• Home
  • »
  • News
  • »
  • jobs
  • »
  • JEE MAIN RESULT 2021 PAPER 1 RESULTS ANNOUNCED LINK TO NTA SCORECARD BA

JEE Mains 2021 Results: జేఈఈ మెయిన్స్ ఫలితాలు విడుదల.. ఇక్కడ డౌన్ లోడ్ చేసుకోండి

నేడు జేఈఈ మెయిన్ ఫలితాలు రిలీజ్ (ప్రతీకాత్మక చిత్రం)

జేఈఈ మెయిన్స్ 2021 ఇంజినీరింగ్ ఫలితాలు విడుదల అయ్యాయి. జేఈఈ మెయిన్స్ 2021 పేపర్ 1 ఫలితాలు ప్రస్తుతం క్యాండిడేట్స్‌కు అందుబాటులో ఉన్నాయి. అభ్యర్థులు తమ అప్లికేషన్ నెంబర్, పాస్ వర్డ్‌తో చెక్ చేసుకోవచ్చు.

  • Share this:
    జేఈఈ మెయిన్స్ 2021 ఇంజినీరింగ్ ఫలితాలు విడుదల అయ్యాయి. జేఈఈ మెయిన్స్ 2021 పేపర్ 1 ఫలితాలు ప్రస్తుతం క్యాండిడేట్స్‌కు అందుబాటులో ఉన్నాయి. అభ్యర్థులు తమ అప్లికేషన్ నెంబర్, పాస్ వర్డ్‌తో చెక్ చేసుకోవచ్చు. ఫిబ్రవరిలో జేఈఈ మెయిన్స్ రాసిన వారి ఫలితాలు ప్రస్తుతం విడుదల అయ్యాయి. ఫిబ్రవరిలో మొత్తం 6,61,776 మంది అభ్యర్థులు పరీక్షల కోసం రిజిస్టర్ చేసుకున్నారు. వారిలో 95 శాతం మంది పేపర్ 1 పరీక్షకు హాజరయ్యారు. NTA Scorecard డౌన్ లోడ్ చేసుకోవాలంటే అభ్యర్థి nta.ac.in మరియు jeemain.nta.nic.in వెబ్ సైట్‌ల నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. మీ హాల్ టికెట్ నెంబర్, పాస్ వర్డ్ , పుట్టిన తేదీ ఇచ్చి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఫిబ్రవరిలో పరీక్షలకు ఆల్ ఇండియా ర్యాంక్స్ ఉండబోవని గతంలోనే ఎన్టీఏ ప్రకటించింది. మే సెషన్ తర్వాత పూర్తి చేస్తామని చెప్పింది.

    జేఈఈ రిజల్ట్స్‌ను బట్టి ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IIITs), నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NITs), గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్ స్టిట్యూషన్స్ (GFTIs)లో అడ్మిషన్ లభిస్తుంది. ఐఐటీలో అడ్మిషన్ కోసం క్వాలిఫయింగ్‌గా కూడా జేఈఈ మెయిన్స్ ఫలితాలను పరిగణిస్తారు. అలాగే జేఈఈ అడ్వాన్స్‌డ్ కూడా రాసుకోవచ్చు. ఈ ఏడాది ఐఐటీ ఖరగ్ పూర్ జేఈఈ మెయిన్స్ నిర్వహిస్తోంది.

    జేఈఈ మెయిన్స్‌లో మొత్తం ఆరుగురు అభ్యర్థులు 100 శాతం ఎన్టీఏ స్కోర్ సాధించారు.

    సాకేత్ ఝా (రాజస్థాన్)
    ప్రవర్ కటారియా (ఢిల్లీ)
    రంజిమ్ ప్రబల్ దాస్ (ఢిల్లీ)
    గురమ్రిత్ సింగ్ (చండీగఢ్)
    సిద్ధాంత్ ముఖర్జీ (మహారాష్ట్ర)
    అనంత కృష్ణ కిడాంబి (గుజరాత్)
    Published by:Ashok Kumar Bonepalli
    First published: