JEE Mains Result 2021: జేఈఈ మెయిన్ ఫ‌లితాలు విడుదల‌ : టాపర్స్ వీరే

(ప్రతీకాత్మక చిత్రం)

విద్యార్థులు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న జేఈఈ ఫోర్త్ సెష‌న్ ఫ‌లితాలు విడుద‌ల అయ్యాయి. సెప్టెంబ‌ర్ 14, 2021 అర్ధ‌రాత్రి దాటాక విద్యార్థుల ర్యాంకుల‌ను నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ(National Testing Agency) విడుద‌ల చేసింది.

  • Share this:
    విద్యార్థులు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న జేఈఈ ఫోర్త్ సెష‌న్ ఫ‌లితాలు విడుద‌ల అయ్యాయి. సెప్టెంబ‌ర్ 14, 2021 అర్ధ‌రాత్రి దాటాక విద్యార్థుల ర్యాంకుల‌ను నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ(National Testing Agency) విడుద‌ల చేసింది. ఈ ఫ‌లితాల్లో 44 మంది విద్యార్థులు 100 ప‌ర్సంటైల్ సాధించారు. 18 మంది విద్యార్థులకు మొద‌టి ర్యాంక్ వ‌చ్చింది.
    జేఈఈ ఫ‌లితాల్లో ఇద్ద‌రు తెలంగాణ విద్యార్థులు మొద‌టి ర్యాంక్ సాధించ‌గా.. న‌లుగురు ఏపీ విద్యార్థులు మొద‌టి ర్యాంక్ సాధించారు. తెలంగాణ నుంచి కొమ్మ శ‌ర‌ణ్య‌, జోస్యూల వెంకట ఆదిత్య మొద‌టి ర్యాంకు సాధించారు. ఏపీ నుంచి దుగ్గినేని వెంక‌ట‌ ప‌నీష్‌, ప‌స‌ల వీర‌శివ‌, కుంచ‌న‌ప‌ల్లి రాహుల్ నాయుడు, కరణం లోకేష్ మొద‌టి ర్యాంకు సాధించారు. జేఈఈ మెయిన్​ సెషన్​ 4ను ఆగస్టు​ 26, 27, 31, సెప్టెంబర్​ 1, 2 తేదీల్లో నిర్వహించారు. ఈ పరీక్ష దేశవ్యాప్తంగా ఉన్న 334 ఎగ్జామ్​ సెంటర్లలో జరిగింది.

    టాప‌ర్స్ లిస్ట్
    గౌరబ్ దాస్ - కర్నాటక
    వైభవ్ విశాల్ -బీహార్
    దుగ్గినేని వెంకట పనీష్ - ఆంధ్ర ప్రదేశ్
    సిద్ధాంత్ ముఖర్జీ - రాజస్థాన్‌
    రుచిర్ బన్సల్ - ఢిల్లీ
    అమయ్య సింఘాల్ - ఉత్తర ప్రదేశ్
    మృదుల్ అగర్వాల్ - రాజస్థాన్‌
    కొమ్మ శరణ్య - తెలంగాణ
    జోస్యూల వెంకట ఆదిత్య - తెలంగాణ
    అథర్వ అభిజిత్ తంబత్ - మహారాష్ట్ర
    కావ్య చోప్రా - ఢిల్లీ
    పసల్వ వీర శివ - ఆంధ్ర ప్రదేశ్
    కంచనపల్లి రాహుల్ నాయుడు - ఆంధ్రప్రదేశ్
    కరణం లోకేష్ - ఆంధ్రప్రదేశ్
    పుల్కిత్ గోయల్ - పంజాబ్
    పాల్ అగర్వాల్ - ఉత్తర ప్రదేశ్
    గుర్రమ్రిత్ సింగ్ - చండీగఢ్
    అన్షుల్ వర్మ - రాజస్థాన్‌

    ఫలితాలు చూసుకోండి ఇలా..
    విద్యార్థులు ముందు jeemain.nta.nic.in వెబ్‌సైట్​లోకి లాగిన్ అవ్వాలి. తరువాత హోమ్‌పేజీలో కనిపించే జేఈఈ మెయిన్స్​ రిజల్ట్​ లింక్‌పై క్లిక్ చేయండి. మీ లాగిన్ వివరాలను నమోదు చేయండి. సబ్​మిట్​ చేసి మీ రిజల్ట్​ చెక్​ చేసుకోండి. జేఈఈ మెయిన్​ ఫలితాల కోసం jeemain.nta.nic.in, nta.ac.in, nta.nic.in, Ntaresults.nic.in వెబ్​సైట్లను సందర్శించండి.

    Engineering Courses: కొత్తవి వచ్చేశాయ్.. పాతవి త‌గ్గాయి: ఇంజ‌నీరింగ్‌లో కొత్త కోర్సుల‌కు ప్ర‌భుత్వం అనుమ‌తి


    ర్యాంక్ లెక్కించే విధానం..
    ఫ‌లితం ప‌ర్సంటైల్ రూపంలో ఉంటుంది. మీకు వ‌చ్చిన మార్కుల‌ను ప‌ర్సంటైల్ (Percentile) రూపంలోకి మార్చి ఇస్తార‌ని అర్థం. ప‌రీక్ష‌లో టాప్ వ‌చ్చ‌ని మార్కును 100 ప‌ర్సంటైల్‌గా ఇస్తారు. మిగ‌తా మార్కుల‌ను దానితో పోల్చుతూ ప‌ర్సంటైల్‌ను ప్ర‌క‌టిస్తారు. ప‌ర్సంటైల్ స్కోర్ ఏడు డెసిమ‌ల్ పాయింట్ల వ‌ర‌కు లెక్కిస్తారు. విద్యార్థుల మధ్య టై కాకుండా ఉండేదుకు ఈ విధానాన్ని పాటిస్తారు.
    కొత్త టై-బ్రేక్ విధానం..
    ఈ ఏడాది టై-బ్రేక్ విధానం మార్చ‌బ‌డింది. ప‌రీక్ష‌లో గ‌ణితం మార్కుల‌కు అధికా ప్రాధాన్య‌త ఇస్తారు. త‌రువాత ఫిజిక్స్ త‌రువాత కెమిస్ట్రీకి ఇస్తారు. ప‌ర్సంటైల్ లెక్కించిన త‌ర్వాత ర్యాంకులు(Ranks) కేటాయించ‌డానికి మెరిట్ జాబితా రూపొందించ‌డాన‌కి ఈ విధానం వాడ‌తారు. గ‌తంలో విద్యార్థుల వ‌య‌సు ప్రాధాన్యం ఇచ్చే వారు. ఈ ఏడాది ఆ విధానం తీసి వేశారు. జేఈఈ మెయిన్ మూడో సెష‌న‌లో 17 మంది అభ్య‌ర్థులు 100 శాతం మార్కులు స్కోర్ చేశారు. జ‌న‌వ‌రిలో తొమ్మిది మంది, ఫిబ్ర‌వ‌రిలో 11 మంది వంద‌శాతం మార్కులు స్కోర్ చేశారు.
    Published by:Sharath Chandra
    First published: