హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

JEE Main Scam: జేఈఈ మెయిన్స్‌లో అవ‌క‌త‌వ‌క‌లు..

JEE Main Scam: జేఈఈ మెయిన్స్‌లో అవ‌క‌త‌వ‌క‌లు..

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

దేశంలో ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్వ‌హించే జేఈఈ మెయిన్స్‌(JEE Mains)లో అవ‌క‌త‌వ‌కలను సీబీఐ బ‌య‌ట పెట్టింది. ఈ అవ‌క‌తవ‌క‌ల‌కు సంబంధించి ఏడుగురు విద్యార్థుల‌ను(Students) అధికారులు సస్పెండ్ చేశారు. పలువురిని అరెస్టు(Arrest) చేశారు.

  దేశంలో ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్వ‌హించే జేఈఈ మెయిన్స్‌(JEE Mains)లో అవ‌క‌త‌వ‌కలు బ‌య‌ట ప‌డ్డాయి. ఈ అవ‌క‌తవ‌క‌ల‌కు సంబంధించి ఏడుగురు విద్యార్థుల‌ను అధికారులు సస్పెండ్ చేశారు. అభ్య‌ర్థులు వారి బ‌దులుగా వెరొక‌రిని ప‌రీక్ష రాసేందుకు పంపిన‌ట్టు గుర్తించారు. ఇలా వెరొక‌రు ప‌రీక్ష రాసేందుకు అభ్యర్థులు రూ.15ల‌క్ష‌లు చెల్లించిన‌ట్టు సీబీఐ అధికారుల తెలిపారు.

  జేఈఈ అవ‌క‌త‌క‌ల‌పై సీబీఐ ఢిల్లీ, ఇండోర్‌, పుణె, బెంగ‌ళూరు, జంషెడ్‌పూర్‌ల‌లో త‌నిఖీలు చేసింది. ఢిల్లీ, పుణె, జంషెడ్‌పూర్‌, ఇండోర్‌, బెంగ‌ళూర్‌ల్లోని 20 చోట్ల సీబీఐ అధికారులు దాడులు చేశారు. ఇందులో వారికి 25 లాప్‌టాప్‌లు(laptops), 7 ప‌ర్స‌న‌ల్ కంప్యూట‌ర్లు, 30 పోస్ట్ డేటెడ్ చెక్‌లు, వివిధ విద్యార్థుల పీడీసీ మార్క్‌షీట్స్ ప‌లు ఆధారాల‌ను స్వాధీనం చేసుకొన్నారు.

  అభ్య‌ర్థుల నుంచి రూ.15ల‌క్ష‌లు వ‌సూలు..

  ఈ త‌నిఖీల్లో అవ‌క‌త‌వ‌క‌ల‌కు పాల్ప‌డిన‌ట్టు భావిస్తున్న ఎఫినిటి ఎడ్యుకేష‌న్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ‌తోపాటు దాని డైరెక్ట‌ర్లు సిద్ధార్థ్ కృష్ణ‌, విశ్వంభ‌ర్ మ‌ణి త్రిపాఠి, గోవింద్ వ‌ర్ష్‌నేయ్‌ల‌పై సీబీఐ కేసు న‌మోదు చేసింది. ఎన్ఐటీలో అడ్మిష‌న్(Admission) పొందాల‌ని కోరుకుంటున్న విద్యార్థుల నుంచి వీరు భారీ మొత్తంలో డ‌బ్బులు తీసుకొని అవ‌క‌త‌వ‌క‌ల‌కు పాల్ప‌డుతున్నారు. వీరు హ‌ర్యానాలోని సోనేప‌ట్ వ‌ద్ద ప‌రీక్షా కేంద్రంలో ప‌రీక్ష రాస్తున్న విద్యార్థి.. రిమోట్ యాక్సెస్ ద్వారా జ‌వాబులు తెలిసేలా చేశార‌ని సీబీఐ గుర్తించిన‌ట్టు స‌మాచారం.

  WCL Recruitment 2021: వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌లో 316 అప్రెంటీస్ ఖాళీలు  విద్యార్థుల నుంచి 10వ‌, 12వ త‌ర‌గ‌తి మార్కుల జాబితాలు, యూజ‌ర్ ఐడీలు, పాస్‌వ‌ర్డ్‌లు తీసుకున్నారు. పోస్ట్ డేటెడ్(Post Dated) చెక్‌లు తీసుకున్నారు. ఒక్కొక్క‌రి నుంచి రూ.12-15 ల‌క్ష‌లు వ‌సూలు చేశార‌ని సీబీఐ అధికార ప్ర‌తినిధి ఆర్సీ జోషి చెప్పారు. అదుపులోకి తీసుకున్న మరియు కొంతమంది పేరులేని వ్యక్తులపై విచారణ కొనసాగుతోంద‌ని అధికారులు తెలిపారు.

  జీఈఈ(JEE) మెయిన్ గతంలో సీబీఎస్ఈ(CBSE) ద్వారా నిర్వహించబడింది. ప్రస్తుతం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ద్వారా నిర్వహించబడుతుంది. పరీక్షలను మరింత శాస్త్రీయంగా, పారదర్శకంగా నిర్వహించ‌డానికి NTA ఏర్పాటు చేయబడింది. ప్రతి సంవత్సరం, దాదాపు 10 లక్షల మంది అభ్యర్థులు JEE మెయిన్ కోసం హాజరవుతారు. ప్ర‌స్తుతం జ‌రిగిన స్కామ్‌లో నిందితులు అభ్య‌ర్థుల వ‌ద్ద నుంచి డ‌బ్బులు వ‌సూలు చేసి టాప్ ఎన్ఐటీలో అడ్మిష‌న్ వ‌చ్చేలా చేస్తామ‌ని న‌మ్మ‌బ‌లుకుతున్నారు. ప‌రీక్ష‌లో అభ్య‌ర్థి బ‌దులు వెరొక‌రిని రాయిస్తున్న‌ట్లు స‌మాచారం ఉంది. ఇందు కోసం సోనేపట్ (హర్యానా) లోని ఎంచుకున్న పరీక్షా కేంద్రం నుంచి రిమోట్ యాక్సెస్ ద్వారా దరఖాస్తుదారుడి ప్రశ్నపత్రాన్ని తెలుసుకొని దాని ద్వారా భారీ మొత్తంలో డబ్బును ఈ స్కామ్‌కు పాల్ప‌డుతున్నార‌ని సీబీఐ పేర్కొంది.

  Published by:Sharath Chandra
  First published:

  Tags: JEE Main 2021

  ఉత్తమ కథలు