జాతీయ స్థాయి ఇంజనీరింగ్ ఎంట్రెన్స్ టెస్ట్ జేఈఈ మెయిన్-2023 (JEE MAIN 2023) అభ్యర్థులకు అలర్ట్. పరీక్ష నిర్వహణ సంస్థ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) నుంచి కీలక అప్‌డేట్ వచ్చింది. జేఈఈ మెయిన్ 2023 సెషన్-1 పరీక్షలు వివిధ ఎగ్జామ్‌లతో క్లాష్ అవుందని, దీంతో వాయిదా వేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జేఈఈ మెయిన్-2023 సెషన్-1 పరీక్షల తేదీలను ఎన్‌టీఏ తాజాగా సవరించింది. లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం.. సెషన్ -1 పరీక్షలు జనవరి 24, 25, 28, 29, 30, 31, ఫిబ్రవరి 1 తేదీల్లో జరగనున్నాయి. రెండో షిఫ్ట్ పరీక్ష మాత్రమే జనవరి 28న కండక్ట్ చేయనున్నారు. ఈ మేరకు ఎన్‌టీఏ అధికారికంగా ఓ నోటీస్ జారీ చేసింది.
* రివైజ్ వివరాలు
B.E./B.Tech కోసం జేఈఈ మెయిన్ (పేపర్ I, షిఫ్ట్- 1 & షిఫ్ట్- 2) పరీక్షలను జనవరి 24, 25, 29, 30, 31, ఫిబ్రవరి 1 తేదీల్లో దేశవ్యాప్తంగా 290 నగరాలు, విదేశాల్లోని 25 నగరాల్లోని వివిధ సెంటర్స్‌లో నిర్వహించనున్నారు. B.Arch, B.Planning కోసం జేఈఈ మెయిన్ సెషన్-1 (పేపర్ 2A & పేపర్ 2B)ను జనవరి 28న(షిఫ్ట్-2) నిర్వహించనున్నారు.
* ఎగ్జామ్ ప్యాట్రన్
జేఈఈ మెయిన్ పరీక్షలో 90 ప్రశ్నలు ఉంటాయి. గణితం, ఫిజిక్స్, కెమెస్ట్రీ వెయిటేజీ 100 మార్కులకు సమానంగా ఉంటుంది. మూడు సబ్జెక్టుల్లో 25 చొప్పున మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు (MCQs) ఉంటాయి. వీటితో పాటు మరో 10 ప్రశ్నలు న్యూమరికల్ వ్యాల్యుకు సంబంధించినవి ఉంటాయి. వీటిలో విద్యార్థులు కేవలం ఐదిటికి మాత్రమే సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ప్రతి సరైన సమాధానానికి నాలుగు మార్కులు పొందుతారు. ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కును కోల్పోనున్నారు.
జేఈఈ మెయిన్ 2023 సెషన్-1 కోసం ఎగ్జామ్ సిటీ స్లిప్‌ను బుధవారం రిలీజ్ చేసింది. దీంతో అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.nic.in ద్వారా ఎగ్జామ్ సిటీ స్లిప్ వివరాలను చెక్ చేసుకోవచ్చు. త్వరలోనే అడ్మిడ్ కార్డ్‌లను సైతం ఎన్‌టీఏ రిలీజ్ చేయనుంది.
* ఎగ్జామ్ సిటీ స్లిప్ డౌన్‌లోడ్ ప్రాసెస్
ముందుగా ఎన్‌టీఏ జేఈఈ మెయిన్ అధికారిక వెబ్‌సైట్ jeemain-nta.nic.inను విజిట్ చేయాలి. ఆ తరువాత హోమ్ పేజీలోకి వెళ్లాలి. అక్కడ ఎగ్జామ్ సిటీ స్లిప్ సంబంధించిన లింక్‌పై క్లిక్ చేయాలి. దీంతో న్యూ పేజీ ఓపెన్ అవుతుంది. మీ అప్లికేషన్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ వివరాలను ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. దీంతో మీకు సంబంధించిన జేఈఈ మెయిన్ సెషన్ -1 ఎగ్జామ్ సిటీ స్లిప్ డిస్‌ప్లే అవుతుంది. భవిష్యత్ అవసరాల కోసం దాన్ని సేవ్ చేసుకొని, ప్రింట్ తీసుకోండి.
* జూన్ 4న జేఈఈ అడ్వాన్స్‌డ్
కాగా, జేఈఈ మెయిన్‌లో టాప్ 2.5 లక్షల ర్యాంకు సాధించిన అభ్యర్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధిస్తారు. ఈ పరీక్ష ద్వారా ఐఐటీల్లోని ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. JEE అడ్వాన్స్‌డ్ కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏప్రిల్ 30న ప్రారంభంకానుండగా, పరీక్ష జూన్ 4న జరగనుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, EDUCATION, JEE Main 2023, JOBS