హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Entrance Exams: జేఈఈ మెయిన్ నుంచి నీట్ వరకు.. 2021లో ప్రవేశ పరీక్షల్లో ఎలాంటి మార్పులు వచ్చాయంటే..

Entrance Exams: జేఈఈ మెయిన్ నుంచి నీట్ వరకు.. 2021లో ప్రవేశ పరీక్షల్లో ఎలాంటి మార్పులు వచ్చాయంటే..

Entrance Exams: జేఈఈ-మెయిన్, నీట్ పరీక్షలు మాత్రమే కాదు ఇతర ప్రవేశ పరీక్షల్లో కూడా ముఖ్యమైన మార్పులు వెలుగుచూశాయి. మరి ఈ ఏడాది ఏ పరీక్షల్లో ఏయే మార్పులు చోటుచేసుకున్నాయో తెలుసుకుందాం.

Entrance Exams: జేఈఈ-మెయిన్, నీట్ పరీక్షలు మాత్రమే కాదు ఇతర ప్రవేశ పరీక్షల్లో కూడా ముఖ్యమైన మార్పులు వెలుగుచూశాయి. మరి ఈ ఏడాది ఏ పరీక్షల్లో ఏయే మార్పులు చోటుచేసుకున్నాయో తెలుసుకుందాం.

Entrance Exams: జేఈఈ-మెయిన్, నీట్ పరీక్షలు మాత్రమే కాదు ఇతర ప్రవేశ పరీక్షల్లో కూడా ముఖ్యమైన మార్పులు వెలుగుచూశాయి. మరి ఈ ఏడాది ఏ పరీక్షల్లో ఏయే మార్పులు చోటుచేసుకున్నాయో తెలుసుకుందాం.

  జేఈఈ మెయిన్ పరీక్షలను ఎక్కువసార్లు నిర్వహించడం నుంచి నీట్ ఎగ్జామ్‌లో ప్రాంతీయ భాషల పేపర్లను చేర్చడం వరకు 2021లో పలు ప్రవేశ పరీక్షల్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఇక కరోనా మహమ్మారి వల్ల పరీక్షల నమూనాలు, సిలబస్ చాలావరకు మారిపోయాయి. కేవలం జేఈఈ-మెయిన్, నీట్ పరీక్షలు మాత్రమే కాదు ఇతర ప్రవేశ పరీక్షల్లో కూడా ముఖ్యమైన మార్పులు వెలుగుచూశాయి. మరి ఈ ఏడాది ఏ పరీక్షల్లో ఏయే మార్పులు చోటుచేసుకున్నాయో తెలుసుకుందాం.

  1. జేఈఈ మెయిన్

  ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష జేఈఈ మెయిన్‌లో గత కొన్నేళ్లుగా మార్పులు రావడం సర్వసాధారణంగా మారింది. 2020 వరకు జేఈఈ మెయిన్ ఎగ్జామ్‌ను కేవలం రెండు సార్లు మాత్రమే నిర్వహించేవారు. కానీ ఈ ఏడాదిలో జేఈఈ మెయిన్ 2021 పరీక్షను నాలుగు సెషన్లలో (ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే) నిర్వహించారు. 2022లోనూ జేఈఈ మెయిన్ పరీక్షను నాలుగు సెషన్‌లలో నిర్వహించే అవకాశం ఉంది. ఈ ఏడాదిలో ఎగ్జామ్ పేపర్ సరళిని కూడా మార్చేశారు.

  జేఈఈ మెయిన్ 2021 పరీక్షలో ప్రతి సబ్జెక్టులోని సెక్షన్ ఏ, బీ ప్రశ్నల సంఖ్యలు మారిపోయాయి. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) 2020 వరకు ఒక్కో టాపిక్‌కు 30 ప్రశ్నల చొప్పున ఇవ్వడం జరిగింది. కానీ కొత్త పేపర్ ప్యాటర్న్ ప్రకారం సెక్షన్ ఏలోని అన్ని ప్రశ్నలను విద్యార్థులు ఆన్సర్ చేయాల్సి వచ్చింది. సెక్షన్ బీలో 15 ప్రశ్నలలో తమకు నచ్చిన ఏవైనా 10 ప్రశ్నలను విద్యార్థులు ఆన్సర్ చేయాల్సి వచ్చింది.

  2. నీట్

  2021 ఏడాదిలో మెడికల్ ప్రవేశ పరీక్ష నీట్ లో కూడా మార్పులు జరిగాయి. కొత్తగా మరో రెండు ప్రాంతీయ భాషలైన పంజాబీ, మలయాళం పేపర్ సరళిలో చేర్చారు. ఆ ప్రకారం ఇప్పటినుంచి నీట్ పరీక్ష మలయాళం, పంజాబీ, హిందీ, అస్సామీ, బెంగాలీ, ఒడిశా, గుజరాతి, మరాఠీ, తెలుగు, కన్నడ, తమిళం, ఉర్దూ, ఆంగ్లం భాషల్లో ఉంటుంది. 2021 నీట్ ఎగ్జామ్ రాసిన వారు 200 మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్లను అటెంప్ట్ చేశారు. అయితే మునుపటి పేపర్ ప్యాట్రన్ ప్రకారం, నీట్ పరీక్ష పేపర్ లో 180 మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్లను మాత్రమే ఉండేవి.

  PPF Account: పోస్టాఫీసులో పీపీఎఫ్​ అకౌంట్ ఓపెన్​ చేయాలా.. అయితే ఆన్​లైన్​లో ఈ స్టెప్స్​ ఫాలో అవ్వండి..


  3. గేట్

  2021లో గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్) ప్రవేశ పరీక్షలో ఎలిజిబిలిటీ క్రైటీరియా నుంచి పేపర్ ప్యాట్రన్ వరకు చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ఈసారి ఇంజనీరింగ్, సైన్స్ అభ్యర్థులతో పాటు ఆర్ట్స్, కామర్స్, మెడికల్ విద్యార్థులను ఎగ్జామ్ రాయడానికి గేట్ ఆర్గనైజింగ్ అధికారులు అనుమతించారు.

  అలాగే మొదటిసారిగా గేట్ పరీక్షలో నాన్-ఇంజనీరింగ్, నాన్-సైన్స్ సబ్జెక్ట్‌లను ప్రవేశపెట్టారు. ఇందులో హ్యుమానిటీస్, సోషల్ సైన్సెస్ సబ్ సెక్షన్‌లతో (ఏ) ఎకనామిక్స్, (బీ) ఇంగ్లీష్, (సీ) లింగ్విస్టిక్స్, (డీ) ఫిలాసఫీ, (ఈ) సైకాలజీ, (ఎఫ్) సోషియాలజీ ఉన్నాయి. అంతేకాదు, అభ్యర్థులు ఒకసారి కంటే ఎక్కువ సార్లు గేట్ ఎగ్జామ్ రాసేందుకు అనుమతించారు.

  4. CLAT- కామన్ లా అడ్మిషన్ టెస్ట్

  కామన్ లా అడ్మిషన్ టెస్ట్ మాస్టర్ ఆఫ్ లాస్ (CLAT LLM) పరీక్ష విధానం ఈ సంవత్సరంలో చేంజ్ అయ్యింది. ఈ ఏడాది క్లాట్ (CLAT) పోస్ట్ గ్రాడ్యుయేట్ లా ప్రవేశ పరీక్షలో సబ్జెక్టివ్ విభాగం చేర్చడం జరిగింది. చాణక్య నేషనల్ లా యూనివర్సిటీ CLAT LLM 2021 ఆబ్జెక్టివ్ విభాగంలో కటాఫ్ మార్కులను కూడా ప్రవేశపెట్టింది. లా అభ్యర్థులు ఆబ్జెక్టివ్ విభాగంలో కటాఫ్ మార్కుల కంటే ఎక్కువ స్కోర్ చేస్తేనే కొత్త సబ్జెక్టివ్ విభాగం మూల్యాంకనం చేసేలా కొత్త మార్పులు తీసుకురావడం జరిగింది.

  Zodiac Signs: 2022లో ఈ రాశుల వారికి డబ్బులే డబ్బులు.. మిగిలిన రాశుల స్థితి ఏంటో తెలుసుకోండి..


  5. కామన్ అడ్మిషన్ టెస్ట్

  కామన్ అడ్మిషన్ టెస్ట్ (క్యాట్ 2021) పరీక్ష ఫార్మాట్ గత సంవత్సరం మాదిరిగానే ఉంది. కాకపోతే ఈ ప్రవేశ విధానంలో మార్పులు తీసుకొచ్చారు. క్యాట్ పరీక్ష వ్యవధిని 180 నిమిషాల నుంచి 120 నిమిషాలకు తగ్గించారు. అలాగే మూడు స్లాట్‌లను బదులుగా రెండు స్లాట్‌లకు కుదించారు.

  6. జేఈఈ అడ్వాన్స్‌డ్

  ఐఐటీ జేఈఈ (జేఈఈ అడ్వాన్స్‌డ్) సిలబస్ 2023 నుండి మారబోతోంది. జేఈఈ అడ్వాన్స్‌డ్ 2022 సిలబస్ మాత్రం మారడం లేదు. అందువల్ల 2022 అభ్యర్థులు ఆందోళన చెందాల్సిన పనిలేదు.

  First published:

  Tags: EDUCATION, JEE Main 2021

  ఉత్తమ కథలు