JEE, NEET, CUET: ఇటీవల నిర్వహించిన నీట్ (NEET), జేఈఈ (JEE Main), సీయూఈటీ (CUET) పరీక్షల్లో... సాంకేతిక లోపాలు, రిగ్గింగ్, చివరి నిమిషంలో సెంటర్ మార్పులు, ఇతర అవకతవకలు వెలుగుచూశాయి. కేరళలోని NEET పరీక్షా కేంద్రాలలో విద్యార్థినుల లోదుస్తులు విప్పించిన దారుణ సంఘటన కూడా చోటుచేసుకున్నాయి. అలానే రాజస్థాన్‌లోని అనేక కేంద్రాలలో నీట్ ఇంగ్లీష్, హిందీ పేపర్లు కలిసిపోయి పెద్ద గందరగోళానికి దారితీశాయి. సాంకేతిక లోపాలతో JEE పరీక్షలకు సరిగా రాయలేకపోయారు అభ్యర్థులు. చాలా మంది విద్యార్థులు ప్రశ్నలను సరిగ్గా చూడలేకపోయారు. కొన్ని కేంద్రాలు రెండవ షిప్టులో పరీక్షలను కూడా నిర్వహించలేదు. అందుకే, థర్డ్ అట్టెంప్ట్ కోసం పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. సీయూఈటీ విద్యార్థులు కూడా ఇదే డిమాండ్ వినిపిస్తున్నారు.
పరీక్ష మళ్లీ నిర్వహించాలని డిమాండ్
వివిధ పరీక్షల అభ్యర్థులు, రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఇప్పుడు పరీక్ష నిర్వహణ సంస్థ — నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)కి వ్యతిరేకంగా ఉమ్మడి నిరసనను చేపట్టారు. ఎలాంటి లోపాలు లేకుండా పరీక్షలను సరిగ్గా నిర్వహించాలని నిరసనలు చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వైపు కవాతు కూడా చేశారు. వారు #ChaloJantarMantar అనే హ్యాష్‌ట్యాగ్‌తో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో కూడా ప్రచారం చేశారు. CUET 2022 అభ్యర్థులు చివరి నిమిషంలో సెంటర్ మార్చడం.. పరీక్షల సమయంలో సాంకేతిక లోపాల కారణంగా వాయిదా వేయబడినందున మళ్లీ పరీక్ష నిర్వహించాలని కోరారు.
బయటపడిన అవకతవకలు
వైద్య విద్యార్థులు మెడికల్ ప్రవేశ పరీక్ష కోసం NEET 2022 రీ-ఎగ్జామ్‌ను నిర్వహించాలని NTA ని కోరుతున్నారు. తద్వారా తమ స్కోర్‌లను మెరుగుపరచుకోవచ్చని భావిస్తున్నారు. కేరళలోని కొల్లంలోని ఒక పరీక్షా కేంద్రంలో సుమారు 100 మంది విద్యార్థినులు అవమానానికి గురయ్యారు. డ్రెస్ కోడ్ పేరిట వారిలో దుస్తులను ఎగ్జామ్ సెంటర్ నిర్వాహకులు విప్పించారు. అదే సమయంలో, కొన్ని పరీక్షా కేంద్రాల్లో సాంకేతిక లోపాలు తలెత్తాయి. స్క్రీన్‌లపై ప్రశ్నలు సరిగ్గా కనిపించలేదని పలువురు JEE మెయిన్ అభ్యర్థులు పేర్కొన్నారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) విద్యార్థుల తరపున మెడికల్ ఎగ్జామ్ రాయడానికి ప్రయత్నించిన పరీక్ష సాల్వర్ల ముఠాను కూడా ఛేదించింది. కొన్ని కేంద్రాల్లో రెండో షిప్టులో కూడా పరీక్షలు నిర్వహించడం లేదని విద్యార్థులు ఆరోపించారు.
విద్యార్థుల పక్షాన పలువురు విద్యాశాఖ కార్యకర్తలు కూడా నిరసనలో పాల్గొన్నారు.
"మేం విద్యార్థులు సరైన ఆన్సర్ కీలు, సాంకేతిక సమస్యలు లేకుండా సరైన ఫలితాలు, పర్సంటైల్‌తో సహా పరీక్షలను పొందడానికి చాలా కష్టపడుతున్నాం. అలాగే వేలకొద్దీ మెయిల్‌లు, ట్వీట్‌లకు NTA నుంచి ఒక రిప్లై కోరుతున్నాం" అని ఒక విద్యార్థి ట్వీట్ చేసారు. ఆల్ ఇండియా స్టూడెంట్స్ యూనియన్ (AISU) ఈ నిరసనకు నాయకత్వం వహిస్తోంది. విద్యార్థి ఉద్యమకారుడు పవన్ భదానాతో కలిసి విద్యార్థుల నిరసనను చేపట్టింది. అన్ని సమస్యలు, లోపాల మధ్య, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) JEE, NEETలను CUETతో వచ్చే ఏడాది నుంచి విలీనం చేసే ప్రతిపాదనను ప్రకటించింది. దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.