మీ నగరాన్ని ఎంచుకోండి

    హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

    JEE Main-2023: ఏప్రిల్ 6 నుంచి జేఈఈ మెయిన్ సెషన్-2 పరీక్షలు.. ప్రిపరేషన్ టిప్స్, బెస్ట్ బుక్స్ ఇవే

    JEE Main-2023: ఏప్రిల్ 6 నుంచి జేఈఈ మెయిన్ సెషన్-2 పరీక్షలు.. ప్రిపరేషన్ టిప్స్, బెస్ట్ బుక్స్ ఇవే

     ప్రతీకాత్మక చిత్రం

    ప్రతీకాత్మక చిత్రం

    JEE Main-2023: జేఈఈ మెయిన్ -2023 సెషన్ -1 పరీక్షలు జనవరిలో పూర్తయ్యాయి. ఫలితాలు ఫిబ్రవరిలో వెల్లడయ్యాయి. ఇక ఏప్రిల్ 6 నుంచి సెషన్ -2 పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం NTA ఏర్పాట్లు చేస్తోంది.  జేఈఈ అడ్వాన్స్‌డ్ కోసం అర్హత సాధించాలంటే జేఈఈ మెయిన్ ప్రిపరేషన్‌‌లో భాగంగా స్పెసిఫిక్ సబ్జెక్ట్స్, కోర్ ఏరియాస్‌పై ప్రధానంగా దృష్టిసారించాల్సి ఉంటుంది.

    ఇంకా చదవండి ...
    • Trending Desk
    • Last Updated :
    • Hyderabad, India

    ఇండియా (India)లో ఎక్కువ మంది విద్యార్థులు రాసే ఎంట్రెన్స్‌ ఎగ్జామ్‌లలో జేఈఈ మెయిన్‌ (JEE Main) ఒకటి. ఈ జాతీయ స్థాయి ఇంజనీరింగ్ ఎంట్రెన్స్ టెస్ట్ ద్వారా టాప్ ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఇప్పటికే జేఈఈ మెయిన్ -2023 (JEE Main 2023) సెషన్ -1 పరీక్షలు జనవరిలో పూర్తయ్యాయి. ఫలితాలు ఫిబ్రవరిలో వెల్లడయ్యాయి. ఇక ఏప్రిల్ 6 నుంచి సెషన్ -2 పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం NTA ఏర్పాట్లు చేస్తోంది. జేఈఈ అడ్వాన్స్‌డ్ కోసం అర్హత సాధించాలంటే జేఈఈ మెయిన్ ప్రిపరేషన్‌‌లో భాగంగా స్పెసిఫిక్ సబ్జెక్ట్స్, కోర్ ఏరియాస్‌పై ప్రధానంగా దృష్టిసారించాల్సి ఉంటుంది. జేఈఈ మెయిన్ సెషన్ కోసం నిపుణులు సూచించిన ప్రిపరేషన్ టిప్స్, బెస్ట్ బుక్స్, టైమ్ టేబుల్ ప్లాన్ వంటి వివరాలను ఇప్పుడు పరిశీలిద్దాం.

    * ప్రిపరేషన్ టిప్స్

    ప్రిపరేషన్‌లో క్లిష్టమైన, సుదీర్ఘమైన మ్యాథ్స్, ఫిజిక్స్ ప్రాబ్లమ్స్‌ను సాల్వ్ చేయడం, కెమిస్ట్రీలో NCERT- బేస్డ్ కాన్సెఫ్ట్స్‌పై మాస్టరింగ్ చేయడంపై ఎక్కువ ఫోకస్ చేయాలి. పర్ఫార్మెన్స్‌ను మెరుగుపరచడానికి, టైమ్ మేనేజ్‌మెంట్‌ను ఆప్టిమైజ్ చేయడానికి, అభ్యర్థులు మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్‌కు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి.

    ఫిజిక్స్ కాన్సెఫ్ట్స్‌పై పట్టు సాధించడం కోసం NCERT మెటీరియల్స్‌ను పూర్తిగా రివ్యూ చేయాలి. ప్రిపరేషన్‌లో క్లాస్ నోట్స్ స్టడీకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. NCERT పాఠ్యపుస్తకాలకు సంబంధించి గత పదేళ్ల ప్రశ్నలను ప్రాక్టీస్ చేయండి. పరీక్షలో మంచి స్కోర్ రావాలంటే, అభ్యర్థులు క్లిష్టమైన థియరీస్‌ కంటే మొదట ప్రాబ్లమ్ సాల్వింగ్‌పై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం.

    * టైమ్ టేబుల్ ప్లాన్

    జేఈఈ మెయిన్ సెషన్-2 కోసం ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు తమ ప్రిపరేషన్‌ను రోజుకు కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటలు ఉండేలా టైమ్ టేబుల్ క్రియేట్ చేసుకోవడం చాలా ముఖ్యం. ప్రిపరేషన్‌లో 60 శాతం సమయాన్ని ప్రాబ్లమ్ సాల్వింగ్‌కు కేటాయించాలని నిపుణులు సూచిస్తున్నారు. దీంతో కాన్సెప్ట్స్‌ను మెరుగ్గా అర్థం చేసుకనే, ప్రాబ్లమ్‌ను సమర్థవంతంగా పరిష్కరించే సామర్థ్యం పెరుగుతుందని నిపుణులు పేర్కొన్నారు.

    ఇది కూడా చదవండి : శాలరీ భారీగా వచ్చే ఉద్యోగాలివే..ప్యాకేజీ లక్షల నుంచి కోట్లలో

    * తగినంత నిద్ర

    జేఈఈ మెయిన్ కోసం ప్రిపరేషన్ అనేది ఒక కఠినమైన ప్రక్రియ. ప్రిపరేషన్‌కు ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో అంతే స్థాయిలో హెల్త్‌కు ఇవ్వాలి. ప్రిపరేషన్‌లో అప్పుడప్పుడు బ్రేక్స్ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. పౌష్టికాహారం తీసుకోవడంతో పాటు రోజుకు కనీసం 8 గంటల నిద్ర, వ్యాయామానికి కూడా సమయం కేటాయించాలని నిపుణులు సూచిస్తున్నారు.

    * బెస్ట్ బుక్స్

    NCERT పాఠ్యపుస్తకాలు JEE మెయిన్ కోసం అద్భుతమైన వనరుగా విస్తృతంగా గుర్తింపుపొందినప్పటికీ, విద్యార్థులకు సిఫార్సు చేయడానికి వివిధ ఆథర్స్‌ పాఠ్యపుస్తకాలు కూడా ఉన్నాయి.

    ఫిజిక్స్: అండర్‌స్టాండ్ ఫిజిక్స్-డీసీ పాండే, కాన్సెప్ట్ ఆఫ్ ఫిజిక్స్-హెచ్ సీ వర్మ, ఎన్‌సీఈఆర్టీ టెక్ట్స్ బుక్స్

    కెమిస్ట్రీ: ఆర్గానిక్ కెమిస్ట్రీ-ఎంఎస్ చౌహాన్, ఫిజికల్ కెమిస్ట్రీ-ఎన్.అవస్థి, ఇన్‌ఆర్గానిక్ కెమెస్ట్రీ ఫ్రమ్ ఎన్‌సీ‌ఈర్టీ టెక్ట్స్ బుక్

    మ్యాథమెటిక్స్: సెంగేజ్ మ్యాథ్స్- జీ టెవాణి, ఎన్ సీఈఆర్‌టీ టెక్ట్స్ బుక్స్

    First published:

    Tags: Career and Courses, EDUCATION, JEE Main 2023, JOBS

    ఉత్తమ కథలు