• HOME
  • »
  • NEWS
  • »
  • JOBS
  • »
  • JEE MAIN RESULTS 2021 THE RESULTS OF JEE MAIN MAY COME TODAY CHICK YOUR RESULTS HERE AT JEEMAIN NTA NIC IN NK

JEE Main Results 2021: నేడు జేఈఈ మెయిన్ ఫలితాలు రిలీజ్. ఇలా చెక్ చేసుకోండి

JEE Main Results 2021: నేడు జేఈఈ మెయిన్ ఫలితాలు రిలీజ్. ఇలా చెక్ చేసుకోండి

నేడు జేఈఈ మెయిన్ ఫలితాలు రిలీజ్ (ప్రతీకాత్మక చిత్రం)

JEE Main Results 2021: ఎన్నాళ్లో వేచిన ఉదయం వచ్చేసింది. ఫిబ్రవరిలో జరిగిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE) 2021 పరీక్షా ఫలితాల్ని ఇలా చెక్ చేసుకోండి.

  • Share this:
    JEE Main Results 2021: నేడు జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ 2021 ఫలితాలు విడుదల కాబోతున్నాయి. IIT, NIT, IIIT, GFTIలలో ప్రవేశాల కోసం ఈ సంవత్సరం ఫిబ్రవరి 23-26 మధ్య జరిగిన తొలి విడత JEE మెయిన్ రిజల్ట్స్ ఇవాళ రాబోతున్నాయి. ఇందుకోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) రెడీగా ఉంది. మీకు తెలుసు... ఈ పరీక్షలు రాసేందుకు దేశవ్యాప్తంగా 6,61,761 మంది అప్లై చేసుకున్నారు. కానీ 5.5 లక్షల మంది దాకా రాశారు. మరి ఇప్పుడు ఫలితాల టైమ్ వచ్చేసింది. అవి ఎలా చెక్ చేసుకోవాలి అనే టెన్షన్ అవసరం లేదు. దానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు కాబట్టి... ఏమాత్రం శ్రమ లేకుండా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు.

    జేఈఈ మెయిన్ పరీక్ష రాసిన అభ్యర్థులు జేఈఈ అధికారిక వెబ్‌సైట్‌లో రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు. ఇందుకోసం జేఈఈ అధికారిక వెబ్‌సైట్‌ ఉంది. అది ఇదే https://jeemain.nta.nic.in ఇందులో ఫలితాలు చూసుకొని... ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ సంవత్సరం నాలుగు దఫాలుగా జేఈఈ మెయిన్స్ నిర్వహిస్తున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ ఫోఖ్రియాల్ నిశాంక్ జనవరిలో తెలిపారు. వాటిలో తొలి పరీక్షను ఫిబ్రవరిలో జరిపారు. మార్చి, ఏప్రిల్, మేలో మెయిన్స్ జరపనున్నారు. మెయిన్ పర్సంటైల్ స్కోర్, పర్సంటైల్ ర్యాంక్‌ను స్కోరు లేదా పర్సంటైల్ ర్యాంక్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేస్తుంది. ఆరుగురు విద్యార్థుల మార్కుల ఆధారంగా 100 శాతం పర్సంటైల్ ర్యాంకును ప్రకటిస్తారు.

    నిజానికి NTA విడుదల చేసిన సర్క్యులర్ ప్రకారం... ఆదివారం ఫలితాలు విడుదలవుతాయని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు. వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చని చెప్పడంతో... చాలా మంది అభ్యర్థులు చెక్ చేసుకొని నిరాశ చెందారు. అందువల్ల ఇవాళ కచ్చితంగా రిలీజ్ అవుతాయని భావిస్తున్నారు.





    జేఈఈ అడ్వాన్స్‌డ్ 2021 పరీక్షా ఫలితాలు విడుదలయ్యాక కటాఫ్ మార్కులు ప్రకటిస్తారు. మాతృభాషలో పరీక్ష రాసే అవకాశం ఉండటంతో పాటు నెగెటివ్ మార్కుల్ని తీసేశారు. 11 భాషల్లో పరీక్ష ఉంటుంది.

    ఇది కూడా చదవండి: MS Dhoni: మిస్టర్ కూల్ ధోనీకి స్పెషల్ అవార్డ్... క్రికెట్‌లో మాత్రం కాదండోయ్...

    దేశంలో కరోనా కేసులు ఇంకా తగ్గలేదు కాబట్టి... ఈసారి పరీక్షల నిర్వహణలో కొన్ని మార్పులు చేస్తున్నారు. వాటి ప్రభావం అభ్యర్థులపై ఉండబోదని చెబుతున్నారు.
    Published by:Krishna Kumar N
    First published:

    అగ్ర కథనాలు