హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

JEE Main Exam 2022: మూడు రోజుల్లో జేఈఈ మెయిన్ పరీక్ష.. కానీ విద్యార్థుల్లో ఆందోళన.. కారణం ఏంటంటే..

JEE Main Exam 2022: మూడు రోజుల్లో జేఈఈ మెయిన్ పరీక్ష.. కానీ విద్యార్థుల్లో ఆందోళన.. కారణం ఏంటంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

జాతీయ స్థాయిలో ఇంజినీరింగ్ ప్రవేశాల కోసం జేఈఈ నిర్వహిస్తారు. ఈ ఏడాదికి సంబంధించిన మొదటి సెషన్ పరీక్షలు జూన్ 21 నుంచి జరగనున్నాయి. అయితే ఈ పరీక్ష రాసే విద్యార్థుల్లో ప్రస్తుతం అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. కారణం ఏంటంటే..

జాతీయ స్థాయిలో ఇంజినీరింగ్(Engineering) ప్రవేశాల కోసం జేఈఈ(JEE) నిర్వహిస్తారు. ఈ ఏడాదికి సంబంధించిన మొదటి సెషన్(First Session) పరీక్షలు(Exams) జూన్ 21 నుంచి జరగనున్నాయి. అయితే ఈ పరీక్ష(Exam) రాసే విద్యార్థుల్లో ప్రస్తుతం అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. కారణం పూర్తి వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం.  జేఈఈ మెయిన్ 2022(JEE Main 2022) పరీక్షలు పలు సార్లు వాయిదా పడుతూ వస్తున్నాయి. ఇప్పటికే అనేక సార్లు తేదీలు(Dates) ప్రకటించిన జాతీయ పరీక్షల సంస్థ ఇటీవల షెడ్యూల్ ను మార్చి ఈ నెల 23 నుంచి 29 వరకు జేఈఈ మొదటి విడత పరీక్షలు నిర్వహిస్తామని ఎన్టీఏ పేర్కొంది. అయినా ఆదివారం వరకు కూడా అడ్మిట్ కార్డులు(Admit Cards) విడదల చేయలేదు. కొన్ని రోజుల క్రితం అంటే జూన్ 14న విద్యార్థులకు ఏ నగరం కేటాయించారో వెల్లడించినా.. పరీక్ష కేంద్రం ఏదన్నది ఇంకా తెలియలేదు.

TS SSC Results 2022 Date Announced: పదో తరగతి విద్యార్థులకు అలర్ట్.. ఆ రోజే పది పరీక్ష ఫలితాలు..


నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) వర్గాలు అడ్మిట్‌కార్డు(Admit Cards) లేనిదే పరీక్షకు(Exam) అనుమతించబోమని తేల్చిచెప్తున్నారు. దీంతో దేశవ్యాప్తంగా ఈ పరీక్షకు హాజరయ్యే 9.50 లక్షల మందికి పైగా అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. కేవలం రెండు తెలుగు రాష్ట్రాల నుంచే దాదాపు 1.50లక్షల మందికి పైగా ఈ పరీక్షకు హాజరుకానున్నారు.ఇంత వరకు హాల్ టికెట్స్ అందుబాటులోకి రాకపోవడంతో నిర్వాహకుల తీరుపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కేంద్రం ఎన్టీఏ ఏర్పాటు చేసిన దగ్గర నుంచి పరీక్షల తేదీలు, నోటిఫికేషన్లు, ఫలితాల వెల్లడితో విద్యార్థులను అయోమయానికి గురిచేస్తోందని విమర్శలు ఉన్నాయి. రాష్ట్రాలను సంప్రదించకుండా కొన్ని నెలల క్రితం జేఈఈ మెయిన్ తేదీలను ప్రకటించి విమర్శలు పాలైంది. దేశంలో వివిధ విద్యాసంస్థల్లో ప్రవేశాలకు ఈ జేఈఈ మెయిన్స్‌ పరీక్ష అనేది ప్రధానమైంది. లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే ఈ పరీక్షల నిర్వహణలో ఎన్టీయే విఫలం అవ్వడంతో పలు మార్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇదీ చదవండి: వర్క్‌ఫ్రమ్ హోమ్‌కే ఐటీ ఉద్యోగుల మొగ్గు.. హైబ్రిడ్ వర్కింగ్ మోడల్‌లో సాఫ్ట్‌వేర్ కంపెనీలు


పాత విధానాలను కొనసాగిస్తూ.. లోఫాలను సరిదిద్ధుకునే ప్రయత్నం చేయడం లేదు. అయితే ఏప్రిల్‌ 16 నుంచే ప్రారంభం కావలసిన ఈ పరీక్షలను ఎన్నో సార్లు పరీక్షల తేదీలను మార్చారు. ఏప్రిల్ 21 నుంచి ప్రారంభిస్తామని చెప్పి.. జూన్‌ 20 నుంచి ప్రారంభిస్తామని మరోసారి ప్రకటించింది. తాజాగా జూన్‌ 23 నుంచి మొదలుపెట్టనున్నట్టు కొద్ది రోజుల క్రితమే వెల్లడించింది. 2021 మార్చిలో ఎన్టీఏ ఫిబ్రవరి సెషన్‌ ఫలితాలను విడుదల చేయకుండానే పరీక్షలను నిర్వహించింది. పరీక్ష కీను కూడా.. రాత్రి 11 గంటలకు విడుదల చేసింది. విడుదల చేసిన ఈ కీలో కూడా.. ఎన్నో తప్పులు దొర్లాయి. గణితంతో పాటు.. పిజిక్స్ లో మూడు ప్రశ్నలకు సంబంధించి కీలను మార్చారు. ఇలా ఒక పద్ధతి ప్రకారం కాకుండా.. ఇష్టం వచ్చిన రీతిలో నిర్వాహకులు ప్రవర్తించడంతో విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు https://jeemain.nta.nic.in/ వెబ్‌సైట్‌ ద్వారా పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, Jee, Jee main 2022, JOBS

ఉత్తమ కథలు