JEE MAIN HALL TICKETS ARE LIKELY TO BE RELEASED IN THE FIRST WEEK OF JUNE THIS IS THE DOWNLOAD METHOD GH VB
JEE Main Admit Card: ఆ రోజు నుంచి జేఈఈ మెయిన్ హాల్‌టికెట్లు విడుదల.. డౌన్‌లోడ్ చేసుకునే విధానం ఇదే..
ప్రతీకాత్మక చిత్రం
జాతీయ స్థాయిలో ఇంజనీరింగ్ ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్ -2022 మొదటి సెషన్ పరీక్ష జూన్ 20 నుంచి 29 వరకు జరగనుంది. ఇందు కోసం అడ్మిట్ కార్డులను జూన్ మొదటి వారంలో ఎన్టీఏ విడుదల చేసే అవకాశం ఉంది.
జాతీయ స్థాయిలో ఇంజనీరింగ్(Engineering) ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్(JEE Main) -2022 మొదటి సెషన్ పరీక్ష(Exam) జూన్ 20 నుంచి 29 వరకు జరగనుంది. ఇందు కోసం అడ్మిట్ కార్డులను(Admit Cards) జూన్ మొదటి వారంలో ఎన్టీఏ విడుదల చేసే అవకాశం ఉంది. అనంతరం సంస్థ అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.nic.inలో అందుబాటులో ఉండనున్నాయి. ఇక జేఈఈ రెండో సెషన్ ఎగ్జామ్‌ను జూలై 21 నుండి 30 మధ్య నిర్వహించనున్నారు. దీంతో ఈ సెషన్‌కు సంబంధించిన అడ్మిట్ కార్డ్‌లను జూలై రెండో వారంలో విడుదల అయ్యే అవకాశం ఉంది. ఎన్‌టీఏ అధికారిక నోటీస్‌లో ఇలా పేర్కొంది. అడ్మిట్ కార్డు విడుదల తేదీలను నిర్ణీత సమయంలో ప్రకటించనున్నట్లు తెలిపింది. ఇందులో పరీక్షా కేంద్రం, ఇతర అవసరమైన వివరాలు ఉంటాయి. “ఎగ్జామినేషన్ సిటీ ముందస్తు సమాచారం, అడ్మిట్ కార్డ్‌ల డౌన్‌లోడ్, ఫలితాల ప్రకటన తేదీలు నిర్ణీత సమయంలో JEE (మెయిన్) పోర్టల్‌లో పబ్లిష్ అవుతాయని ఎన్టీఏ తెలిపింది.
స్టెప్1: అడ్మిట్ కార్డ్ లింక్ యాక్టివేట్ అయిన తర్వాత JEE మెయిన్ 2022 అధికారిక పోర్టల్‌కి లాగిన్ అవ్వండి.
స్టెప్ 2: హోమ్‌పేజీలో అందుబాటులో ఉన్న JEE మెయిన్ 2022 అడ్మిట్ కార్డ్ లింక్‌పై క్లిక్ చేయండి
స్టెప్3: మీ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీని నమోదు చేయండి
స్టెప్ 4: మీ అభ్యర్థనను సమర్పించండి.
స్టెప్5: JEE మెయిన్ 2022కు సంబంధించిన మీ అడ్మిట్ కార్డ్ స్క్రీన్‌పై డిస్‌ప్లే అవుతుంది.
స్టెప్ 6: అడ్మిట్ కార్డు కాపీని సేవ్ చేసి, ప్రింటవుట్ తీసుకోండి. ఈ అడ్మిట్ కార్డును తప్పసరిగా ఒకసారి పరిశీలించండి. తప్పులు ఉంటే ఫిర్యాదు చేయండి.
పరీక్ష రోజున అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులను తప్పనిసరిగా తీసుకెళ్లాలి. లేనిపక్షంలో పరీక్ష హాలులోకి అనుమతించరు. అడ్మిట్ కార్డ్‌లో దరఖాస్తుదారు పేరు, అప్లికేషన్ నంబర్, సబ్జెక్ట్ వివరాలు ఉంటాయి. విద్యార్థులు తప్పనిసరిగా హాల్ టిక్కెట్‌లలోని మొత్తం సమాచారాన్ని ఓసారి క్రాస్-చెక్ చేసుకోవాలి. ఏదైనా సమస్య ఉంటే వెంటనే NTAకు రిపోర్ట్ చేయాలి.
అడ్మిట్ కార్డులో ఉండే సమాచారం
ఇందులో అభ్యర్థి పేరు, తల్లిదండ్రుల పేర్లు, పుట్టిన తేదీ, లింగం, వర్గం, రాష్ట్రం, JEE అప్లికేషన్ నంబర్, పరీక్ష సబ్జెక్ట్ పేర్లు, పరీక్ష తేదీలు, పరీక్షా కేంద్రం చిరునామా, పరీక్ష తేదీ- సమయం, అభ్యర్థి సంతకం- ఫోటో తదితర వివరాలు ఉంటాయి. కాగా, గతేడాది నాలుగు దశల్లో జరిగిన జేఈఈ మెయిన్, ఈసారి రెండు సెషన్లలో నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన టాప్ 2.5 లక్షల మంది విద్యార్థులు JEE అడ్వాన్స్‌డ్ - IIT ప్రవేశానికి హాజరు కావడానికి అర్హత సాధిస్తారు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.