మీ నగరాన్ని ఎంచుకోండి

    హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

    JEE Main 2023: జేఈఈ మెయిన్ అభ్యర్ధులకు అలర్ట్.. త్వరలో సెషన్-2 రిజిస్ట్రేషన్స్‌.. ఎగ్జామ్ షెడ్యూల్, అర్హత వివరాలిలా!

    JEE Main 2023: జేఈఈ మెయిన్ అభ్యర్ధులకు అలర్ట్.. త్వరలో సెషన్-2 రిజిస్ట్రేషన్స్‌.. ఎగ్జామ్ షెడ్యూల్, అర్హత వివరాలిలా!

    ప్రతీకాత్మక చిత్రం

    ప్రతీకాత్మక చిత్రం

    JEE Main 2023: దేశంలోని టాప్ ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల కోసం అర్హత పరీక్షగా జాతీయ స్థాయిలో JEE నిర్వహిస్తారు. జేఈఈ మెయిన్-2023 సెషన్ 1 ఫలితాలు ఇటీవల వెల్లడి కాగా, సెషన్స్-2 కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది.

    ఇంకా చదవండి ...
    • Trending Desk
    • Last Updated :
    • Hyderabad, India

    జేఈఈ మెయిన్‌ (JEE Main 2023) అభ్యర్థుల ఎదురుచూపులకు త్వరలోనే తెరపడే అవకాశాలు ఉన్నాయి. దేశంలోని టాప్ ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల కోసం అర్హత పరీక్షగా జాతీయ స్థాయిలో జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్((JEE) నిర్వహిస్తారు. జేఈఈ మెయిన్-2023 సెషన్ 1 ఫలితాలు ఇటీవల వెల్లడి కాగా, సెషన్స్-2 కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 7న రిజిస్ట్రేషన్ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ విండో ఓపెన్ కాలేదు.

    * ఏప్రిల్ 6-12 మధ్య పరీక్షలు

    జేఈఈ మెయిన్ కోసం రిజిస్ట్రేషన్ విండో ఓపెన్ అయిన తరువాత అభ్యర్థులు అధికారిక పోర్టల్స్ jeemain.nta.nic.in లేదా nta.ac.in ద్వారా అప్లై చేసుకోవచ్చు. షెడ్యూల్ ప్రకారం.. జేఈఈ మెయిన్ సెషన్-2 పరీక్షలు ఏప్రిల్ 6, 7, 8, 9, 10, 11, 12 తేదీల్లో నిర్వహించనున్నారు. సెషన్‌-2కు సంబంధించిన ఎగ్జామ్ సిటీ స్లిప్ వివరాలు మార్చి మూడో వారంలో జారీ చేయనున్నారు. ఇక, అడ్మిట్ కార్డ్ మార్చి చివరిలో విడుదల చేయనున్నారు.

    * అర్హత ప్రమాణాలు

    జేఈఈ మెయిన్-2023కు దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థులు తప్పనిసరిగా ఇంటర్ పాసై ఉండాలి. 12వ తరగతి బోర్డు పరీక్షల్లో టాప్ 20 పర్సంటైల్‌లో ఉన్న విద్యార్థులు JEE మెయిన్ 2023లో వారి స్కోర్ ఆధారంగా IIIT, NIT, కేంద్రీయ నిధులతో కూడిన సాంకేతిక సంస్థలు (CFTIs)లో అడ్మిషన్స్ పొందేందుకు అర్హులు.

    * అప్లికేషన్‌ ప్రాసెస్

    ముందుగా జేఈఈ మెయిన్ అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.nic.inను విజిట్ చేయాలి. ఆ తరువాత హోమ్ పేజీలోకి వెళ్లి, జేఈఈ మెయిన్ -2023 సెషన్- 2 రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేయాలి. దీంతో కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్ ఎంటర్ చేయాలి. దీంతో అప్లికేషన్ ఫారమ్ ఓపెన్ అవుతుంది.

    ఇది కూడా చదవండి : 12వ తరగతి అర్హతతో.. నెలకు రూ.30 వేల నుంచి రూ.లక్ష సంపాదన..

    పర్సనల్, అకడమిక్ వివరాలను ఎంటర్ చేయడంతో పాటు అవసరమైన డాక్యుమెంట్లను అప్‌‌లోడ్ చేయండి. ఆ తరువాత జేఈఈ మెయిన్ సెషన్-2 అప్లికేషన్ ఫీజు చెల్లించండి. చివరగా అప్లికేషన్‌ను సబ్‌మిట్ చేసి, భవిష్యత్ అవసరాల కోసం అప్లికేషన్ కాపీని సేవ్ చేసుకోండి.

    * జేఈఈ మెయిన్‌లో రెండు పేపర్లు

    JEE మెయిన్-2023 సెషన్-2 పరీక్ష ఇంగ్లీష్, హిందీ, గుజరాతీ, కన్నడ, అస్సామీ, బెంగాలీ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం, తెలుగు, ఉర్దూతో సహా మొత్తంగా 13 భాషల్లో నిర్వహిస్తున్నారు. జేఈఈ మెయిన్ రెండు పేపర్లుగా ఉంటుంది. BTech/ BE కోర్సుల్లో ప్రవేశాలను పేపర్-1 ఆధారంగా చేపట్టనున్నారు. పేపర్-2 ద్వారా బ్యాచులర్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్, బ్యాచులర్స్ ఆఫ్ ప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు

    * 20 మందికి 100 పర్సంటైల్

    కాగా, జేఈఈ మెయిన్ సెషన్ -1 కోసం 8.6 లక్షల మంది అభ్యర్థులు నమోదు చేసుకోగా, 8.22 లక్షల మంది పరీక్షకు హాజరయ్యారు. సెషన్ -1 పరీక్షలు జనవరి 24 నుంచి జనవరి 31 మధ్య జరిగాయి. ఫలితాలు కూడా ఇటీవల వెల్లడయ్యాయి. జేఈఈ మెయిన్ సెషన్-1లో 20 మంది విద్యార్థులు 100 పర్సంటైల్ సాధించారు.

    First published:

    Tags: Career and Courses, EDUCATION, JEE Main 2023, JOBS

    ఉత్తమ కథలు