హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

JEE Main Tricks: జేఈఈ మెయిన్‌కి ప్రిపేర్ అవుతున్నారా? ఈ టిప్స్ తప్పక తెలుసుకోండి

JEE Main Tricks: జేఈఈ మెయిన్‌కి ప్రిపేర్ అవుతున్నారా? ఈ టిప్స్ తప్పక తెలుసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

JEE Main Tricks: దేశంలోని ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీలలో ప్రవేశాలు కల్పించేందుకు జేఈఈ మెయిన్ పరీక్షను నిర్వహిస్తారు. ఈ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్వహిస్తుంది. జేఈఈ మెయిన్ (JEE Main) పరీక్షలో ఎక్కువ స్కోరు సాధించడానికి సిలబస్ మొత్తం ప్రిపేర్ అయితే చాలదు. కొన్ని టిప్స్ ఫాలో కావాలి.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

దేశంలోని ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీలలో ప్రవేశాలు కల్పించేందుకు జేఈఈ మెయిన్ (JEE Main Exam) పరీక్షను నిర్వహిస్తారు. ఈ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్వహిస్తుంది. జేఈఈ మెయిన్ (JEE Main) పరీక్షలో ఎక్కువ స్కోరు సాధించడానికి సిలబస్ మొత్తం ప్రిపేర్ అయితే చాలదు. కొన్ని టిప్స్ ఫాలో కావాలి. సాధారణంగా ఈ పరీక్షలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌ సబ్జెక్టుల నుంచి మొత్తంగా 75 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో సబ్జెక్టు నుంచి 25 ప్రశ్నలు ఉంటాయి. వాటన్నింటినీ ఏ స్టూడెంట్ కూడా ఆన్సర్ చేయలేరు కాబట్టి ముందుగా సులభమైన వాటికి సమాధానాలు ఇవ్వడంపై శ్రద్ధ పెట్టాలి. కెమిస్ట్రీ ప్రశ్నలను 35-40 నిమిషాలలో పరిష్కరించి మాథ్స్ కోసం 80 నిమిషాలు, ఫిజిక్స్ కోసం ఒక గంట సమయం కేటాయించుకోవాలి. ఇంకా ఫాలో కావాల్సిన టిప్స్, ట్రిక్స్ చాలానే ఉన్నాయి. అవేవో ఇప్పుడు తెలుసుకుందాం.

* మాక్‌టెస్ట్‌లు కీలకం

విద్యార్థులు తమ ప్రిపరేషన్‌ను అంచనా మునుపటి పేపర్‌లను ప్రాక్టీస్ చేయాలి. ఒత్తిడికి అలవాటు పడటానికి, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి మాక్ టెస్ట్‌లు కూడా రాయాలి. జేఈఈ మెయిన్‌లో నెగిటివ్ మార్కులు ఉంటుంది కాబట్టి గెస్ చేసి ఆన్సర్లను పెట్టకూడదు. ఒకే ప్రశ్నపై ఎక్కువ సమయం వృథా చేసుకోకూడదు.

ఒక క్వశ్చన్ ఎక్కువగా టైం తీసుకుంటుంటే దాన్ని వదిలేసి ముందుకు సాగాలి. తర్వాత సమయం ఉన్నప్పుడు దాన్ని ఆన్సర్ చేయాలి. ప్రశ్నను చదివి, ముందుగా ఆప్షన్స్ చెక్ చేయాలి. ఎందుకంటే సరికాని వాటిని ఈజీగా తొలగించి అసలైన సమాధానాన్ని త్వరగా తెలుసుకోవచ్చు. ఏదైనా ప్రశ్నను పరిష్కరించలేకపోతే భయపడకుండా సులువుగా ఉండే వాటికి ముందుగా సమాధానాలు గుర్తించాలి.

* సబ్జెక్ట్ వారీగా ప్రిపరేషన్ స్ట్రాటజీ

ఇది కూడా చదవండి : ప్రీ ప్రైమరీ విద్యార్థుల కోసం సీబీఎస్‌ఈ కొత్త కరికులం.. 2023-24 నుంచి కొత్త రూల్స్..

• మాథ్స్

- JEE మెయిన్‌లో కాలిక్యులస్‌కి అధిక వెయిటేజీ ఉంటుంది కాబట్టి బాగా స్కోర్ చేయడానికి సూత్రాలు, ట్రిక్‌లను గుర్తుంచుకోవాలి.

- కోఆర్డినేట్ జామెట్రీ, సర్కిల్స్‌ కూడా అత్యంత ముఖ్యమైనవి కాబట్టి వాటి సూత్రాలను కూడా గుర్తుంచుకోవాలి.

- 3D జామెట్రీ, వెక్టర్స్, ఇంటిగ్రల్స్ అధిక స్కోరింగ్, క్యాలిక్యులేషన్ ఆధారిత చాప్టర్స్ కావున ఫుల్ మార్కుల కోసం బాగా ప్రాక్టీస్ చేయాలి.

- స్టాట్స్, ప్రబబిలిటీ, PnC చాప్టర్స్‌కి తక్కువ వెయిటేజీ ఉంటుంది కానీ ఇవి చాలా కఠినంగా ఉంటాయి అందుకే వీటిని బాగా ప్రాక్టీస్ చేయాలి.

• ఫిజిక్స్

- ఎన్‌సీఈఆర్‌టీ (NCERT)తో ప్రారంభించి, ప్రాథమిక అంశాలను అర్థం చేసుకోవడంపై దృష్టి పెట్టాలి.

- 11వ తరగతి ఫిజిక్స్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మెకానిక్స్, హీట్, థర్మోడైనమిక్స్, గ్రావిటేషన్‌పై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి.

- మెకానిక్స్ ప్రాబ్లమ్స్ సులభంగా పరిష్కరించడానికి ఫ్రీ బాడీ డయాగ్రమ్స్ ప్రాక్టీస్ చేయాలి

- 12వ ఫిజిక్స్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఎలెక్ట్రో మాగ్నెటిజం, ఆప్టిక్స్, కరెంటు ఎలక్ట్రిసిటీ, మోడ్రన్ ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్‌ చాప్టర్స్‌కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. కరెంటు ఎలక్ట్రిసిటీ అనేది సులభమైన, అత్యంత స్కోరింగ్ చాప్టర్ కాబట్టి తప్పకుండా ఆ చాప్టర్ బాగా ప్రిపేర్ కావాలి.

- EM వేవ్స్, సెమీకండక్టర్స్ వంటి చాప్టర్స్‌కి NCERT బుక్స్ సరిపోతాయి. థర్మోడైనమిక్స్ ఫార్ములాలు గుర్తుంచుకోవాలి. ఇక ఆప్టిక్స్‌లో సైన్ కన్వెన్షన్‌లు, లెన్స్, మిర్రర్ ఫార్ములాలపై చాలా శ్రద్ధ వహించాలి.

• కెమిస్ట్రీ

- కెమిస్ట్రీ సిలబస్‌ను ఫిజికల్, ఆర్గానిక్, ఇనార్గానిక్ కెమిస్ట్రీగా విభజించాలి.

- చాలా సింపుల్ టాపిక్ అయిన ఫిజికల్ కెమిస్ట్రీ ఫార్ములాలు త్వరగా నేర్చుకుని, అప్లై చేయడంపై దృష్టి పెట్టాలి.

- పరీక్షల సమయంలో సమయాన్ని ఆదా చేసేందుకు గుణకారాలు, భాగహారాలు ప్రాక్టీస్ చేయాలి.

- ఆర్గానిక్ కెమిస్ట్రీ ప్రిపేర్ అవుతున్నప్పుడు ముఖ్యమైన ఈక్వేషన్స్ గుర్తుంచుకోవాలి. ఇనార్గానిక్ కెమిస్ట్రీ విషయానికి వస్తే మూలకాలు, వాటి సమ్మేళనాల ట్రెండ్స్‌ను అర్థం చేసుకోవాలి. అలాగే రియాక్షన్స్ ప్రాక్టీస్ చేయాలి.

- NCERT కెమిస్ట్రీ కీలకం కాబట్టి ఒక్క లైన్ కూడా వదిలేయకుండా దానిని పూర్తిగా చదవాలి.

First published:

Tags: Career and Courses, EDUCATION, Exam Tips, JEE Main 2023, JOBS

ఉత్తమ కథలు