JEE MAIN PAPER 2 RESULT 2021 LIKELY TO RELEASE ON SEPTEMBER 22 HERE IS THE STEPS TO CHECK YOUR RESULT GH SK
JEE Main paper 2 result: జేఈఈ మెయిన్ పేపర్ 2 రిజల్ట్స్ ఎప్పుడు? ఎలా చెక్ చేసుకోవాలి?
ప్రతీకాత్మక చిత్రం
JEE Mains paper 2 results: ఎగ్జామ్ క్లియర్ చేసిన వారు బ్యాచ్‌లర్ ఇన్ అర్కిటెక్చర్, ఇతర కోర్సుల్లో అడ్మిషన్ పొందుతారు. జేఈఈ మెయిన్స్ పేపర్ 2 రిజల్ట్, ర్యాంకు ఆధారంగా వారికి సీటు కేటాయింపు ఉంటుంది.
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్వహించిన జేఈఈ మెయిన్స్ (JEE Mains) పేపర్-2 ఫలితాలుఈ నెల 22న విడుదల కానున్నాయి. బ్యాచ్‌లర్ ఇన్ అర్కిటెక్చర్, ఇతర కోర్సుల్లో అడ్మిషన్‌కోసం ఇటీవలేఈ పరీక్షను నిర్వహించారు. పేపర్-1 ఫలితాలు ఇప్పటికే విడుదలకాగా పేపర్-2 ఫలితాల కోసం అభ్యర్థులు వేచి చూస్తున్నారు. ఈ నెలా 22న జేఈఈ మెయిన్ పేపర్ 2 ఫలితాలతో పాటు స్కోర్ కార్డు (JEE Mains score card), ర్యాంక్ లిస్ట్ విడుదల చేయనున్నారు. కాగా, ఇంజినీరింగ్ (Engineering) అభ్యర్థులకు నాలుగు సెషన్స్‌లో ఎగ్జామ్ కండక్ట్ చేయగా, అర్కిటెక్చర్ (Architecture) అభ్యర్థులకురెండు పేపర్లలో ఎగ్జామ్ నిర్వహించారు.
ఈ ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు ఫలితాలు విడుదలైన వెంటనే www.jeemain.nta.nic.in వెబ్ సైట్లో వారి రిజల్ట్ చేసుకోవచ్చు.లాగిన్ క్రెడెన్షియల్స్ ఎంటర్ చేసి రిజల్ట్ చెక్ చేసుకోవచ్చు. ఫైనల్ ఆన్సర్ కీలో అభ్యంతరాలను పరిశీలించిన తర్వాతే ఫైనల్ ప్రొవిజినల్ ఆన్సర్ కీ ఇచ్చి ఫైనల్ రిజల్ట్ డిక్లేర్ చేయనున్నారు. ఎవరైతే ఎగ్జామ్ క్లియర్ చేసి ఎలిజిబులిటీ సాధిస్తారో వారికి కౌన్సెలింగ్ ఉంటుంది. ఆ తర్వాత విద్యార్థులు కాలేజీలకు ఆప్షన్లుఇవ్వాల్సి ఉంటుంది. ర్యాంకు, కేటగిరీని బట్టి సీట్లు కేటాయిస్తారు.
మీ రిజల్ట్ డాక్యుమెంట్లో మీ డీటెయిల్స్ అన్ని కూడా సరిగా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ ఏవైనా తప్పులుంటే వెంటనే అధికారుల నోటీసులోకి తీసుకెళ్లి సరి చేసుకోవాల్సి ఉంటుంది. ఎగ్జామ్ క్లియర్ చేసిన వారు బ్యాచ్‌లర్ ఇన్ అర్కిటెక్చర్, ఇతర కోర్సుల్లో అడ్మిషన్ పొందుతారు. జేఈఈ మెయిన్స్ పేపర్ 2 రిజల్ట్, ర్యాంకు ఆధారంగా వారికి సీటు కేటాయింపు ఉంటుంది. ఆర్కిటెక్చర్ కోర్సు ఐఐటీ ఖరగ్‌పూర్, ఐఐటీ రూర్కీలో మాత్రమే అందుబాటులో ఉంది.ఈ అర్కిటెక్చర్ కోర్సులో అడ్మిషన్ కోసం క్యాండిడెట్స్ అడ్వాన్స్డ్ అర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ క్లియర్ చేయాల్సి ఉంటుంది.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.