JEE Main 2021: ఈ రోజు నుంచే జేఈఈ మార్చి సెషన్ పరీక్షలు.. విద్యార్థులు వెంట తీసుకెళ్లాల్సిన పత్రాలివే..

ప్రతీకాత్మక చిత్రం

జేఈఈ మెయిన్ 2021 మార్చి సెషన్ పరీక్షలు ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం, సాయంత్రం రెండు షిఫ్టుల్లో ఈ పరీక్షను నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేశారు.

  • Share this:
    జేఈఈ మెయిన్ 2021 మార్చి సెషన్ పరీక్షలు ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం, సాయంత్రం రెండు షిఫ్టుల్లో ఈ పరీక్షను నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేశారు. పరీక్షకు అప్లై చేసిన విద్యార్థులు అధికారిక వెబ్ సైట్ nta.ac.in, jeemain.nta.nic.in నుంచి హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు అడ్మిట్ కార్డులతో పాటు ఏదైనా ఓ ఐటీ ప్రూఫ్ ను వెంట తీసుకెళ్లాలని అధికారులు స్పష్టం చేశారు. ఓటర్ ఐడీ, ఆధార్ కార్డును తీసుకెళ్తే సరిపోతుంది. అయితే.. వాస్తవానికి జేఈఈ మార్చి 2021 సెషన్ పరీక్ష మార్చి 15 సోమవారం నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. అయితే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) పరీక్ష తేదీల్లో పలు మార్పులు చేసింది.

    మార్చిన షెడ్యూల్ ప్రకారం మార్చి 16(ఈ రోజు) నుంచి 18 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. దేశ వ్యాప్తంగా 331 పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్, సికింద్రాబాద్, వరంగల్, నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మం, కరీంనగర్, సిద్దిపేట, మహబూబాబాద్, సూర్యాపేట, నిజామాబాద్ తదితర ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఏపీలోనూ 20 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.

    ఇదిలా ఉంటే.. National Eligibility cum Entrance Test - NEET 2021(నీట్ 2021) ఆగస్ట్ 1న జరగబోతోంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ - NTA తన అధికారిక వెబ్‌సైట్ nta.ac.in లో నోటీస్ రిలీజ్ చేసింది. ఏటా 16 లక్షల మందికి పైగా అభ్యర్థులు... మెడికల్, డెంటర్ ఎంట్రన్స్ ఎగ్జామ్‌ రాస్తున్నారు. మరి నీట్ 2021కి సంబంధించిన పూర్తి వివరాల షెడ్యూల్ త్వరలోనే ntaneet.nic.in లో విడుదల కానుంది. ఐతే... ఈ పరీక్ష గురించి చెబుతూ... NTA కీలక విషయం తెలిపింది. ఈ ఎగ్జామ్‌ని ఆఫ్‌లైన్ విధానంలో ఒకే ఒక సారి ఈ సంవత్సరం నిర్వహిస్తామని తెలిపింది. మెడికల్, డెంటల్ కోర్సుల్లో అంటే BSMS, BUMS, BHMSలో అడ్మిషన్ల కోసం నిర్వహించే ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్‌ను 11 లాంగ్వేజీల్లో నిర్వహిస్తామని తెలిపింది. వాటిలో ఇంగ్లీష్, హిందీ కూడా ఉన్నాయి. పరీక్షా విధానంలో మార్పులు ఉంటాయన్న ప్రచారానికి తెరదించుతూ... పరీక్షలో ఎలాంటి మార్పూ ఉండదని తెలిపింది.
    Published by:Nikhil Kumar S
    First published: