Home /News /jobs /

JEE MAIN SECOND SESSION EXAMS POSTPONED HERE NEW DATES NS

JEE Exams: జేఈఈ మెయిన్ రెండో విడత పరీక్షలు వాయిదా.. కొత్త తేదీలివే

జేఈఈ మెయిన్ రెండ్ విడత పరీక్షలు వాయిదా పడ్డాయి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు, కొత్త తేదీలు ఇలా ఉన్నాయి.

    జేఈఈ మెయిన్ రెండో విడత పరీక్షలు వాయిదా పడ్డాయి. వాస్తవానికి ఈ పరీక్షలు రేపటి నుంచి అంటే జులై 21 నుంచి ప్రారంభమై.. ఈ నెల 30వ తేదీన ముగియాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఆ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెల్లడించింది. వాయిదా వేసిన పరీక్షలను జులై 25 నుంచి నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) వెల్లడించింది. ఈ మేరకు బుధవారం ప్రకటన విడుదల చేసింది. అయితే.. పరీక్షల వాయిదాకు సంబంధించిన కారణాలను మాత్రం తెలపలేదు. ఈ పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులను అభ్యర్థులు రేపటి నుంచి అంటే ఈ నెల 21 నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే జేఈఈ మెయిన్ తొలి విడత పరీక్షలను గత నెల అంటే జూన్ 23వ తేదీ నుంచి 29 వరకు నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫలితాలను ఈ నెల 11న విడుదల చేశారు.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Exams, Exams postponed, Jee main 2022, JOBS

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు