనేక ప్రభుత్వం, ప్రైవేట్ కాలేజీల్లో ఇంజనీరింగ్, మెడిసిన్​, మేనేజ్‌మెంట్ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ పరీక్ష నిర్వహించనున్నారు.
Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, Jee, JEE Main 2021

తదుపరి వార్తలు