హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

JEE Main-NEET 2022: జేఈఈ మెయిన్, నీట్​ అభ్యర్థులకు అలర్ట్.. ఆ వివరాలను ఇలా చెక్ చేసుకోండి..

JEE Main-NEET 2022: జేఈఈ మెయిన్, నీట్​ అభ్యర్థులకు అలర్ట్.. ఆ వివరాలను ఇలా చెక్ చేసుకోండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో 2022 ఏడాదిలో ప్రవేశాలకు గాను నిర్వహించనున్న జేఈఈ, నీట్​ పరీక్షల షెడ్యూల్​ త్వరలోనే విడుదల కానుంది. ఈ పరీక్షలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించనుంది. లక్షలాది మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరువుతారు.

ఇంకా చదవండి ...

దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో 2022 ఏడాదిలో ప్రవేశాలకు గాను నిర్వహించనున్న జేఈఈ(JEE), నీట్ (NEET)​ పరీక్షల షెడ్యూల్​ త్వరలోనే విడుదల కానుంది. ఈ పరీక్షలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (National Testing Agency) నిర్వహించనుంది. లక్షలాది మంది విద్యార్థులు(Students) ఈ పరీక్షలకు హాజరువుతారు. అందుకే, జేఈఈ మెయిన్​, నీట్​ పరీక్షల షెడ్యూల్​ కొరకు విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ రెండు పరీక్షలకు సంబంధించిన సమాచారం www.nta.ac.inలో అందుబాటులో ఉంటుంది. జేఈఈ మెయిన్​కు ప్రిపేరయ్యే అభ్యర్థులు జేఈఈ వెబ్‌సైట్(Website) www.jeemain.nta.nic.in ద్వారా, మెడిసిన్​కు(Medicine) ప్రిపేరయ్యే అభ్యర్థులు నీట్​ వెబ్‌సైట్ www.neet.nta.nic.in ద్వారా షెడ్యూల్​ను చెక్​ చేసుకోవచ్చు. జేఈఈ మెయిన్ 2022, నీట్​ 2022 రిజిస్ట్రేషన్ (Registration Process) ప్రక్రియ, ఎగ్జామ్​ ప్యాటర్న్(Exam Pattern)​ గురించి తెలుసుకుందాం.

Working Professional: వర్కింగ్​ ప్రొఫెషనల్స్​కు గుడ్​న్యూస్.. 8 నెలల సమయంలోనే ..


జేఈఈ మెయిన్ 2022..

గతేడాది డిసెంబర్‌లో జేఈఈ మెయిన్ పరీక్ష తేదీలను ప్రకటించారు. అయితే, ఈ సారి జనవరి ప్రారంభమైనా పరీక్ష షెడ్యూల్​ ఇంకా విడుదల కాలేదు. ఈ షెడ్యూల్​ నెలాఖరులోగా విడుదల కానుందని సమాచారం. అయితే, గతేడాది ఫిబ్రవరిలోనే జేఈఈ మెయిన్​ పరీక్ష నిర్వహించగా.. ఈ సారి ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో మార్చిలో మొదటి సెషన్​ జేఈఈ మెయిన్​ పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది. వరుసగా ఏప్రిల్​, మే. జూన్​ నెలల్లో రెండవ, మూడవ, నాలుగవ సెషన్లను నిర్వహించనున్నట్లు సమాచారం. కాగా, జేఈఈ మెయిన్​ పరీక్షను ఏటా నాలుగు సెషన్లలో నిర్వహిస్తారు.

బీఆర్క్​, బీప్లానింగ్​ విద్యార్థులకు మాత్రం సంవత్సరానికి రెండుసార్లు మాత్రమే పరీక్ష జరుగుతుంది. అభ్యర్థులు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సెషన్లకు హాజరు కావచ్చు. అయితే, దేనిలో ఉత్తమ స్కోర్​ వస్తే దాన్నే మెరిట్ జాబితా కోసం పరిగణిస్తారు. ప్రతి సెషన్ పూర్తయ్యాక జేఈఈ మెయిన్ ఫలితాలను ప్రకటిస్తారు. మొదటి సెషన్​లో ఆశించిన స్కోర్​ రాకుంటే రెండో సెషన్​కు రిజిస్ట్రేషన్​ చేసుకోవచ్చు. ఇలా నాలుగు సెషన్లకు హాజరు కావచ్చు. అయితే, నాలుగో లేదా చివరి సెషన్ ముగింపులో ఆల్ ఇండియా ర్యాంక్ లిస్ట్​ను విడుదల చేస్తారు.

UPSC Civil Service: సివిల్ సర్వీసెస్ పరీక్షకు కొత్త డిమాండ్లు.. ఇవి నెరవేరితే ఆ సమస్య తీరినట్లే..


గతేడాది, కరోనా కారణంగా విద్యార్థులకు కొన్ని వెసులుబాట్లు కల్పించారు. వివిధ రాష్ట్ర బోర్డులు తయారు చేసిన సిలబస్ తగ్గింపును హేతుబద్ధీకరించడానికి, విద్యార్థులకు పరీక్షలో నెగెటివ్​ మార్కింగ్​ను ఎత్తేశారు. ఆప్షనల్​ క్వశ్చన్లను కూడా చేర్చారు. కరోనా కారణంగా అనేక రాష్ట బోర్డులు ఈ సంవత్సరం కూడా బోర్డు పరీక్ష సిలబస్‌ను తగ్గించాయి. కాబట్టి, ఈ సంవత్సరం కూడా గతేడాది లాగే పరీక్ష నిర్వహంచే అవకాశం ఉంది.

నీట్ 2022 షెడ్యూల్​...

జేఈఈ మెయిన్ లాగానే నీట్​లో కూడా ఆప్షనల్​ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. అయితే, ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలా కాకుండా, మెడికల్ అడ్మిషన్ టెస్ట్‌లో ఆప్షనల్​ ప్రశ్నలకు నెగెటివ్​ మార్కింగ్​ ఉంటుంది. ఈ పరీక్షను ఏటా రెండు సెషన్లలో నిర్వహిస్తారు. ఎంబీబీఎస్​, బీడీఎస్​, ఆయుష్, వెటర్నరీ కోర్సులు మాత్రమే కాకుండా బీఎస్సీ నర్సింగ్, లైఫ్ సైన్స్ కోర్సులలో ప్రవేశానికి ఇప్పుడు నీట్​ స్కోర్​ను పరిగణలోకి తీసుకుంటున్నారు.

Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, JEE Main 2020, JEE Main 2021, NEET

ఉత్తమ కథలు