జేఈఈ మెయిన్ మొదటి సెషన్ కు సంబంధించిన ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) తాజాగా విడుదల చేసింది. విద్యార్థులు తమ ఫలితాలను https://jeemain.nta.nic.in/ వెబ్ సైట్లో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. జేఈఈ మెయిన్ పరీక్షలను జూన్ 23వ తేదీ నుంచి 29వ తేదీ వరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించింది. ఇందుకు సంబంధించిన ఫైనల్ కీని ఈ నెల 6వ తేదీన విడుదల చేశారు అధికారులు. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించిన ఫలితాలను అధికారిక వెబ్‌సైట్లు jeemain.nta.nic.in, nta.ac.in, ntaresults.nic.in లలో అందుబాటులో ఉంచినట్లు అధికారులు తాజాగా విడుదల చేశారు. ప్రస్తుతానికి జేఈఈ మెయిన్ పేపర్-1 (బీఈ, బీటెక్) సంబంధించిన ఫలితాలను మాత్రమే విడుదల చేసింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. పేపర్-2 (బీఆర్క్, బీ ప్లానింగ్) ఫలితాలను ఇంకా విడుదల చేయాల్సి ఉంది. ఈఏడాది రాష్ట్రం నుంచి 50 వేలకుపైగా విద్యార్థులు మొదటి విడుత జేఈఈ మెయిన్ పరీక్షలకు హాజరయ్యారు.
అభ్యర్థులు ఈ స్టెప్స్ తో తమ ఫలితాలను చెక్ చేసుకోవాల్సి ఉంటుంది..
Step 1: అభ్యర్థులు మొదటగా jeemain.nta.nic.in వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి.
Step 2: హో పేజీలో Download Score Card of JEE(Main) Session 1_Paper 1 అనే లింక్ కనిపిస్తుంది. ఆ లింక్ పై క్లిక్ చేయాలి.
Step 3: కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఆ పేజీలో అప్లికేషన్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ నమోదు చేసి సబ్మిట్ పై క్లిక్ చేయాలి.
Step 4: అనంతరం మీ రిజల్ట్ స్క్రీన్ పై కనిపిస్తుంది. డౌన్ లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Exams, Jee main 2022, JOBS, Results