జేఈఈ పరీక్షలకు సంబంధించిన తేదీలు మళ్లీ మారాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇందుకు సంబంధించిన తేదీలను వెల్లడించింది. గతంలో విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం జేఈఈ సెషన్ 1 ఎగ్జామ్స్ ఏప్రిల్ 21, 24, 25, 29, మరియు మే 1, 4 తేదీల్లో జేఈఈ ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. అయితే జూన్ 20, 21, 22, 23, 24, 26, 26, 27, 28, 29 తేదీలకు ఈ ఎగ్జామ్స్ ను మార్చినట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ఇంకా సెషన్ 2 కు సంబంధించి ముందుగా విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం మే 24, 25, 26, 27, 28, 29 తేదీల్లో నిర్వహించాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఆ ఎగ్జామ్స్ ను జులై 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29 మరియు 30 తేదీల్లో నిర్వహించనున్నట్లు తాజా ప్రకటనలో పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే జేఈఈకి సంబంధించిన తేదీలు మారడం ఇది రెండో సారి కావడం గమనార్హం. మొదట విడుదల చేసిన షెడ్యూల్ తో అనేక బోర్డుల ఇంటర్ ఎగ్జామ్స్ తేదీలు మ్యాచ్ కావడంతో తేదీలను మార్చాల్సి వచ్చింది. అయితే ఇంటర్ ఎగ్జామ్స్ కు జేఈఈ ఎగ్జామ్స్ మధ్య ఎక్కువ రోజులు గ్యాప్ లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉందని ఆయా వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. దీంతో ఈ అంశాలను పరిగణలోకి తీసుకున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇంటర్ ఎగ్జామ్స్ కు సంబంధించిన తేదీలను మార్చింది.
అయితే.. ఈ తేదీలను ప్రకటించే, మార్చే సమయంలో వివిధ రాష్ట్రాలను సంప్రదించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జేఈఈ పరీక్షల తేదీలను మార్చడం కారణంగా ఇప్పటికే తెలంగాణ, ఏపీ ఇంటర్ ఎగ్జామ్స్ తేదీలను రెండు సార్లు మార్చాల్సి వచ్చింది. దీంతో విద్యార్థుల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలే కరోనా ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో తీవ్ర ఒత్తిడిలో ఉన్న విద్యార్థులను మరింత ఇబ్బంది పెట్టేలా NTA తీరు ఉందని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.