Home /News /jobs /

JEE MAIN SESSION 2 APPLICATION WINDOW REOPENS WILL EXAM BE POSTPONED UMG GH

JEE Main 2022, Session-2: జేఈఈ స్టూడెంట్స్‌కు గుడ్ న్యూస్.. ఎగ్జామ్ వాయిదా పడే ఛాన్స్.?. దరఖాస్తు గడువు పొడిగింపు..!

జేఈఈ మెయిన్స్ దరఖాస్తు గడువు పొడిగింపు

జేఈఈ మెయిన్స్ దరఖాస్తు గడువు పొడిగింపు

జాతీయ స్థాయిలో ప్రవేశ పరీక్షలను నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది జేఈఈ (JEE) మెయిన్ సెషన్ -2 కోసం దరఖాస్తు ప్రక్రియను మళ్లీ ప్రారంభించింది. 

జాతీయ స్థాయిలో ప్రవేశ పరీక్షలను నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది జేఈఈ మెయిన్ (Jee Mains) సెషన్ -2 కోసం దరఖాస్తు ప్రక్రియను మళ్లీ ప్రారంభించింది. ఇటీవల జరిగిన జేఈఈ మెయిన్ సెషన్-1‌కు చాలా మంది అభ్యర్థులు హాజరు కాలేదు. అగ్నిపథ్ అల్లర్లతో దేశవ్యాప్తంగా రవాణా వ్యవస్థ స్తంభించింది. అలాగే అస్సాంలో కూడా వరదలు సంభవించడంతో ఎక్కువ సంఖ్యలో అభ్యర్థులు పరీక్షలకు హాజరకాలేక పోయారు. ఇక రాజస్థాన్‌లో 144 సెక్షన్ విధించారు. ఈ నిర్ణయం కూడా విద్యార్థుల్లో గందరగోళాన్ని సృష్టించింది. ఈ నేపథ్యంలో జేఈఈ మెయిన్ సెషన్-1‌కు హాజరు కాలేని అభ్యర్థులు.. సెషన్ 2‌కు అనుమతించాలని ఎన్‌టీఏ‌కు విజ్ఞప్తి చేశారు.

అభ్యర్థుల నుంచి వస్తున్న అభ్యర్థనలను పరిగణలోకి తీసుకున్న ఎన్‌టీఏ, తిరిగి దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది. ఏదైనా కారణం వల్ల జేఈఈ సెషన్-1కు హాజరుకాలేని వారు రెండో సెషన్‌‌కు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది.

జులై 9 రాత్రి 11 గంటల వరకు అభ్యర్థులు జేఈఈ సెషన్ 2 కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఎన్‌టీఏ అవకాశం కల్పించింది. దరఖాస్తు రుసుమును జులై 9 రాత్రి 11.50 గంటల లోపు చెల్లించాలి. జేఈఈ మెయిన్ సెషన్ -2 దరఖాస్తు గడువు పొడిగింపుతో అడ్వాన్స్‌డ్ సిటీ ఇన్‌ఫర్మేషన్ స్లిప్స్, అడ్మిట్ కార్డ్ జారీ కూడా ఆలస్యం కానున్నాయి.

ఇదీ చదవండి: యుద్ధం మొదలై నెలలు గడుస్తున్నా రష్యా గెలవలేకపోతోంది ఎందుకు..?


* జేఈఈ మెయిన్‌ సెషన్‌-2 వాయిదాకు డిమాండ్‌
జేఈఈ మెయిన్ సెషన్ -2 పరీక్షను వాయిదా వేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నా.. వాయిదాకు సంబంధించి ఎన్‌టీఏ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. కాగా, జేఈఈ మెయిన్ సెషన్ -2 పరీక్షలు జులై 21 నుంచి 30 వరకు జరగనున్నాయి.

జేఈఈ మెయిన్ సెషన్ 1కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు, సెషన్ 2 పరీక్షలకు హాజరుకావాలంటే మునుపటి అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వాలి. పరీక్ష పేపర్, మీడియం, సెషన్ 2 ఎగ్జామ్ సిటీలను మాత్రమే ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.



జనరల్ అభ్యర్థులు రూ.600 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. మహిళా అభ్యర్థులు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, థర్డ్ జెండర్ అభ్యర్థులు రూ.325 చెల్లించాలి. అదే విదేశాలకు చెందిన అభ్యర్థులైతే రూ. 3000 చెల్లించాలి. ఇక విదేశాలకు చెందిన మహిళ, థర్డ్ జెండర్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు ఫీజు రూపంలో రూ.1500 చెల్లించాలి.

జేఈఈ మెయిన్ -2022 కోసం టై-బ్రేకర్ విధానంలో మార్పులు చోటుచేసుకున్నాయి. టై అయిప్పుడు విద్యార్థుల స్కోర్‌ను బ్రేక్ చేయడానికి గతంలో ఉన్న విధానాన్ని ఎన్‌టీఏ తిరిగి తీసుకొచ్చింది. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది అభ్యర్థులు ఒకే మార్కులను స్కోర్ చేసినప్పుడు.. గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ లేదా నెగెటివ్ మార్కింగ్‌మార్కులతో సహా ఇతర మార్గాల ద్వారా టై పరిష్కరించలేకపోతే, JEE మెయిన్‌కు ముందు దరఖాస్తు చేసిన అభ్యర్థికి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. వయసు నిబంధనలను ఈసారి అమలు చేయనున్నారు.
Published by:Mahesh
First published:

Tags: Career and Courses, Jee mains 2022, JOBS, Students

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు