Home /News /jobs /

JEE MAIN KEY RELEASED MARKS CHECKING HOW TO TELL IF THERE ARE OBJECTIONS TAKE A LOOK UMG GH

JEE Main 2022: జేఈఈ మెయిన్ కీ విడుదల.. మార్కులు చెకింగ్, అభ్యంతరాలు ఇలా చెప్పాలంటే ! లుక్కేయండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

జేఈఈ మెయిన్-2022, సెషన్ 2  ప్రిలిమినరీ ఆన్సర్ కీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది. ఎన్‌టీఏ అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.nic.in లేదా nta.ac.in ద్వారా అభ్యర్థులు ఆన్సర్ కీని చెక్ చేసుకోవచ్చు.

జేఈఈ మెయిన్-2022, సెషన్ 2 ప్రిలిమినరీ ఆన్సర్ కీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది. ఎన్‌టీఏ అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.nic.in లేదా nta.ac.in ద్వారా అభ్యర్థులు ఆన్సర్ కీని చెక్ చేసుకోవచ్చు. కాగా, జేఈఈ మెయిన్ సెషన్ 2 కోసం 6.29 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. సెషన్ -1 ఫలితాలు ఇప్పటికే విడుదలైన సంగతి తెలిసిందే. అభ్యర్థులు ఈ ఆన్సర్ కీపై ఆగస్టు 5 సాయంత్రం 5 గంటల వరకు తమ అభ్యంతరాలు తెలియజేయవచ్చు. వచ్చిన అభ్యంతరాలను అధ్యయనం చేసి తుది ఆన్సర్ కీని ఎన్‌టీఏ విడుదల చేయనుంది.

ఈ ఏడాది ఇంజినీరింగ్(Engineering) ప్రవేశ పరీక్ష కేవలం రెండు సెషన్లలో మాత్రమే నిర్వహించారు. సెషన్ 2 జులై 25 - 30 మధ్య జరిగింది. సెషన్ 2 ఫలితాలతో పాటు ఫైనల్ రిజల్ట్స్ కూడా త్వరలో విడుదల కానున్నాయి.

* జేఈఈ మెయిన్ సెషన్ -2: ఆబ్జెక్షన్స్ తెలియజేసే విధానం

స్టెప్-1: ఎన్‌టీఏ అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.nic.inను సందర్శించండి

స్టెప్- 2: ప్రిలిమినరీ ఆన్సర్ కీ లింక్‌పై క్లిక్ చేయండి

స్టెప్-3: పీడీఎఫ్‌ను ఓపెన్ చేసి, ఆన్సర్ కీని చెక్ చేయండి

స్టెప్-4: మీరు అభ్యంతరం చెప్పాలనుకుంటున్న ప్రశ్నపై క్లిక్ చేయండి

స్టెప్-5: కరెక్ట్ డాక్యుమెంట్‌ను మార్క్ చేయండి

స్టెప్-6: క్లైమ్‌కు సపోర్ట్ ఇచ్చే డాక్యుమెంట్‌లను అటాచ్ చేయండి

స్టెప్-7: ఫీజు చెల్లించి, సబ్‌మిట్ చేయండి

ప్రతి ఆబ్జెక్షన్‌పై కంప్లైంట్ చేయడానికి రూ.200 ఫీజు వర్తిస్తుంది. ఈ ఫీజు తిరిగి చెల్లించరు. ఎన్‌టీఏ నిబంధనల ప్రకారం అభ్యర్థుల అభ్యంతరం ఆమోదించినా లేదా అంగీకరించకపోయినా వారికి ఇన్‌ఫామ్ చేయరు.

ఇదీ చదవండి: Income Tax Returns: గడువు లోగా ఐటీఆర్ ఫైల్ చేయలేదా ? అయితే ఎన్ని ప్రయోజనాలు కోల్పోతారో తెలుసా !



మార్కులు చెక్ చేసే విధానం
ఫలితాల కంటే ముందుగా మార్కులను అంచనా వేయడానికి, విద్యార్థులు తమ సమాధానానికి సరిపోయే ఆన్సర్ కీలోని ప్రతి సమాధానానికి నాలుగు మార్కులు ఇచ్చుకోవాలి. ప్రతి తప్పు సమాధానానికి, ఒక మార్కు తీసివేయండి. మొత్తం స్కోర్ అంచనా వేసిన రా-స్కోర్ అవుతుంది. ఆన్సర్ కీలో ఏదైనా సమాధానం మారినా, ఫైనల్ ఆన్సర్ కీలో మార్పులు చేసినా.. స్టూడెంట్స్ స్కోర్‌లో తేడాలు ఉండవచ్చు.



పర్సంటైల్ స్కోర్ లెక్కించే విధానం
జేఈఈ మెయిన్ ఫలితాలతో విద్యార్థులు పర్సంటైల్ స్కోర్ పొందుతారు. కంపారేటివ్ మార్కింగ్ విధానంలో ప్రతి సెషన్‌లో వచ్చిన మార్కులు 100- 0 స్కేల్‌గా ట్రాన్స్‌ఫార్మ్ చేస్తారు. దీంతో పర్సంటైల్ స్కోర్ సాధారణ స్కోర్‌గా మారుతుంది. ఇది మెరిట్ లిస్ట్‌ తయారీ చేయడానికి దోహదపడుతుంది. బంచింగ్ ప్రభావాన్ని నివారించడానికి, టై‌ల‌ను తగ్గించడానికి పర్సంటైల్ స్కోర్స్ 7 దశాంశ స్థానాల వరకు లెక్కించనున్నారు.
Published by:Mahesh
First published:

Tags: Career and Courses, Engineering, Jee mains 2022, National Testing Agency

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు