హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

JEE Main Admit Card 2022: జేఈఈ మెయిన్ సెషన్-1 హాల్ టికెట్లు విడుదల.. ఇలా డౌన్ లోడ్ చేసుకోండి

JEE Main Admit Card 2022: జేఈఈ మెయిన్ సెషన్-1 హాల్ టికెట్లు విడుదల.. ఇలా డౌన్ లోడ్ చేసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

జేఈఈ మెయిన్ సెషన్-1 కు సంబంధించిన అడ్మిట్ కార్డులను (JEE Admit Card) నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) తాజాగా విడుదల చేసింది.

  జేఈఈ మెయిన్ సెషన్-1 (JEE Main 2022) కు సంబంధించిన అడ్మిట్ కార్డులను (JEE Admit Card) నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తాజాగా విడుదల చేసింది. ఈ నెల 23 నుంచి 29 వరకు ఈ పరీక్షలు (Exams) నిర్వహించనున్నారు. అయితే.. పరీక్షకు తేదీ సమీపిస్తున్నా... ఇంకా హాల్ టికెట్లు విడుదల కాకపోవడంతో అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. ఎట్టకేలకు ఈ రోజు హాల్ టికెట్లు విడుదల కావడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు.అభ్యర్థులు jeemain.nta.nic.in వెబ్ సైట్ ను సందర్శించి హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు అప్లికేషన్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ నమోదు చేసి అడ్మిట్ కార్డులను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

  అభ్యర్థులు ఈ స్టెప్స్ తో డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది..

  Step 1: అభ్యర్థులు మొదటగా అధికారిక వెబ్ సైట్ (https://jeemain.nta.nic.in/) ను ఓపెన్ చేయాలి.

  Step 2: హోం పేజీలో Download Admit Card for JEE (Main) 2022 Session-1 లింక్ లు కనిపిస్తాయి. ఆ లింక్ పై క్లిక్ చేయాలి.

  Step 3: కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.

  Step 4: ఆ పేజీలో Application No, Date of Birth నమోదు చేసి సబ్మిట్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

  Step 5: దీంతో మీ అడ్మిట్ కార్డు హోం స్క్రీన్ పై కనిపిస్తుంది. డౌన్ లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవాలి.

  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: Exams, Jee main 2022, JOBS

  ఉత్తమ కథలు