ఇంజనీరింగ్(Engineering), మెడికల్(Medical) కాలేజీల్లో అండర్ గ్రాడ్యుయేట్(Graduate) కోర్సుల్లో ప్రవేశాల కోసం జేఈఈ(JEE), నీట్(NEET) నిర్వహిస్తారు. ఈ రెండు పరీక్షల్లో ర్యాంకును నిర్ణయించే కీలకమైన సబెక్టుల్లో కెమిస్ట్రీ ఒకటి. ఇతర సబెక్టులతో పోల్చితే కెమిస్ట్రీలో(Chemistry) మంచి స్కోర్ చేయడం చాలా సులభం. ఇందులో ఎక్కువగా మెమరీ ఆధారిత ప్రశ్నలే ఉంటాయి. NCERT సిలబస్ నుంచి ఈ రకం ప్రశ్నలు అడుగుతుంటారు. నీట్, జేఈఈ పరీక్షల కోసం ఎన్‌సీఈఆర్‌టీలోని అన్ని చాప్టర్లు ప్రిపేర్ కావాల్సిందే. అయితే కొన్ని అతి ముఖ్యమైన చాప్టర్లు ఉన్నాయి. ఇతరుల కంటే మంచి ర్యాంకు రావాలంటే ఈ చాప్టర్లను బాగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.
* ఫిజికల్ కెమిస్ట్రీ
ఈక్విలిబ్రియం, థర్మోడైనమిక్స్, కెమికల్ కైనటిక్స్, ఎలెక్ట్రోకెమిస్ట్రీ ఫిజికల్ కెమిస్ట్రీలో అతి ముఖ్యమైన చాప్టర్లు. దీంతో వీటిని తరవుగా ప్రిపేర్ అవ్వాలి. వీటి నుంచి న్యూమరికల్ వ్యాల్యూ సంబంధిత ప్రశ్నలతో పాటు సింగిల్ చాయిస్ కరెంట్ MCQ ప్రశ్నలు ఎక్కువగా అడిగే అవకాశం ఉంది. దీంతో అభ్యర్థులు ఈ చాప్టర్లపై ఎక్కువ దృష్టి పెడితే మంచిది.
* ఆర్గానిక్ కెమిస్ట్రీ
జేఈఈ, నీట్‌ప్రధాన సిలబస్‌లో ఈ విభాగం కూడా కీలకమే. అన్ని అంశాలకు సమానంగా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. వీటిపై పట్టు సాధించడానికి అనేక సార్లు ప్రాక్టీస్ చేయాలి. రియాక్షన్ అండ్ మెకానిజం ఆఫ్ ఆర్గానిక్ రియాక్షన్, క్వశన్స్ ఆన్ నోమన్‌క్లేచర్, ఎలక్ట్రానిక్ డిస్‌ప్లేస్‌మెంట్ ఎఫెక్ట్స్, కన్వర్షన్స్, నేమ్ రియాక్షన్ నుంచి ఎక్కువగా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. అలాగే GOC అండ్ కెమికల్ రియాక్షన్స్ ఆఫ్ కార్బోనల్ కాంపౌండ్స్, అమినస్, ఆల్కహాల్ కూడా కొన్ని ముఖ్యమైన టాఫిక్స్. వీటి నుంచి కూడా తరచుగా ప్రశ్నలు వస్తుంటాయి. బయోమాలిక్యూల్స్, కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీ డే లైఫ్, పాలిమర్‌ల వంటి చాప్టర్లను కూడా విస్మరించకూడదు. ఎందుకంటే ఈ అంశాల నుండి కూడా కొన్ని ప్రశ్నలు వస్తాయి.
* ఇన్‌ఆర్గానిక్ కెమిస్ట్రీ
ఈ విభాగంలో రసాయన శాస్త్రంలో వివిధ మూలకాలు, వాటి సమ్మేళనాలు, లక్షణాలు, పోకడలు ఉంటాయి. విద్యార్థులు సరైన కారణాలతో వీటిని అర్థం చేసుకోవాలి. కెమిస్ట్రీకి చెందిన ఎస్‌సీఈర్‌టీ సిలబస్‌పై ఇంటెన్సివ్, ప్లాన్డ్ రీడింగ్‌తో ఉండాలి. అలాగే NCERT ఉదాహరణ నుండి ప్రశ్నలను సాల్వ్ చేయడాన్ని ప్రాక్టీస్ చేస్తుండాలి. పి-బ్లాక్, డి-బ్లాక్ వంటి చాప్టర్లకు ట్రెండ్‌లను నేర్చుకోవడం కూడా ముఖ్యమే. అలాగే మంచి స్కోర్ చేయడానికి కోఆర్డినేషన్ కాంపౌండ్‌లోని కాన్సెప్ట్‌లను పూర్తిగా అవగాహన పెంచుకోవాలి. చివరగా NCERT గ్రాఫ్‌లు, పట్టికలు మినహాయింపులను అసలు విస్మరించకూడదు. వీటిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.
* JEE మెయిన్ -2022 టై బ్రేకర్ పాలసీ
JEE మెయిన్లో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది అభ్యర్థులు ఒకే మార్కులు వచ్చినట్లయితే... గణితంలో ఎక్కువ స్కోర్ సాధించిన అభ్యర్థులకు సమాన మొత్తం మార్కులతో ఇతరులపై ప్రాధాన్యత ఇవ్వనున్నారు. JEE మెయిన్ టై బ్రేకింగ్ విధానం ప్రకారం.. మొదటి దశ తర్వాత కూడా టై కొనసాగితే అభ్యర్థుల కెమిస్ట్రీ, ఫిజిక్స్ స్కోర్ల ఆధారంగా ర్యాంకులు కేటాయించనున్నారు.
* NEET-2022 టై బ్రేకర్ పాలసీ
నీట్‌లో టైబ్రేకర్ ప్రక్రియ కోసం జీవశాస్త్రంలో ఎక్కువ పర్సంటైల్ స్కోర్ పొందిన అభ్యర్థులకు అదే మొత్తం మార్కులు వచ్చిన ఇతర అభ్యర్థుల కంటే ప్రాధాన్యత ఇవ్వనున్నారు. అప్పటికీ టై కొనసాగితే, కెమిస్ట్రీలో ఎక్కువ మార్కులు సాధించిన అభ్యర్థులు ఉన్నత ర్యాంక్ పొందుతారు. ఒకవేళ టై అప్పటికీ విచ్ఛిన్నం కానట్లయితే, మూడు విభాగాలలో కలిపి తక్కువ సంఖ్యలో ప్రశ్నలను ప్రయత్నించిన అభ్యర్థులకు ఇతరుల కంటే ప్రాధాన్యత ఇస్తారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, Jee, NEET 2022