ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి మొత్తం నాలుగు సెషన్లలో జేఈఈ మెయిన్ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (JEE) మెయిన్- 2021 నాలుగో సెషన్ ఫలితాలు త్వరలో విడుదల కానున్నాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) త్వరలో ఫలితాలతో పాటు మొత్తం పరీక్షల ర్యాంకులను సైతం ప్రకటించనుంది. JEE మెయిన్ పరీక్ష ఫలితాలు, ర్యాంకులను సెప్టెంబర్ 10 లోపు ప్రకటించే అవకాశం ఉంది. ఈ సంవత్సరం JEE అడ్వాన్స్డ్ అప్లికేషన్ ఫారంలను సెప్టెంబర్ 11న విడుదల చేయనున్నారు. అందువల్ల అంతకు ముందే మెయిన్స్ ర్యాంకులు ప్రకటించాల్సి ఉంటుంది.
ఈ ఫలితాలు ఎన్టీఏ అధికారిక వెబ్సైట్ అయిన nta.ac.in లేదా jeemain.nta.nic.in వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతారు. రిజల్ట్స్ పర్సంటైల్ స్కోర్ల రూపంలో ఉంటుంది. పర్సంటైల్ స్కోర్ అనేది రిలేటివ్ మార్కింగ్ సిస్టమ్. ఒక సెషన్లో విద్యార్థి సాధించిన అత్యధిక మార్కులను 100 పర్సంటైల్‌గా తీసుకొని.. దీని ఆధారంగా మిగతా విద్యార్థుల మార్కులను పర్సంటైల్ స్కోర్‌గా మారుస్తారు. ఈ స్కోర్ ఆధారంగా జేఈఈ మెయిన్ ర్యాంకు కేటాయిస్తారు.
* జేఈఈ మెయిన్ స్కోరింగ్, ర్యాంకింగ్ సిస్టమ్ ఎలా ఉంటుంది?
విద్యార్థులకు ర్యాంకులు కేటాయించడానికి ముందు మెరిట్ జాబితాను రూపొందిస్తారు. ప్రతి విద్యార్థికి ప్రత్యేకమైన ర్యాంక్ ఇవ్వడానికి పర్సంటైల్ స్కోర్లను( Percentile scores) ఏడు దశాంశ స్థానాల (డెసిమల్ పాయింట్స్) వరకు లెక్కిస్తారు. స్కోర్లు, ర్యాంకులు సమం కాకుండా ఉండేందుకు ఇలా చేస్తారు. టై-బ్రేకింగ్ సిస్టమ్‌ను ఈ సంవత్సరం మార్చారు.
ఒకవేళ మార్కులు సమంగా వస్తే.. మ్యాథ్స్ సబ్జెక్ట్‌లో ఎక్కువ పర్సంటైల్స్ స్కోర్ పొందిన అభ్యర్థులకు ర్యాంకుల్లో ప్రాధాన్యత ఇస్తారు. ఆ తరువాత ప్రాధాన్యత ఫిజిక్స్‌లో ఎక్కువ పర్సంటైల్ స్కోర్ పొందిన అభ్యర్థులకు ఇస్తారు. ఒకవేళ ఈ సందర్భంలో కూడా టై ఏర్పడితే.. కెమిస్ట్రీలో అధిక పర్సంటైల్ స్కోర్స్ పొందిన అభ్యర్థులకు ప్రాధాన్యం ఇస్తారు.
Old Rs 500 Note: మీ దగ్గర పాత రూ. 500 రూపాయల నోటు ఉందా.. అయితే రూ. 10వేలు పొందే చాన్స్..! ఎలాగంటే..?
ఆ తరువాత వయసుకు ప్రాధాన్యం ఇచ్చేవారు. గతంలో నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం.. విద్యార్థుల మార్కులకు మార్కులు సమానంగా వస్తే.. ఎక్కువ వయసు ఉన్నవారికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. కానీ ఈ ఏడాది ఈ పద్ధతిని మినహాయించారు. ఇప్పటి నుంచి టై- బ్రేకింగ్ సిస్టమ్‌లో వయసు అంశాన్ని పరిగణనలోకి తీసుకోరు. దీనికి బదులుగా నెగిటివ్ మార్కులు తక్కువగా వచ్చిన వారికి ముందు ర్యాంకు కేటాయించనున్నారు. నెగిటివ్ మార్కులు కూడా సమానంగా వస్తే, ఒకే ర్యాంకును ఇద్దరికీ కేటాయిస్తారు.
ఇప్పటి వరకు మూడు JEE మెయిన్ సెషన్ల ఫలితాలు వెలువడ్డాయి. ఫిబ్రవరి సెషన్లో మొత్తం ఆరుగురు విద్యార్థులు 100 పర్సంటైల్ స్కోర్ సాధించగా, మార్చి సెషన్లో ఈ సంఖ్య 13కు పెరిగింది. జులైలో సెషన్ జేఈఈ మెయిన్ పరీక్ష ఫలితాల్లో దాదాపు 17 మంది విద్యార్థులు 100 శాతం పర్సంటైల్ స్కోర్ సాధించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: JEE Main 2021, Results