JEE Main Admit Card 2021: జేఈఈ మెయిన్ అడ్మిట్ కార్డులు విడుదల.. ఈ లింక్ తో డౌన్ లోడ్ చేసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

జేఈఈ మెయిన్స్ ఫిబ్రవరి సెషన్ అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) ఈ రోజు విడుదల చేసింది. పరీక్షకు అప్లై చేసిన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ నుంచి అడ్మిట్ కార్డులను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

  • Share this:
    జేఈఈ మెయిన్ ఫిబ్రవరి సెషన్ అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) ఈ రోజు విడుదల చేసింది. పరీక్షకు అప్లై చేసిన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ నుంచి అడ్మిట్ కార్డులను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. మొత్తం 6. 60 లక్షల మంది జేఈఈ మెయిన్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. భారీగా అభ్యర్థులు పరీక్షకు అప్లై చేయడంతో అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవడం కోసం మూడు లింక్ లను అందుబాటులో ఉంచారు. ఫిబ్రవరి 23, 24, 25, 26 తేదీల్లో రెండు షిఫ్టుల్లో నిర్వహించనున్నారు. మొదటి షిఫ్ట్ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, సెకండ్ షిఫ్ట్ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఉంటుంది. దేశ వ్యాప్తంగా 331 సెంటర్లలో పరీక్ష నిర్వహించేందుక అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

    అడ్మిట్ కార్డులను ఎలా డౌన్ లోడ్ చేయాలంటే..
    -విద్యార్థులు మొదట అధికారిక వెబ్ సైట్ jeemain.nta.nic.in ను ఓపెన్ చేయాలి.
    -అనంతరం అభ్యర్థులు JEE Main Admit Card 2021 లింక్ పై క్లిక్ చేయాలి.
    -అనంతరం నూతన పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ లాగిన్ వివరాలు నమోదు చేయాలి.
    -అనంతరం అడ్మిట్ కార్డును డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

    కరోనా నేపథ్యంలో పలు జాగ్రత్తలు తీసుకుంటూ పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. మాస్కులు ధరించడం, శానిటైజర్ వాడడం, సామాజిక దూరం పాటించడం తప్పనిసరి అని పేర్కొన్నారు.
    Published by:Nikhil Kumar S
    First published: