Home /News /jobs /

JEE MAIN RESULT 2022 UPDATE KNOW HOW TO CALCULATE PERCENTILE AND TOP COLLEGES HERE BA GH

JEE Main Result 2022: జేఈఈ మెయిన్స్ పర్సంటైల్ ఎలా చెక్ చేయాలి? టాప్ కాలేజీలు ఏవి?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

జేఈఈ మెయిన్-2022 సెషన్ 1 ఫలితాలు ఈ వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఐఐటీ ప్రవేశ పరీక్ష జేఈఈ అడ్వాన్స్‌డ్ -2022 కోసం రిజిస్ట్రేషన్స్ ఆగస్టు 7 నుంచి ప్రారంభం కానున్నాయి. దీంతో జేఈఈ మెయిన్ ఫలితాలు ఆగస్టు 6లోపు వెలువడే అవకాశం ఉంది.

జేఈఈ మెయిన్-2022 సెషన్ 1 ఫలితాలు ఈ వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఐఐటీ ప్రవేశ పరీక్ష జేఈఈ అడ్వాన్స్‌డ్ -2022 కోసం రిజిస్ట్రేషన్స్ ఆగస్టు 7 నుంచి ప్రారంభం కానున్నాయి. దీంతో జేఈఈ మెయిన్ ఫలితాలు ఆగస్టు 6లోపు వెలువడే అవకాశం ఉంది. అయితే ఎన్‌టీఏ ఇప్పటివరకు కచ్చితమైన తేదీని ప్రకటించలేదు. జేఈఈ మెయిన్‌లో టాప్ 2.5 లక్షల ర్యాంకు సాధించిన అభ్యర్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు హాజరు కావడానికి అర్హులు. జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదలయ్యాక ఎన్‌టీఏ అధికారిక పోర్టల్ jeemain.nta.nic.in ద్వారా ర్యాంకులు, స్కోర్‌లను చెక్ చేసుకోవచ్చు. కాగా, ఈ సంవత్సరం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) రెండు దశల్లో పరీక్షను నిర్వహించింది. దీంతో రెండు దశల పరీక్షలను పరిగణనలోకి తీసుకుని ఫైనల్‌గా ర్యాంకు‌ను లెక్కించనున్నారు.

జేఈఈ మెయిన్-2022లో ఉత్తీర్ణత సాధించడానికి అవసరమయ్యే కనీస స్కోర్‌ ఈసారి పెరిగే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే కటాఫ్ కూడా 90 పర్సంటైల్‌కు చేరుకోవచ్చు. ఇక, జేఈఈ మెయిన్ మొదటి సెషన్‌లో 14 మంది విద్యార్థులు 100 పర్సంటైల్ స్కోర్ సాధించి టాప్ ర్యాంక్ కోసం ఎదురుచూస్తున్నారు.

IIT Madras:విద్యార్థులకు ఐఐటీ మద్రాస్ బంపర్ ఆఫర్.. డేటా సైన్స్ లో కొత్త కోర్సులు.. ఇది చదివితే జాబ్ గ్యారెంటీ!



పర్సంటైల్ స్కోర్ లెక్కించే విధానం
జేఈఈ మెయిన్ ఫలితాలతో విద్యార్థులు పర్సంటైల్ స్కోర్ పొందుతారు. కంపారిటివ్ మార్కింగ్ విధానంలో ప్రతి సెషన్‌లో వచ్చిన మార్కులను 100- 0 స్కేల్‌గా ట్రాన్స్‌ఫార్మ్ చేస్తారు. దీంతో పర్సంటైల్ స్కోర్ సాధారణ స్కోర్‌గా మారుతుంది. ఇది మెరిట్ లిస్ట్‌ తయారీ చేయడానికి దోహదపడుతుంది. బంచింగ్ ప్రభావాన్ని నివారించడానికి, టై‌ ల‌ను తగ్గించడానికి పర్సంటైల్ స్కోర్స్ 7 దశాంశ స్థానాల వరకు లెక్కించనున్నారు. 

జేఈఈ మెయిన్-2022: టాప్ కాలేజీలు
నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (NIRF) ఆధారంగా.. కొన్ని టాప్ ఇంజనీరింగ్ కాలేజీలు జేఈఈ మెయిన్ స్కోర్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తున్నాయి. అవేంటంటే..

  • నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, తిరుచిరాపల్లి

  • నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కర్ణాటక

  • అన్నా యూనివర్సిటీ, తమిళనాడు

  • వెల్లూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ

  • నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కెలా

  • జాదవ్‌పూర్ యూనివర్సిటీ

  • ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ

  • నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వరంగల్

  • అమృత స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్

  • ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ


జేఈఈ అడ్వాన్స్‌డ్-2022 కోసం ఆగస్టు 11 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఫీజు చెల్లించడానికి చివరి తేదీ ఆగస్టు 12గా నిర్ణయించారు. పరీక్ష ఆగస్టు 28 ఆదివారం రెండు షిఫ్టులలో జరుగుతుంది. మొదటి స్లాట్ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం వరకు కాగా, రెండో స్లాట్ మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు జరుగుతుంది.
Published by:Ashok Kumar Bonepalli
First published:

Tags: EDUCATION, Jee main 2022, JOBS

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు