హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

JEE Main 2022: విద్యార్థులకు అలర్ట్.. జేఈఈ మెయిన్‌ సెషన్‌ 2 ఎగ్జామ్ షెడ్యూల్‌ విడుదల.. పూర్తి వివరాలివే

JEE Main 2022: విద్యార్థులకు అలర్ట్.. జేఈఈ మెయిన్‌ సెషన్‌ 2 ఎగ్జామ్ షెడ్యూల్‌ విడుదల.. పూర్తి వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

జాయింట్‌ ఎంట్రెన్స్‌ ఎగ్జామినేషన్‌ (జేఈఈ) సెషన్‌-2 మెయిన్‌ పరీక్షల విషయంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) తాజాగా కీలక ప్రకటన చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  జాయింట్‌ ఎంట్రెన్స్‌ ఎగ్జామినేషన్‌ (జేఈఈ) సెషన్‌-2 మెయిన్‌ పరీక్షల విషయంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తాజాగా కీలక ప్రకటన చేసింది. జులై 21 నుంచి 30 వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు షెడ్యూలు ప్రకటించింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియను ఈ నెల 1 నుంచి ప్రారంభించనున్నట్లు తెలిపింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు జూన్‌ 30 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది. అభ్యర్థులు పరీక్ష ఫీజును జూన్‌ 30వ తేదీ రాత్రి 11.50 గంటల వరకు చెల్లించవచ్చని తెలిపింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. ఇక సెషన్‌ 1 అడ్మిట్‌ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తన అధికారిక వెబ్ సైట్ https://jeemain.nta.nic.in/లో త్వరలో విడుదల చేయనుంది.

  ఇదిలా ఉంటే.. గతంలో విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం జేఈఈ మెయిన్‌ సెషన్ 1 పరీక్షలను ఏప్రిల్ 21, 24, 25, 29, మే 1, 4 తేదీల్లో నిర్వహించాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఆ తేదీలు మారాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తాజాగా విడుదల చేసిన షెడ్యూల్‌ ప్రకారం జూన్ 20, 21, 22, 23, 24, 26, 26, 27, 28, 29 తేదీలకు ఈ ఎగ్జామ్స్ ను మార్చినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఓ ప్రకటనలో వెల్లడించింది. సెషన్ 2 కు సంబంధించి సైతం గతంలో విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం మే 24, 25, 26, 27, 28, 29 తేదీల్లో పరీక్షలను నిర్వహించాల్సి ఉంది. అయితే.. ఆ తేదీలను ఇప్పుడు మార్చారు. తాజాగా విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం.. ఆ పరీక్షలను జులై 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30 తేదీల్లో నిర్వహించనున్నారు.

  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: Career and Courses, Exams, Jee main 2022

  ఉత్తమ కథలు