హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

JEE Main Result 2021: నేడు జేఈఈ మెయిన్స్ ఫ‌లితాలు.. ర్యాంక్ లెక్కించే విధానం ఇదే

JEE Main Result 2021: నేడు జేఈఈ మెయిన్స్ ఫ‌లితాలు.. ర్యాంక్ లెక్కించే విధానం ఇదే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

జాయింట్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ (Joint Engineering Entrance) మెయిన్ 2021 ఫోర్త్ సెష‌న్ ఫ‌ల‌తాలు నేడు విడుద‌ల కానున్నాయి. ఈ నేప‌థ్యంలో ఫ‌లితాలు ఎలా చూసుకోవాలి. ర్యాంక్ ఎలా లెక్కిస్తారు అనే అంశాల గురించి తెలుసుకోండి.

జాయింట్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ (Joint Engineering Entrance) మెయిన్ 2021 ఫోర్త్ సెష‌న్ ఫ‌ల‌తాలు నేడు విడుద‌ల కానున్నాయి. ఈ నేప‌థ్యంలో ఫ‌లితాలు ఎలా చూసుకోవాలి. ర్యాంక్ ఎలా లెక్కిస్తారు అనే అంశాల గురించి తెలుసుకోండి. ఫ‌లితాల‌ను నేడు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ద్వారా jeemain.nta.nic.in వెబ్‌సైట్ ద్వారా విడుదల చేయబడతాయి. nta.ac.in వెబ్‌సైట్‌లో కూడా ఫ‌లితాలు చూసుకోవ‌చ్చు.

ఫ‌లితాలు ఎలా చూసుకోవాలి..

Step 1 : ముందుగా NTA JEE Main అధికారిక వెబ్‌సైట్(Website) లోకి వెళ్లాలి. (వెబ్‌సైట్ కోసం క్లిక్ చేయండి)

Step 2 : హోం పేజీలో జేఈఈ ఫ‌లితాలు 2021 లింక్‌పై క్లిక్ చేయండి.

Step 3 : అనంత‌ర ఓపెన్ అయిన విండోలో మీ అప్లికేష‌న్(Applications Number) నంబ‌ర్‌, పాస్‌వ‌ర్డ్ కొట్టి స‌బ్‌మిట్ చేయాలి.

Step 4 : మీఫ‌లితం వివ‌రాలు క‌న‌ప‌డ‌తాయి ఆ కాపీని ప్రింట్ తీసుకొని పెట్టుకొంటే మంచింది.

ఏం చెక్ చేసుకోవాలి..

ఫ‌లితాల్లో ముందుగా విద్యార్థులు త‌మ పేరు స‌రిగా ఉందో లేదో చూసుకోవాలి. త‌మ వ్య‌క్తి గ‌త వివరాల్లో పొర‌పాట్లు లేకుండా ఉన్నాయో లేదో స‌రిచూసుకోవాలి. అనంత‌రం NTA JEE మార్కులు చూసుకోవాలి.

ర్యాంక్ లెక్కించే విధానం..

ఫ‌లితం ప‌ర్సంటైల్ రూపంలో ఉంటుంది. మీకు వ‌చ్చిన మార్కుల‌ను ప‌ర్సంటైల్ (Percentile) రూపంలోకి మార్చి ఇస్తార‌ని అర్థం. ప‌రీక్ష‌లో టాప్ వ‌చ్చ‌ని మార్కును 100 ప‌ర్సంటైల్‌గా ఇస్తారు. మిగ‌తా మార్కుల‌ను దానితో పోల్చుతూ ప‌ర్సంటైల్‌ను ప్ర‌క‌టిస్తారు. ప‌ర్సంటైల్ స్కోర్ ఏడు డెసిమ‌ల్ పాయింట్ల వ‌ర‌కు లెక్కిస్తారు. విద్యార్థుల మధ్య టై కాకుండా ఉండేదుకు ఈ విధానాన్ని పాటిస్తారు.

కొత్త టై-బ్రేక్ విధానం..

ఈ ఏడాది టై-బ్రేక్ విధానం మార్చ‌బ‌డింది. ప‌రీక్ష‌లో గ‌ణితం మార్కుల‌కు అధికా ప్రాధాన్య‌త ఇస్తారు. త‌రువాత ఫిజిక్స్ త‌రువాత కెమిస్ట్రీకి ఇస్తారు. ప‌ర్సంటైల్ లెక్కించిన త‌ర్వాత ర్యాంకులు(Ranks) కేటాయించ‌డానికి మెరిట్ జాబితా రూపొందించ‌డాన‌కి ఈ విధానం వాడ‌తారు. గ‌తంలో విద్యార్థుల వ‌య‌సు ప్రాధాన్యం ఇచ్చే వారు. ఈ ఏడాది ఆ విధానం తీసి వేశారు. జేఈఈ మెయిన్ మూడో సెష‌న‌లో 17 మంది అభ్య‌ర్థులు 100 శాతం మార్కులు స్కోర్ చేశారు. జ‌న‌వ‌రిలో తొమ్మిది మంది, ఫిబ్ర‌వ‌రిలో 11 మంది వంద‌శాతం మార్కులు స్కోర్ చేశారు.

గ‌త సంవ‌త్స‌రం క‌ట్ ఆఫ్‌..

ఈ సంవ‌త్స‌రం నిపుల‌ణుల అంచానా ప్ర‌కారం 2019 క‌న్న ఈ సారి జేఈఈ మెయిన్‌ ప‌రీక్ష క‌ట్ఆఫ్ ఎక్కుగా ఉంటుంద‌ని చెబుతున్నారు. 2019లో జేఈఈ మెయిన్ జ‌న‌ర‌ల్ కేట‌గిరి కట్ ఆఫ్ 89.5శాతంగా ఉంది. ఈ ఏడాది విద్యా నిపుణుల అంచ‌నా ప్ర‌కారం 90లేదా అంత‌కంటే ఎక్కువ ఉండొచ్చ‌ని భావిస్తున్నారు. FIIT JEE లో నిపుణుడైన రమేష్ బట్లిష్ మాట్లాడుతూ.. “JEE మెయిన్ 2021 లో JEE అడ్వాన్స్‌డ్ 2021 కి అర్హత సాధించడానికి జనరల్ కేటగిరీకి దాదాపు 90 శాతం వరకు కట్ ఆఫ్(Cutoff) ఉంటుంద‌ని భావిస్తున్న‌మ‌ని తెలిపారు. ఈ క‌ట్ ఆఫ్ ఇంకా స్వ‌ల్పంగా పెర‌గ‌వ‌చ్చ‌నిపేర్కొన్నారు. JEE మెయిన్స్‌లో టాప్ 2.5 లక్షల ర్యాంక్ పొందిన వారు ప్రతి సంవత్సరం JEE అడ్వాన్స్‌డ్‌కు హాజరు కావడానికి అర్హులు. గత సంవత్సరం, అడ్వాన్స్‌డ్ పరీక్ష కోసం కట్ ఆఫ్ 89.5 శాతం.

First published:

Tags: EDUCATION, IIT, JEE Main 2021, Students

ఉత్తమ కథలు